Andhra PradeshNewsNews from StatesPopular NewsRecent NewsTelanganaTrending News

వన్ పీస్ – విధ్వంస రచనకు ఒక సూచన

కమ్యూనికేషన్ విబాగంలో కేవలం చెప్పడం, రాయడం మాత్రమే కాకుండా సింబల్స్ (చిహ్నాలు) కూడా ప్రాధాన్యం ఉంది. ఎక్కువ సందర్భాలలో చెప్పవలసిన దానిని మరింత స్పష్టంగా చెప్పగలుగుతాయి. ఆ సమాచారం అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. వస్త్రధారణ చూడగానే అయ్యప్ప భక్తులని గుర్తుపెట్టగలుగుతాం.

ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఇటీవల ఎన్నికల సంఘం ముందు జరిగిన నిరసన ప్రదర్శనలో అల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) నాయకురాలు నేహా బోరా ధరించిన ‘వన్ పీస్’ (One Piece) దుస్తులు, కేవలం కాకతాళీయంగా వేసుకున్నవా లేక దేశ శ్రావభౌమత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిందా అంటే రెండో అంశమే స్పష్టంగా కనపడుతోంది. గత కొద్ది సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక ఆందోళనలలో ఈ చిహ్నం కనపడం ఇది యాదృచ్చికం కాదు అనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి.

‘వన్ పీస్’ పైరేట్ చిహ్నం ముద్రించిన ఎర్రటి టీ-షర్టును ధరించి భారత ఎన్నికల సంఘం వైపు కవాతు చేసినప్పుడు నేహా బోరా మాటల కంటే ఆ దృశ్యం చాలా వేగంగా ప్రయాణించింది. అది ఏ హానీ చేయని యానిమే (anime) దుస్తులు వలె సాధారణ ప్రేక్షకులకు కనిపించింది. కానీ ఇది ఆందోళన సమయాల్లో పరీక్షించి, ఉపయోగించిన ఒక ‘యాక్షన్ ప్లాన్’ సింబల్ గా జాతీయ భద్రతా విశ్లేషకులకు కనిపించింది. అదే నిజం కూడా. ఎందుకంటే సాధారణ ప్రజానీకానికి అటువంటివి చదివే నైపుణ్యం ఉండదు.

నవ్వుతున్నట్లుండే ఈ స్ట్రా-హ్యాట్ పుర్రె ఏదో కార్టూన్ కాదు. దీనికి చాలా చరిత్రే ఉంది. ఇది జకార్తా, ఖాట్మండు, పారిస్, అంటనానారివో వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉద్యమాల్లో అంతటా పదేపదే ప్రయోగించిన, వ్యవస్థా-వ్యతిరేక ధిక్కారానికి సంబంధించిన ప్రామాణిక ఐకానోగ్రఫీ. అభిజీత్ డిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, నేహా బోరా వంటి కార్యకర్తలు ఈ దిగుమతి చేసుకున్న ‘వన్ పీస్’ పైరేట్ చిహ్నం భారతీయ వీధుల్లోకి తీసుకువచ్చినప్పుడు, దాని దృక్కోణం మారిపోయింది. అది స్థానిక నిరసనలనుండి ఒక పకడ్బందీ అంతర్జాతీయ వ్యూహంలో  భాగంగా  మారుతున్నట్లు కనబడుతోంది.

ఈ సబ్‌కల్చర్‌ను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలలో స్థానిక ప్రభుత్వాలను దెబ్బతీయడానికి, సవాలు చేయడానికి, యువతను రెచ్చగొట్టడానికి, విదేశీ కుట్రలు అమల చేయడానికి ఈ సింబల్ ను పరీక్షించి, పరిశీలించి మెరుగు పరిచారు. ఈ సింబల్ గురించి అవగాహన ఉన్నవారికి దాని ప్రయోగం అర్ధం ఏమిటో తెలుగుస్తుంది.

ఏమి జరిగింది?

అత్యంత కోలాహలంగా అక్టోబర్ 10న జరిగిన బలప్రదర్శనలో భారత ఎన్నికల సంఘం లక్ష్యంగా మారింది. దీనికి కేంద్ర బిందువు? CPI(M-L) అనుబంధ విద్యార్థి విభాగం, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ఇచ్చిన బహిరంగ పిలుపు. “ఢిల్లీ హాత్ ఈ రోజు జంతర్ మంతర్ అవుతుంది!” అని ఆమె ప్రకటించారు. కానీ వాస్తవానికి వీధుల్లోకి వచ్చినది సహజమైన విద్యార్థి ఉద్యమంలా కనిపించలేదు. దేశంలోని కీలకమైన రాజ్యాంగ మూలస్తంభాలలో ఒకదానిపై చేసిన దాడిలాగే ఇది ఉంది.

ఈ సింబల్స్ ను నిశితంగా పరిశీలించండి. రక్తం రంగులో ఉండే ఎర్రటి టీ-షర్టును ధరించి బోరా కనిపించారు – ఇది రాడికల్ వామపక్షవాదానికి తిరుగులేని షేడ్. దీనిపై “వన్ పీస్” అనే పదాలతో పాటు స్ట్రా హ్యాట్‌లో ఉన్న కళ్ళు లేని పుర్రె ముద్రించారు. ఇది ఎటువంటి హాని చేయని పాప్-కల్చర్ అనిమే సాధారణ కంటికి కనిపిస్తుంది. కానీ ఆ చిత్రం చాలా ఉద్దేశపూర్వక సంకేతాన్ని పంపుతొందన్న అంశం జాతీయ భద్రత, విదేశీ నిఘా ప్లేబుక్‌లను గమనిస్తున్న ఎవరికైనా తెలుస్తుంది.

ఇందులో ఎలాంటి పొరపాటూ లేదు: ఇది ఒక అమాయకమైన, రోజువారీ ఫ్యాషన్ ఎంపిక కాదు. ఈ చిహ్నమే సార్వభౌమ దేశాలను స్తంభింపజేయడానికి, విప్లవాలు, యువత-ఆధారిత అశాంతి అంతటా విస్తరింపచేయడానికి  సరిగ్గా క్రమపద్ధతిలో ఆయుధంగా మారింది. అరాచకత్వం సృష్టించడం అన్న ఒకే ఒక్క లక్ష్యంతో దీనిని సరిహద్దులను దాటించి భారత్ లోకి ప్రవేశపెట్టారు.

బోరా దీనిని ధరించడానికి ముందు భారతదేశం వెలుపల జరిగిన నిరసనలలో ఇదే పైరేట్ జెండా కనిపించినంది.  అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో జూలైలో కూడా ఇది కనిపించింది. అంటే దీని ప్రయోగం లక్ష్యం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

ఇది ఒక సాధారణ విద్యార్థి నిరసన కాదు, లేదా యువత కోపం యొక్క ఆకస్మిక విస్ఫోటనం కూడా కాదు. దేశీయ లోపాలను ఉపయోగించుకోవడానికి, వ్యవస్థీకృత అరాచకత్వ అజెండాను ముందుకు నెట్టడానికి న్యూఢిల్లీ వీధుల్లో జరిగిన ఒక ఉద్దేశపూర్వక ప్రయత్నం ఇది.

పూర్తి చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి, మనం గందరగోళాన్ని పక్కనపెట్టి వీటన్నింటిని ప్రారంభించిన దృశ్య సూచనను చూడాలి. ఈ చిహ్నం ఏమిటి? వన్ పీస్ అంటే ఏమిటి?

వన్ పీస్‌లో స్ట్రా హ్యాట్ పైరేట్స్ జెండా దేనిని సూచిస్తుంది

ఈచిరో ఒడా (Eiichiro Oda) 1997లో మొదటిసారిగా సీరియల్‌గా ప్రచురించబడిన జపనీస్ మాంగా అయిన వన్ పీస్‌ను సృష్టించారు. వన్ పీస్ అని పిలువబడే పురాతన నిధి అన్వేషణలో ప్రయాణించే మంకీ డి లఫ్ఫీ, అతని సిబ్బంది, స్ట్రా హ్యాట్ పైరేట్స్ చుట్టూ దీని కథ తిరుగుతుంది. ఈ సిబ్బంది యొక్క జాలీ రోజర్ (Jolly Roger) లఫ్ఫీకి ప్రతిరూపమైన స్ట్రా హ్యాట్ ధరించిన పుర్రెను, దాని వెనుక అడ్డంగా ఉన్న రెండు ఎముకలను వర్ణిస్తుంది. జాలీ రోజర్ అనేది పుర్రె లేదా ఇతర గుర్తింపు చిహ్నంతో ఉండే పైరేట్ జెండాకు ఉన్న సాంప్రదాయ పేరు.

ఈచిరో ఒడా ద్వారా 1997 నుండి సీరియల్‌గా ప్రచురితమవుతున్న వన్ పీస్ సంపూర్ణ వ్యక్తిగత స్వేచ్ఛను అంతిమ ఆశయంగా కలిగిన పైరేట్ కెప్టెన్ అయిన మంకీ డి లఫ్ఫీ ప్రయాణాన్ని సూచిస్తుంది. మాంగా కథనంలో లఫ్ఫీ, అతని బృందం జాలీ రోజర్ అని పిలువబడే విలక్షణమైన చిహ్నం క్రింద పనిచేస్తారు. ఇది స్ట్రా హ్యాట్ ధరించిన పుర్రె. ఈ కధ ప్రధాన విరోధులు – మెరైన్స్ కు “ప్రపంచ ప్రభుత్వం”గా పిలువబడే వంశపారంపర్య ప్రపంచ కులీన పాలన చుట్టూ నడుస్తుంది. కథాంశం అంతటా కూడా  కథానాయకులు విముక్తి బ్యానర్ క్రింద సంస్థాగత సంస్థలు, రాచరికాలు, నియంత్రణ సంస్థలను క్రమపద్ధతిలో లక్ష్యంగా చేసుకుంటారు. సరిగ్గా ఈ స్ట్రా-హ్యాట్ పుర్రె చిహ్నం కింద పనిచేసే పైరేట్, సంపూర్ణమైన, అనియంత్రిత స్వేచ్ఛ కోసం పోరాడే ఒక గొప్ప రక్షకుడిగా రొమాంటిసైజ్ చేస్తారు.

వ్యవస్థా-వ్యతిరేక సెంటిమెంట్ యొక్క రెడీ-మేడ్ బ్లూప్రింట్‌ను ఈ కల్పిత కధనం అందిస్తుంది. వ్యవస్థాగత పాలనను అంతర్గతంగా అవినీతిపూరితమైనదిగా, స్వార్థపూరితమైనదిగా, అణచివేతతో కూడుకున్నదిగా చిత్రీకరిస్తుంది. తద్వారా వ్యవస్థలకు వ్యతిరేకంగా శాశ్వత తిరుగుబాటు యొక్క పునాది కథనాన్ని నిర్మిస్తుంది.

సరళమైన మాటలలో చెప్పాలంటే, ఇది విలాసవంతమైన, అత్యంత ఆకర్షణీయమైన పాప్-కల్చర్ ప్యాకేజీలో చుట్టబడిన రెడ్ రెవల్యూషన్ క్లాసిక్ కథనం. కచ్చితంగా ఆ కారణంగానే ఈ చిహ్నం ఎంపిక చేశారు. ఇది సంక్లిష్టమైన వ్యవస్థా-వ్యతిరేక సిద్ధాంతాన్ని పైకెత్తుకుంటుంది. కఠినమైన రాజకీయ పదాల వినియోగం ఉండదు. ఈ మొత్తం వ్యవహారాన్ని నేరుగా జెన్-జెడ్ (Gen Z)తో మాట్లాడే వైరల్, ఓపెన్-సోర్స్ గా ఆభివర్ణిస్తుంది. ప్రభుత్వ సంస్థలను విలన్‌గా, వీధి-స్థాయి ప్రతిఘటనను వీరోచిత పోరాటం అనే భావన కలిగేలా ఈ చిహ్నం ఇప్పటికే అటువంటి భావనలను కలగచేసింది. ఇదంతా భారతీయ వీధుల్లో ఒక్క బ్యానర్ కూడా ఎగురవేయకముందే జరిగింది.

న్యూఢిల్లీలో ఈ చిహ్నం కనబడడం ఏదో అనుకోని, యాదృశ్చికంగా జరిగిన సంఘటన కాదు. కచ్చితత్వంతో పరీక్షించిన ‘అస్థిరత’ వ్యూహాన్ని అమలు చేయడం. ప్రపంచవ్యాప్తంగా ఇదే ఖచ్చితమైన బ్లూప్రింట్ ఎలా రూపొందిందో చూడండి.

ఇది బహుళ సార్వభౌమ దేశాలలో ఇప్పటికే పరీక్షించిన, అత్యంత కచ్చితత్వంతో అమలు చేసిన కార్యాచరణ ప్లేబుక్. న్యూఢిల్లీ వీధుల్లో స్ట్రా హ్యాట్ జాలీ రోజర్ కనిపించడం అనేది రివల్యూషన్ ప్రోటోకాల్ యొక్క ప్రణాళికలో భాగం మాత్రమే. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరిగిన కీలక ఘర్షణల్లో దీని ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ఆచరణలో ఈ బ్లూప్రింట్ ఎలా పనిచేస్తుందో అర్ధం అవుతుంది.

ఇండోనేషియా, ఆగస్టు 2025: ప్రభుత్వ విధానాలు, రాజకీయ ఫిర్యాదులపై నిరసనల సమయంలో, 2025 ఆగస్టు 17న ఆ దేశ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ జెండా కనిపించింది. కొందరు ఇండోనేషియా అధికారులు ఈ జెండా వాడకాన్ని తీవ్రంగా విమర్శించారు.  ఒక చట్టసభ సభ్యుడు ఇది జాతీయ సమైక్యతకు ముప్పు అని సూచించగా, మరొకరు దీనిని ప్రదర్శించడం దేశద్రోహంతో సమానమని హెచ్చరించారు.

నేపాల్, సెప్టెంబర్ 2025: ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాల్‌లో జరిగిన జెన్-జెడ్ (Gen-Z) నిరసనలో కూడా ఈ జెండా కనిపించింది. ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించిన తర్వాత ఈ ప్రదర్శనలు చెలరేగాయి. ఈ చర్యను దేశంలోని యువత భావప్రకటనా స్వేచ్ఛపై దాడిగా పేర్కొన్నారు.

ఫిలిప్పీన్స్, సెప్టెంబర్ 2025: వరద-నియంత్రణ, సహాయక ప్రాజెక్టుల కోసం ఉద్దేశించిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, కాంట్రాక్టర్ల అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలలో ఈ జెండాను ఎగురవేశారు. ఈ ఆరోపణలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు పదివేల మంది ప్రజలు మనీలాలోని లునెటా పార్క్  వద్ద గుమిగూడారు.

పెరూ, మడగాస్కర్ & బల్గేరియా: ఈ చిహ్నం లాటిన్ అమెరికా, ఆఫ్రికా మరియు తూర్పు ఐరోపా అంతటా వ్యాపించింది.  రాష్ట్ర పాలనను స్తంభింపజేయడానికి, రాజకీయ రాయితీలను బలవంతంగా సాధించడానికి రూపొందించిన వ్యవస్థా-వ్యతిరేక ప్రచారాల సమయంలో వీధి బారికేడ్లు, మున్సిపల్ మౌలిక సదుపాయాలపై కనిపించింది.

ఫ్రాన్స్, యుకె (UK) & అమెరికా: పారిస్‌లోని వీధి ర్యాలీల నుండి లండన్, మెక్సికోలలోని ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల వరకు, విభిన్న స్థానిక ఫిర్యాదులను ఒకే సరిహద్దులు లేని, అధికార వ్యతిరేక బ్యానర్‌ కింద ఏకం చేయడానికి ఈ చిహ్నం వినియోగించారు.

ఈ సరళి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఒక్క సందర్భంలోనూ, వ్యూహం ఒకేలా ఉంది: స్థానిక భద్రతా వ్యవస్థలను దాటవేయడానికి బాహ్య ఆపరేటర్లు, విదేశీ ఇంటెలిజెన్స్ పర్యావరణ వ్యవస్థలు ఓపెన్-సోర్స్, పాప్-కల్చర్ చిహ్నాన్ని ఉపయోగించుకుంటాయి. వారు జెన్ జెడ్ (Gen Z) డిజిటల్ ఆకర్షణను ఉపయోగించుకుంటారు.  వారికి ప్రభుత్వ దౌర్జన్యం అనే కథనాన్ని నూరిపోస్తారు. యువతను  మార్పు కార్యకలాపాల కోసం ముందు వరుసలో నిలబడే సైనికులుగా మారుస్తారు.

ఐసా (AISA) వంటి దేశీయ విద్యార్థి సంఘాలు సరిగ్గా ఇదే చిహ్నాన్ని ధరించి భారత ఎన్నికల సంఘంపైకి కవాతు చేసినప్పుడు, వారు స్థానిక ఆందోళనలను లేవనెత్తడం లేదు. వారు సంస్థాగత పతనాన్ని సృష్టించడానికి, సార్వభౌమ దేశాలను విదేశీ వ్యూహాత్మక నియంత్రణలో ఉంచడానికి రూపొందించబడిన విదేశీ స్క్రిప్ట్‌ను అమలు చేస్తున్నారు.

సంస్థాగత చొరబాటు కోసం డిజిటల్ నేటివ్ సబ్‌కల్చర్‌లను వాడుకోవడం

పాప్ సంస్కృతిని ఆయుధంగా మార్చడం అనేది ప్రమాదవశాత్తూ జరిగిన పరిణామం కాదు, ఇది మానసిక నియంత్రణకు సంబంధించిన ఒక ఇంజనీరింగ్ ప్రక్రియ. భారతదేశం ప్రస్తుతం అత్యంత పెద్ద, అత్యంత హైపర్-కనెక్ట్ అయిన అనిమేషన్ వినియోగిస్తున్న జనాభాతో ఉంది. లక్షలాది మంది జెన్ జెడ్ యువత ప్రతిరోజూ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లు, డిజిటల్ ఫ్యాన్ కమ్యూనిటీలు, వైరల్ ట్రెండ్ లూప్‌ల ద్వారా కనెక్ట్ అయ్యారు. వ్యూహాత్మక ఆపరేటివ్‌లు మరియు AISA వంటి రాడికల్ విద్యార్థి సంఘాలు యువత ఇప్పటికే ఇష్టపడే పాప్-కల్చర్ సూచనలను ఉపయోగించి వారి రాజకీయ ప్రపంచ దృష్టికోణాన్ని మార్చి , వారి సాంస్కృతిక పదజాలాన్ని వారు హైజాక్ చేస్తున్నారు.

 

రోజువారీ యువతను ప్రణాళికాబద్ధమైన అరాచకత్వానికి ఉపయోగపడేలా మార్చడానికి ఈ సబ్‌కల్చర్ పైప్‌లైన్ వ్యవస్థీకృతంగా ఎలా రూపొందిందో చూడండి:

  • చట్టవిరుద్ధమైన ప్రతిఘటనను రొమాంటిసైజ్ చేయడం: ఈ ప్లేబుక్‌లోని ప్రాథమిక అంశం, దేశ వ్యతిరేక ధిక్కారాన్ని ఉద్దేశపూర్వకంగా రొమాంటిసైజ్ చేయడం. వన్ పీస్ (One Piece) లాంటి సిరీస్‌లలో, కథానాయకుడు కేవలం పైరేట్ కాదు- అతను క్రూరమైన ప్రపంచ వ్యవస్థతో పోరాడుతున్న నైతికంగా ఉన్నతమైన “విముక్తిదాత”. వ్యూహాత్మక ఆందోళనకారులు ఈ కల్పిత ప్రాతిపదికను తీసుకుని నేరుగా వాస్తవ ప్రపంచ ప్రజాస్వామ్య సంస్థలకు అన్వయిస్తారు. శాసనోల్లంఘనను వీరోచిత అనిమే కథనంతో ప్రదర్శించడం ద్వారా, తిరుగుబాటు దాని విధ్వంసకర వాస్తవికతను కోల్పోతుంది. గొప్ప, సినిమాటిక్ ధైర్యసాహసాల చర్యగా మారుతుంది.
  • దుండుకుతనాన్ని పెంచడం: ఎన్నికల సంఘం వంటి చట్టబద్ధమైన అధికారంపై దాడి చేయడానికి వీధుల్లోకి రావడం ఒక సాధారణ యువకుడికి  చట్టవిరుద్ధమైన చర్య. కానీ అధునాతనమైన, పాప్-కల్చర్ లో కాలసిపోయినప్పడు ఆ అడ్డంకి అదృశ్యమవుతుంది. స్ట్రా హ్యాట్ (Straw Hat) చిహ్నాన్ని ధరించడం రాజ్యాంగ వ్యతిరేక ఆందోళనను వ్యక్తిగత గుర్తింపునకు వైరల్ స్టేట్‌మెంట్‌గా మారుస్తుంది. యువతను తాము  గందరగోళం సృష్టించడంలో పాల్గొనడం లేదని నమ్మేలా చేస్తారు. వారు “అణచివేత” వ్యవస్థకు వ్యతిరేకంగా తమకు ఇష్టమైన కల్పిత పాత్రల వీరోచిత పోరాటాన్ని చేస్తున్నామన్న భావనతో ఉంటారు.
  • మాకు తెలియదు అని చెప్పడం : అనిమే ఐకానోగ్రఫీని మోహరించడం ఈ విధ్వంసకారులు రెండు ప్రయోజనాలు సాధిస్తారు. ఇది రాడికల్ రాజకీయాల్లోకి యువతను ఆకర్షించడానికి ఇది ప్రవేశ కేంద్రంగా పనిచేస్తుంది. ఇటువంటి ఆందోళనల నిర్వాహకులు. దీనిని ఒక సాకుగా తీసుకుని ఇది యువత పాప్ కల్చర్ లో భాగమని, దీనివల్ల దేశానికి నాష్టం ఏమీ లేదని వాదిస్తారు.

News at Glance

Academic Insights

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *