Art, Culture & ReligionPopular News

కార్పొరేట్, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో మత మార్పిడి : మాదాపూర్ ఉదంతం నేపథ్యంలో ఒక విశ్లేషణ

Introductory Memo:

సాఫ్ట్ వేర్ అంటే.. యువతకు కలల కొలువు. నేటి ఫాస్ట్ యుగంలో స్టూడెంట్స్ ఎక్కువశాతం ఇంటర్మీడియట్ నుంచే సాఫ్ట్ వేర్ కలలు కనడం అనేది పరిపాటి అయ్యింది. బీటెక్ లేదంటే డిగ్రీ పూర్తయ్యిందంటే చాలు.. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు వెతుక్కోవడం.. మరికొందరు ఏ సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరాలనే ఆప్షన్ల కోసం వెతకడం సర్వ సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే, గత కొంత కాలంగా పలు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో అంతర్గతంగా సాగుతున్న వ్యవహారాలు, వేధింపులు, ఒత్తిళ్లు అందరినీ ఆలోచనలో పడేస్తున్నాయి. ఆ ఒత్తిళ్లు, వేధింపులు వృత్తి పరమైనవి కావు.. మత మార్పిడులకు సంబంధించినవి. ఒక మతానికి చెందిన వాళ్లు పక్కా ప్లాన్ తో తమ కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తూ.. తాము చెప్పినట్లు వినేలా మానసికంగా సిద్ధం చేస్తున్నారు. తర్వాత తాము చెప్పిన మతానికి సంబంధించిన గ్రంథాలు చదవాలంటూ.. వాటి గురించి అవగాహన పెంచుకోవాలంటూ.. క్రమంగా మత మార్పిడుల వైపు తీసుకెళ్తున్నారు. లేదంటే ఉద్యోగంలోనూ, వృత్తి పరంగానూ భవిష్యత్తులో ఇబ్బంది కలిగిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

Analytical view/ Analysis:

ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న OnQ India అనే హెల్త్ కేర్ ప్రొవైడర్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇలాంటి ఆరోఫణలే వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగం పోతుందన్న భయంతో బాధిత ఉద్యోగులు ఎవరికీ ఫిర్యాదు చేయలేకపోయారు. అయితే, రోజురోజుకూ ఆ వేధింపులు పెరిగిపోవడంతో అనివార్యంగా తెలిసిన వాళ్ల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో, ఈ వ్యవహారం బయటకు వచ్చింది.  

హైదరాబాద్ మాదాపూర్‌ వేదికగా OnQ India కంపెనీ పనిచేస్తోంది. అయితే,  ఆ సంస్థలో పనిచేస్తోన్న హిందూ మహిళా ఉద్యోగులపై మత మార్పిడి కోసం ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మత మార్పిడికి అంగీకరిస్తే పదోన్నతులు, ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని ప్రలోభపెట్టడం, నిరాకరించిన వారిని పని ఒత్తిడి, వేధింపుల ద్వారా ఇబ్బంది పెడుతున్నారన్న వ్యవహారం అందరినీ ఆందోళనకు గురిచేసింది. అయితే, ఇవి ఆరోపణలు మాత్రమే కాదని, భయంకర వాస్తవాలని తేలింది. ప్రధానంగా కొందరు మిడిల్ మేనేజ్ మెంట్ ఉద్యోగులు తాము చెప్పినట్లు విన్న వాళ్ల ట్రాక్ రికార్డు బాగా రాస్తామని, పదోన్నతుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని ఒత్తిళ్లు తెచ్చారు. తొలుత తమ మత గ్రంథాలను చదవాలని, ఆ తర్వాత క్రమంగా తాము చెప్పిన మతంలోకి మారాలంటూ వేధింపులకు గురిచేశారని బాధితులు కొందరు భయం భయంగానే బయటకు చెప్పారు. ప్రధానంగా ఆ కంపెనీలో పనిచేస్తోన్న హెఛ్ ఆర్ మేనేజర్ ఫిరోజ్, టీమ్ లీడర్ అబ్దుల్ ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

The impact :

VHP, భజరంగ్ దళ్ కార్యాచరణ  

వాస్తవానికి ఏదైనా కంపెనీ గానీ, సంస్థలో గానీ ఇలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే తక్షణమే హిందూ సంఘాలు స్పందిస్తూ ఉంటాయి. ఉన్నతాధికారులు, పోలీసుల దృష్టికి, సమాజం దృష్టికి తీసుకెళ్తూ ఉంటాయి. ఫలితంగా అధికారయంత్రాంగంపైనా, పోలీసులపైనా ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి సంఘటనలను మరుగున పెట్టి రహస్యంగా విచారణ చేయకుండా.. బహిరంగంగా వివరాలు తెలియజేసేలా దర్యాప్తు సాగించేలా చూడటం ఈ ఆందోళనలు, నిరసనల లక్ష్యం. అయితే, నిరసనలు శాంతియుతంగా, చట్టబద్ధంగా జరిగేలా హిందూ సంఘాలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆరోఫణలు ఎదుర్కొంటున్న కంపెనీలు తమ మనుషులతో దాడులు, బెదిరింపులకు పాల్పడుతోన్న ఆనవాళ్లు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తున్నాయి.

ఇప్పుడు మాదాపూర్ లోని OnQ India కంపెనీలో ఉదంతంపై కూడా సమాచారం తెలిసిన వెంటనే VHP, బజరంగ్ దళ్ కార్యకర్తలు కంపెనీ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు.  కంపెనీ దగ్గర బైఠాయించి మత మార్పిడులకు ఒత్తిడి తెస్తోన్న ఉద్యోగులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో సంస్థ నిర్వాహకులు  ఓ దశలో హిందూ సంఘాల కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేశారు. బౌన్సర్లతో నిరసనను అడ్డుకునేందుకు యత్నించారు. విషయం తెలుసుకొని చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన కారులకు నచ్చజెప్పారు. బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకొని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 గతంలో వెలుగు చూసిన ఇలాంటి సంఘటనలు

సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ రంగంలో ఇలాంటి ఆరోపణలు ఇదే మొదటిసారి కాదు. ఇటీవల మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న TCS కార్యాలయంలో ప్రమోషన్లు, బోనస్ లు, శాలరీ హైక్ ల పేరిట కొందరు ముస్లిం ఉద్యోగులు, అధికారులు తోటి యువతులను లోబరుచుకునే ప్రయత్నం చేశారన్న వ్యవహారం బయటకు వచ్చింది. సాక్షాత్తూ మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ కూడా వీటిని నిర్ధారించారు. నమాజ్‌లో పాల్గొనేలా, రంజాన్ రోజుల్లో ఉపవాసం ఉండేలా యువతులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే నాసిక్ టీసీఎస్ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు, హిందూ సంఘాలు పెద్దఎత్తున నిరసన తెలిపాయి. ఈ కేసు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో  విశ్వ హిందూ పరిషత్ స్పందిస్తూ, కార్పొరేట్ రంగంలో మహిళల భద్రత అనే అత్యంత సున్నితమైన అంశంపై పరిశ్రమల సంఘాలు తీవ్రంగా దృష్టి సారించాలని, తమ సభ్య సంస్థలకు తగిన దిద్దుబాటు చర్యలు సూచించాలని కోరింది. FICCI, CII, ASSOCHAM, ICC, BCC, PHDCCI, NASSCOM వంటి పారిశ్రామిక సంస్థలకు VHP ప్రధాన కార్యదర్శి బజరంగ్ బగ్రా బహిరంగ లేఖలు రాశారు. కార్పొరేట్ ప్రపంచం మహిళా ఉద్యోగులకు సురక్షితమైన కార్యాలయ వాతావరణాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి ఆరోపణలు కేవలం ఒకటి రెండు కంపెనీలకే పరిమితం కాలేదు.  గత కొన్నేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు రూపాల్లో మత మార్పిడి ముఠాలు, “లవ్ జిహాద్”, మత ప్రచార కార్యక్రమాలకు పాల్పడుతున్న వ్యవహారాలు పదేపదే తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇది మళ్లీ మళ్లీ పునరావృతమవుతోన్న ఒక సామాజిక వివాదం.

అయితే, ఇలాంటి వాటిని కేవలం మతపరమైన అంశంగా మాత్రమే చూడలేం. కార్పొరేట్ కార్యాలయంలో అధికార దుర్వినియోగం, లైంగిక వేధింపుల చట్టాల పరిధిలోకి వచ్చే వృత్తిపరమైన వేధింపులు, సమాన అవకాశాల నిరాకరణ వంటి తీవ్రమైన సమస్యలుగా కూడా పరిగణించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు

ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలంటి ఆరోపణలపై స్వతంత్రమైన, పారదర్శకమైన దర్యాప్తు జరపాలి. బాధితుల వాంగ్మూలాలు రహస్యంగా, భయరహిత వాతావరణంలో నమోదు చేయాలి. అలాగే, కార్యాలయాల్లో POSH (Prevention of Sexual Harassment) చట్టం, సమాన అవకాశాల నిబంధనలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో తనిఖీ చేయాలి; అవసరమైతే లేబర్ డిపార్ట్‌మెంట్ ద్వారా కంపెనీల ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీల పనితీరుపై ఆడిట్ చేయించాలి. ఏదైనా బలవంతపు మత మార్పిడి రుజువైతే, రాష్ట్రంలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇదే సమయంలో ఆరోఫణలు వచ్చిన కంపెనీల్లో పనిచేసే మిగతా ఉద్యోగుల భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలి.

ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కార్యాలయాల్లో ఇలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొనే ఉద్యోగులు కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు పాటించడం అవసరం. ముందుగా, ఎలాంటి అసౌకర్యకరమైన సూచన, ఒత్తిడి, ప్రలోభం ఎదురైనా వెంటనే దానిని లిఖితపూర్వకంగా ఇమెయిల్, మెసేజ్ రూపంలో నమోదు చేసుకోవాలి. ఇది భవిష్యత్తులో ఫిర్యాదుకు కీలక ఆధారంగా ఉపయోగపడుతుంది. తమ కంపెనీలోని HR విభాగానికి లేదా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ICC)కి అధికారికంగా ఫిర్యాదు చేయాలి; ఇది పనిచేయకపోతే స్థానిక లేబర్ కమిషనర్ లేదా పోలీసులను ఆశ్రయించే అవకాశం కూడా ఉందని అవగాహన పెంచుకోవాలి, తోటి ఉద్యోగులతో అనుభవాలను పంచుకోవడం ద్వారా ఒంటరిగా ఉన్నామన్న భావన తగ్గించుకోవచ్చు, అలాగే ఇలాంటి ధోరణి ఒక్క వ్యక్తికే పరిమితమా లేక వ్యవస్థాగతమా అన్నది కూడా అర్థమవుతుంది.

కంపెనీలు చేపట్టాల్సిన చర్యలు

కార్పొరేట్ సంస్థలు తమ కార్యాలయాల్లో ఇలాంటి ఆరోపణలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. అన్ని కంపెనీలు బలమైన, స్వతంత్రమైన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ICC)లను ఏర్పాటు చేసి, వాటిని నిష్పక్షపాతంగా, రహస్యంగా పనిచేసేలా చూడాలి. మత, కుల, లింగ ప్రాతిపదికన ఎలాంటి వివక్ష లేదా ఒత్తిడి చేయకూడదన్న స్పష్టమైన కోడ్ ఆఫ్ కండక్ట్‌ను రూపొందించి, ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా అవగాహన కల్పించాలి. పదోన్నతులు, జీతభత్యాల పెంపు వంటి నిర్ణయాలు పూర్తిగా పనితీరు ఆధారంగానే జరిగేలా పారదర్శకమైన మూల్యాంకన వ్యవస్థను నెలకొల్పాలి. తద్వారా ఎలాంటి వ్యక్తిగత లేదా మతపరమైన ప్రభావం చొరబడకుండా చూడవచ్చు. ఫిర్యాదులు వచ్చినప్పుడు తక్షణమే, భయరహిత వాతావరణంలో దర్యాప్తు జరిపి, దోషులుగా తేలిన వారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. అలాగే, ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు కంపెనీ యాజమాన్యం మీడియా, ప్రజల ముందు స్పష్టమైన, బాధ్యతాయుతమైన ప్రకటన చేయడం ద్వారా విశ్వసనీయతను కాపాడుకోవచ్చు.

మత మార్పిడి నిరోధక చట్టాలు

భారతదేశంలో బలవంతపు మతమార్పిడిని అరికట్టడానికి వివిధ రాష్ట్రాలు మత మార్పిడి నిరోధక చట్టాలను అమలు చేస్తున్నాయి.

మత మార్పిడి నిరోధక చట్టాలు అమల్లో ఉన్న ప్రధాన రాష్ట్రాలు :

  • ఉత్తర ప్రదేశ్
  • మధ్యప్రదేశ్
  • గుజరాత్
  • ఉత్తరాఖండ్
  • హిమాచల్ ప్రదేశ్
  • ఛత్తీస్‌గఢ్
  • జార్ఖండ్
  • రాజస్థాన్
  • ఒడిశా
  • హర్యానా
  • కర్ణాటక
  • అరుణాచల్ ప్రదేశ్
  • మహారాష్ట్ర

మతమార్పిడి నిరోధక చట్టాల గురించి కంపెనీలు, ఉద్యోగులు, హిందూ సంఘాలు కూడా అవగాహన పెంచుకోవాలి. ఏ రాష్ట్రంలో ఎలాంటి కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయన్న అంశంపై ప్రధానంగా కార్పొరేట్, సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చైతన్యం పెంచాల్సిన ఆవశ్యకత ఉంది.

Conclusion: తాజాగా మాదాపూర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఆరోపణలు, గతంలో నాసిక్ టీసీఎస్ కేసు వంటి నిర్ధారితమైన సంఘటనల నేపథ్యంలో చూస్తే, కార్పొరేట్ కార్యాలయాల్లో మత ప్రాతిపదికన వేధింపులు అనే అంశం ఇప్పుడు కేవలం ఒక ఐసోలేటెడ్ ఘటనగా కాకుండా, పదేపదే చర్చకు వస్తున్న సమస్యగా మారుతోంది. అయితే, ఏ ఆరోపణనైనా అది మత మార్పిడికి సంబంధించినదైనా, మరే అంశమైనా నిష్పాక్షిక దర్యాప్తు, చట్టబద్ధ ప్రక్రియ ద్వారా నిర్ధారించుకోవాలి. ప్రభుత్వం, కంపెనీలు, ఉద్యోగులు, హిందూ సంఘాలు అందరూ తమతమ పరిధిలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే కార్యాలయాల్లో నిజమైన భద్రత, సామరస్యం సాధ్యమవుతాయి.

Useful Links:

https://telugu.samayam.com/latest-news/india-news/maharashtra-assembly-passes-anti-conversion-bill-and-up-to-7-years-jail-and-heavy-fines-for-violators/articleshow/129623051.cms

https://www.bbc.com/telugu/india-54945488

https://telanganatoday.com/vhp-calls-for-nationwide-anti-conversion-law-cites-national-security-concerns#:~:text=%E2%80%9CThe%20conspiracy%20exposed%20in%20Nashik%20is%20not,general%20secretary%20Surendra%20Jain%20in%20a%20statement.

Academic Insights :

https://en-wikipedia-org.translate.goog/wiki/Religious_conversion?_x_tr_sl=en&_x_tr_tl=te&_x_tr_hl=te&_x_tr_pto=sge

https://vajiramandravi-com.translate.goog/upsc-exam/anti-conversion-law/?_x_tr_sl=en&_x_tr_tl=te&_x_tr_hl=te&_x_tr_pto=sge

Social Media Links :

https://www.youtube.com/watch?v=Ptsz4quBRvw#:~:text=Bajrang%20Dal%20activists%20protested%20at%20OnQ’s%20Madhapur,the%20link%20below%3A%2D%20Watch%20Live%20Here%3A%20https%3A%2F%2Fyoutube.com%2Fli

https://www.youtube.com/watch?v=ZvrEfRqddEc

https://x.com/TeluguBulletin/status/2092288451592982868?s=20

https://x.com/Vamshi_Patel1/status/2092201795980546274?s=20

https://x.com/Insane4Nation/status/2092085913950343549?s=20

https://x.com/Sagar4BJP/status/2092074154531205419?s=20

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *