దక్షిణం ఫ్యాక్ట్ చెక్ : ఢిల్లీలో సీజేపీ నిరసనకు తరలివచ్చిన యువత అంటూ వైరల్ అవుతున్న వీడియో నిజమేనా?
ప్రచారం : 2026 అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన దృశ్యాలివి.
ఫ్యాక్ట్ చెక్ రిజల్ట్ : తప్పు (False)
వైరల్ వీడియోకు ఢిల్లీలో జరిగిన సీజేపీ నిరసనతో సంబంధం లేదు. ఇది 2026 అక్టోబర్ 10న అసోంలోని టిన్సుకియా నగరంలో జరిగిన మహాలయ వేడుకల వీడియో.
సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతోంది?
ఢిల్లీలో సీజేపీ నిరసనకు ఆంక్షలన్నింటినీ దాటుకుని యువత భారీగా తరలివచ్చిందంటూ, ఒక భారీ జనసమూహం కనిపించే వీడియో ఫేస్బుక్లో షేర్ అవుతోంది.
మాకు అందిన క్లెయిమ్ :
https://www.facebook.com/reel/1778102843238491
పోస్ట్ లో ఏముంది? : (తెలుగులో)
ఎన్ని నిర్బందాలు విధించినా… వాటన్నింటిని దాటుకుని ఢిల్లీ చేరుకున్న యువత… నీ జైళ్ళు సరిపోతాయా గోడీ తాత..? ఇప్పటికే పదివేల మందిని అదుపులోకి తీసుకున్న డిల్లీ పోలీస్… ఇంకా ఎంతమందిని అరెస్టు చేస్తారో చెయ్యండి… #GenZ
(Despite all the restrictions imposed, the youth have managed to overcome them and reach Delhi. Tell me, ‘Godi Tata’—will your jails be enough? The Delhi Police have already taken ten thousand people into custody; go ahead and arrest as many more as you want!)
ఎవరు పోస్ట్ చేశారు? :
అకౌంట్ : Afzal Hussain (ఫేస్బుక్)
ప్రొఫైల్ పరిశీలన : ప్రొఫైల్‌లో ‘స్టూడెంట్’ అని పేర్కొన్నారు. “ఎవరో నీ గొప్పతనం తెలుసుకోలేనంత మాత్రాన నీ విలువ తగ్గదు...” అనే వాక్యం ప్రొఫైల్‌లో కనిపిస్తోంది.
అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ : జనవరి 9, 2016

ఇదే అంశంపై ఇతర పోస్టులు, వివరాలు :
ఫ్యాక్ట్ చెక్ సమయంలో ఇవే దృశ్యాలున్న మరికొన్ని వీడియోలు కనిపించాయి. అయితే, వేర్వేరు వాదనలతో పోస్ట్ చేశారు.
- Venkata Venkata Pitchaiah (ఫేస్బుక్) :
పోస్ట్ లో ఉన్నది: “ఎన్ని నిర్బందాలు విధించినా.. వాటన్నింటిని దాటుకుని ఢిల్లీ చేరుకున్న యువత..”
https://www.facebook.com/reel/1838143233850370

- Ankit Das (ఫేస్బుక్) :
పోస్ట్ లో ఉన్నది: MAHALAYA Tinsukia 2026 #tinsukia #reelsinstagram #2026 #trending #virel “మహాలయ – టిన్సుకియా 2026”
https://www.facebook.com/reel/4666353473598906/

- Aparna Das (ఫేస్బుక్) :
పోస్ట్ లో ఉన్నది: Mahalaya in Tinsukia #viral
“టిన్సుకియాలో మహాలయ”
https://www.facebook.com/reel/28524334023862560/

- Lalithchand Thiruchannapalli (యూట్యూబ్) :
పోస్ట్ లో ఉన్నది: Tinsukia Thana Charali durga puja mahalaya event 2026 part 2
“టిన్సుకియా థానా చరాలి దుర్గా పూజ మహాలయ కార్యక్రమం 2026 – పార్ట్ 2”
https://www.youtube.com/watch?v=gTKSyXKh3oU

కొందరు సీజేపీ నిరసనల దృశ్యాలుగా పోస్ట్ చేస్తే.. మరికొందరు ఇవే దృశ్యాలను అసోంలోని టిన్సుకియాలో జరిగిన మహాలయ వేడుకలుగా పేర్కొంటూ పోస్టు చేశారు.
ఫ్యాక్ట్ చెక్ రిజల్ట్ :
ఇది నిజమేనా?: తప్పు.
వైరల్ వీడియోలో ఢిల్లీలో జరిగిన సీజేపీ నిరసన దృశ్యాలు లేవు. ఈ ప్రచారం తప్పుదోవ పట్టించేదిగా ఉంది.
ఎప్పుడు జరిగింది?: 2026 అక్టోబర్ 10న (మహాలయ రోజు. ఢిల్లీలో సీజేపీ నిరసన జరిగిన రోజే).
ఎక్కడ జరిగింది?: అసోం రాష్ట్రం, టిన్సుకియా నగరంలోని థానా చరియాలి (Thana Chariali) ప్రాంతం.
ప్రచారం : 2026 అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన దృశ్యాలివి.
వాస్తవం : వైరల్ వీడియో అసోంలోని టిన్సుకియా నగరంలో జరిగిన మహాలయ వేడుకలది. ఢిల్లీలో అక్టోబర్ 10న జరిగిన సీజేపీ నిరసనతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రచారం తప్పుదోవ పట్టించేది.
వివరణాత్మక సమీక్ష :
- నిరసన నేపథ్యం :
2026 అక్టోబర్ 10న ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా జరగనున్న యువత నిరసనకు ముందు ఢిల్లీని దిగ్బంధించారని పత్రికా కథనాలు పేర్కొన్నాయి. 45 మెట్రో స్టేషన్లు మూసివేశారని, సీజేపీ నేతలు అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారని ఇతర మీడియా కథనాలు తెలిపాయి.
- దక్షిణం ఫ్యాక్ట్ చెక్ :
దక్షిణం ఫ్యాక్ట్ చెక్ డెస్క్ ఈ వైరల్ వీడియో కీ ఫ్రేమ్‌లను సేకరించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలున్న పలు ఇతర వీడియోలు కనిపించాయి. ఆ పోస్టుల ప్రకారం, ఈ వీడియో 2026 అక్టోబర్ 10న అసోంలోని టిన్సుకియాలో జరిగిన మహాలయ వేడుకలది. వైరల్ వీడియోలోని దృశ్యాలను ఈ వీడియోలతో పోల్చి చూడగా, రెండూ ఒకే కార్యక్రమానికి చెందినవని నిర్ధారణ అయింది.
- జియోలొకేషన్ :
గూగుల్ స్ట్రీట్ వ్యూ సాయంతో లొకేషన్‌ను ధృవీకరించగా, వైరల్ వీడియోలో కనిపిస్తున్న భవనాలు, రోడ్డు ఆకృతి టిన్సుకియాలోని థానా చరియాలి ప్రాంతంతో సరిపోలాయి. దీంతో ఈ వీడియో ఢిల్లీలో కాకుండా అక్కడే చిత్రీకరించినదని స్పష్టమైంది.
గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ :
వైరల్ అవుతోన్న వీడియోలో నుంచి తీసుకున్న కీ ఫ్రేమ్

టిన్సుకియాలోని థానా చరియాలి ప్రాంతం

ముగింపు :
అసోంలోని టిన్సుకియాలో జరిగిన మహాలయ వేడుకల వీడియోను, 2026 అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనకు వచ్చిన యువత దృశ్యాలంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోకు ఢిల్లీలో జరిగిన నిరసనతో ఎలాంటి సంబంధం లేదు.
ఈ అంశానికి సంబంధించిన ఇతర ఉపయోగకరమైన సమాచారం :
By Gopagoni Sapthagiri
