Andhra PradeshNationalNewsPoliticsPolitics & GovernanceTelanganaTelugu

ఆందోళన, అరాచకం ద్వారా అధికార మార్పిడికి కుట్ర

భారతదేశం ప్రభుత్వాన్ని సవాల్ చేయడానికి ఆందోళనకారులు ఉపయోగించిన పాలకవర్గ మార్పుపై నినాదాలు, ఘర్షణాత్మక నిరసన పద్ధతులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వాటిలో రాజకీయ జవాబుదారీతనం, వ్యవస్థాపరమైన స్థిరత్వం, అనుసరించిన పద్ధతులు ప్రధానమైనవి.

Introductory note: పాలకవర్గ మార్పు కోసం ఒక వివాదాస్పద పిలుపు, బంగ్లాదేశ్ తిరుగుబాటును ఒక విద్యార్థి నాయకురాలు ప్రశంసించడం, భద్రతా దళాల గురించి ఒక యూట్యూబర్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు, విదేశీ నిధుల ఆరోపణలు భారతదేశ నిరసన రాజకీయాలను కొత్తగా పరిశీలించవలసిన పరిస్థితి కల్పించాయి. ఇవన్నీ విడివిడి అసమ్మతి ప్రకటనలా లేక భారతీయ రాజ్య వ్యవస్థలతో నిరంతర ఘర్షణకు సంబంధించిన విస్తృత వ్యూహానికి సూచికలా అన్నదే ప్రశ్న.

ఒక ప్రభుత్వాన్ని బ్యాలెట్ బాక్స్ ద్వారా ఓడించవచ్చు. దానిని పార్లమెంటులో సవాల్ చేయవచ్చు, కోర్టులో ఎదుర్కొనవచ్చు, వీధుల్లో విమర్శించవచ్చు. ఇవి ప్రజాస్వామిక హక్కులు. కానీ రాజకీయ సమీకరణ క్రమంగా వ్యవస్థలను చట్టవిరుద్ధం చేయడం, ప్రజా జీవితాన్ని స్తంభింపజేయడం, ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించడం జరిగినప్పుడు వీటిని నిశితంగా పరిశీలించవలసిందే. ప్రతిపక్షం తన క్రియాశీలక పాత్రను విస్మరించి నిస్తేజంగా మారినప్పుడు అస్థిరపరిచే రాజకీయాలు ప్రారంభమవుతాయి.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల చుట్టూ ఉన్న తాజా వివాదం మనకు అనేక అంశాలను తెలియచేస్తుంది.

Analytical view: సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ నిరసనలు ‘ప్రభుత్వ మార్పు’’  కోసమేనని బహిరంగంగా ప్రకటించారు. ఆయన చాలా స్పష్టంగా తాను చెప్పదలచింది చెప్పారు. దానిపై ఎటువంటి గందరగోళం లేదు : “అవును, మాకు ప్రభుత్వ మార్పు కావాలి… ఇందులో తప్పేమిటి? అవును, ఇది ప్రభుత్వ మార్పు కోసం జరిగే పోరాటమే.  మేము దానిని ఎలాగైనా సాధించి తీరుతామని నేను ఈ రోజు చెబుతున్నాను.”

ఈ డిమాండ్‌ను ప్రశాంత్ భూషణ్ ఒక ప్రజాస్వామిక హక్కుగా సమర్థించగా, సాధారణ ఎన్నికల పోటీకి మించిన అజెండాను ప్రతిపక్షాలు అనుసరిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ (BJP) ఆరోపించింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో చేసిన ఇతర వ్యాఖ్యలతో కలిపి చూసినప్పుడు ఈ ప్రకటన మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సమస్య కేవలం ఎన్నికల ప్రక్రియలపై అభ్యంతరాలకే పరిమితం కాలేదు; ఆందోళనకు ఆపాదిస్తున్న రాజకీయ లక్ష్యంతో కూడా ముడిపడి ఉంది.

నేహా బోరా వ్యాఖ్యలు

ప్రశాంత్ భూషణ్ ప్రకటన వెనువెంటనే, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరా భారతదేశంలో కూడా దేశంలో ఒక ఉద్యమం రావడానికి బంగ్లాదేశ్ యొక్క Gen-Z ఉద్యమాన్ని ఒక నమూనాగా ఉదహరించారు. AISA అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ యొక్క విద్యార్థి విభాగం. బంగ్లాదేశ్ నిరసనకారులను “మాకు దారి చూపినందుకు” అభినందనలు అని ఒక వీడియో సందేశంలో నేహా బోరా చెప్పారు.  బంగ్లాదేశ్‌లో జరిగిన ఉద్యమమే ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న పరిణామాలకు స్ఫూర్తినిచ్చిందని కూడా పేర్కొన్నారు. షేక్ హసీనా పదవీచ్యుతురాల కావడానికి దారితీసిన నిరసనలను ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్‌లో “ప్రజాస్వామ్యం, ఓటరు హక్కుల పోరాటం” ఇప్పుడు “భారతదేశం సమస్య కూడా” అని బోరా అభివర్ణించారు.

ఈ బంగ్లాదేశ్ పోలిక చర్చను మరింత తీవ్రతరం చేసింది. బంగ్లాదేశ్‌లో 2024 uprising విద్యార్థుల నిరసనలతో ప్రారంభమై, చివరికి హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ముగిసింది. అది అనేకమంది చనిపోవడానికి కూడా కారణం అయింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వారు సరిగ్గా దేనిని పునరావృతం చేయాలనుకుంటున్నారు అన్నది –  శాంతియుత నిరసనల నిర్వహణనా, లేక భారీగా జనసమీకరణ ద్వారా ప్రస్తుత ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థను తలక్రిందులు చేయడమా?

ఈ తేడాను కేవలం ఒక వాదనగా కొట్టిపారేయలేము. బంగ్లాదేశ్ అనుభవంలో తీవ్రమైన హింస చోటు చేసుకుంది. హిందువులతో సహా మైనారిటీలపై దాడులు జరిగాయి. రాజ్యాంగబద్ధమైన మార్గాలయిన ఎన్నికలలో పోటీ చేసి ప్రభుత్వాలను మార్చడం కాకుండా  ఉధృతమయిన వీధి పోరాటాల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించాలనే ఆలోచన, అది సర్వసాధారణమే అని సూత్రీకరించడం ప్రమాదం. దీనిని ప్రశ్నించవలసిందే.

ధ్రువ్ రాఠీ పిలుపు

పోలీసులు, సాయుధ దళాల గురించి యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు మరొక సీరియస్ అంశాన్ని మనముందు ఉంచుతున్నాయి.

భారతదేశ ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా ఢిల్లీ పోలీసు సిబ్బందిని తాను ప్రేరేపించడానికి ప్రయత్నించానని రాఠీ ఇటీవల అంగీకరించారు. తాను నిర్బంధంలో ఉన్నప్పుడు పోలీసు సిబ్బందితో ఎలా మాట్లాడాడో, మోదీ ప్రభుత్వాన్ని ధిక్కరించి ‘విప్లవం’ ప్రారంభించేలా వారిని ఎలా రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడో ‘ది రెడ్ మైక్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఠీ చిరునవ్వుతో గుర్తు చేసుకున్నారు.

ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా భద్రతా సిబ్బందిని రెచ్చగొట్టడం జవాబుదారీతనానికి, రాజకీయ ధిక్కరణ మధ్య రేఖను చెరిపివేసే ప్రమాదం ఉంది. ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని పరిశీలిస్తే విషయం అర్ధం అవుతుంది. ఇది తిరుగుబాటుకు స్పష్టమైన పిలుపుగా కనిపిస్తోంది. భారతదేశ భద్రతా దళాలు రాజకీయ ఒత్తిడికి సాధనాలుగా మారవు. ఎన్నికైన ప్రభుత్వానికి అణుకువగా ఉండటం వాటి విధి. అదే పటిష్ట ప్రభుత్వానికి బలం.

దీప్కే నిధుల విజ్ఞప్తి

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వివాదాస్పద బిలియనీర్ జార్జ్ సోరోస్‌ను డబ్బు కోసం అభ్యర్థించడం ఒక వీడియోలో బయట పడింది. దేశంలో జరుగుతున్న ఆందోళనలు, వాటికి విదేశీ నిధులు కొత్త రాజకీయ సమీకరణాన్ని మన ముందుకు తెస్తున్నాయి. వివిధ దేశాలలో రాజకీయ ఫలితాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు,  వాటికి అంతర్జాతీయ నిధులు అన్ని కూడా సోరోస్ తో లింక్ అవుతున్నాయి.

ప్రశాంత్ భూషణ్ ప్రభుత్వ మార్పు వాదన, భారతదేశానికి నమూనాగా బంగ్లాదేశ్ యొక్క Gen-Z ఉద్యమానికి నేహా బోరా మద్దతు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాలని పోలీసులను, సాయుధ దళాలను కోరినట్లు చెబుతున్న ధ్రువ్ రాఠీ విజ్ఞప్తితో పాటు దీప్కే ప్రకటన- వీటన్నింటినీ ఒక చోట పేరిస్తే మనకు చాలా విషయాలు అర్ధం అవుతాయి. ఈ ప్రకటనలు ప్రభుత్వాన్ని విమర్శించడం నుండి ఎన్నికైన ప్రభుత్వ అధికారాన్ని సవాల్ చేసే దిశగా సాగే రాజకీయ కథనాన్ని సూచిస్తున్నాయి. ప్రభుత్వ మార్పును ఒక రాజకీయ లక్ష్యంగా సాధారణీకరించడమే వీటన్నింటిలో ఉన్న ఉమ్మడి అంశం. దీప్కే సోరోస్ నుండి ఏదైనా డబ్బు పొందారా లేరా  అనేది వేరే విషయం. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలోనే దీప్కే ప్రకటనను పరిశీలించాలి.

CJP నిధుల వివాదంలో మరో కోణం కూడా ఉంది. అమెరికాలోని కొందరు దాతలు CJP సంస్థకు, దాని ప్రచారానికి నిధులు సమకూరుస్తున్నారని అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ ఆరోపించారు. విదేశీ జోక్యాన్ని దీప్కే ఖండించి ఉండవచ్చు, కానీ ఆరోపణ గానీ లేదా నిరాకరణ గానీ ఈ విషయాన్ని తేల్చలేవు. విదేశీ నిధులపై తుది నిర్ణయానికి రావడానికి పారదర్శక ఖాతాలు, రిజిస్ట్రేషన్ రికార్డులు, ధృవీకరించదగిన ఆర్థిక ప్రకటనలు అవసరం.

“ప్రభుత్వ మార్పు” – బ్యాలెట్లు సరిపోనప్పుడు

‘ప్రభుత్వ మార్పు’ అనే పదానికి ఎన్నికల ద్వారా సాధారణ ప్రభుత్వ మార్పునకు మించిన అర్థాలున్నాయి. బలవంతంగా  లేదా బెదిరింపుల ద్వారా ఉన్న ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా  ప్రభుత్వ మార్పుగా కేంబ్రిడ్జ్ డిక్షనరీ చెపుతోంది. ప్రభుత్వ పతనం, దాని స్థానంలో మరొకటి రావడాన్ని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా కూడా ప్రభుత్వ మార్పుగా వర్ణిస్తుంది. ఆక్స్ఫర్ రిఫరెన్స్ దీనిని హార్డ్ పవర్, సైనిక చర్య లేదా స్థానిక మిలీషియాలకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టి భర్తీ చేయడం అని వర్ణిస్తుంది.

అంతర్జాతీయ రాజకీయాలలో ‘ప్రభుత్వ మార్పు’ అనే పదాన్ని భయపెట్టి లేదా బెదిరించి ప్రభుత్వాన్ని మార్చడం, బయటి శక్తుల ప్రాబల్యంతో ప్రభుత్వాలను పడగొట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఉన్న ప్రభుత్వం అకస్మాత్తుగా మారిపోవడం వంటి సందర్భాలలో దీనిని వాడుతున్నారు.

ప్రశాంత్ భూషణ్ చేసిన ప్రకటన ఈ నేపథ్యంలో రాజకీయ మార్పు ఉద్దేశించిన మార్గాలపై ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతుంది. వారి ఉద్దేశం ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఓటర్లను ఒప్పించడమా, లేక ఎన్నికల ప్రక్రియ ద్వారా కాకుండా బయటి నుండి ఒత్తిడి తెచ్చి అధికారంలో ఉన్నవారిని దించడమా?

శాంతియుత నిరసన, విమర్శ, జవాబుదారీతనం కోసం డిమాండ్లు ప్రజాస్వామిక హక్కులే. కానీ ఒక ప్రభుత్వ విధానాలను నిరసించడం వేరు, ఎన్నికల రహిత ఒత్తిడి ద్వారా దానిని తొలగించాలని కోరడం వేరు. భారీగా ప్రజలను సమీకరించి ప్రదర్శనలు చేయయడం ద్వారా  రాజ్యాంగ ప్రక్రియల ద్వారా తమ లక్ష్యాలను చేరాలనుకుంటున్నారా లేక ఉన్న అధికార వ్యవస్థను ధిక్కరించి దానిని పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తోందా అనేదానిపై ఈ తేడా ఆధారపడి ఉంటుంది.

ప్రభుత్వాలను సవాల్ చేయడానికి, విమర్శించడానికి, ఓటు ద్వారా గద్దె దింపడానికి ప్రజాస్వామ్యం అనుమతిస్తుంది. అలా కాకుండా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడాన్ని ఒక ప్రజా ఉద్యమం తీసుకురావడం ప్రజాస్వామ్యబద్ధం అనిపించుకోదు.

ఆందోళన అరాచకానికి అజెండాగా మారినప్పుడు

ఈ ‘నాయకులు’ అని పిలవబడే వారి ప్రకటనలు రాజకీయ అసమ్మతికి సంబంధించిన విడివిడి వ్యక్తీకరణలు కావు. ఇవన్నీ కలిపి, ఎన్నికైన ప్రబుత్వయాన్ని చట్టవిరుద్ధం చేయడానికి, శాశ్వత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి, రాజకీయ మార్పునకు చట్టబద్ధమైన సాధనంగా, వ్యవస్థాపరమైన అంతరాయాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించే రాజకీయాలను సూచిస్తున్నాయి. ఇది ‘మొబోక్రసీ’కి దారితీస్తుంది. ప్రభుత్వ మార్పునకు పిలుపు బహిరంగంగా వినిపించినప్పుడు, పొరుగు దేశం యొక్క అశాంతిని భారతదేశానికి నమూనాగా చూపినప్పుడు, ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని పోలీసులను, సాయుధ దళాలను కోరినప్పుడు వాటి పరిణామాలు సాధారణ ప్రతిపక్ష రాజకీయాలకు మించి ఉంటాయి. రాజకీయ లక్ష్యాన్ని సాధించడం కోసం వ్యవస్థలు తమ రాజ్యాంగ పాత్రలను విడిచిపెట్టేలా ఒత్తిడికి గురిచేసే పరిస్థితులను సృష్టించడానికి, అరాచకత్వాన్ని సృష్టించడానికి చేసే ప్రయత్నమే ఇందులో ఉన్న ఉమ్మడి సూత్రం.

వ్యవస్థల  కొనసాగింపు, ప్రజా విశ్వాసంపై ఆధారపడి భారతదేశ ఆర్థిక పురోగతి, మౌలిక సదుపాయాల విస్తరణ, పెరుగుతున్న వ్యూహాత్మక ప్రభావం ఉంటాయి. రాజకీయ ప్రతిపక్షం ప్రజాస్వామ్యంలో అంతర్భాగమే.  కానీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి, ప్రజా అసంతృప్తిని తీవ్రతరం చేయడానికి, పోరాడితే మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రచాచారం చేసే స్థాయికి ప్రతిపక్షం దిగజారకూడదు. రాజకీయ నాయకులు ఇటువంటి ఆందోళనలను సమర్ధించి మద్దతు ఇచ్చినప్పుడు దాని ప్రభావం కేవలం వరూ లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వం మీద మాత్రమే ఉండవు. తదుపరి ప్రభుత్వాలపై కూడా ఆ ప్రభావం ఉంటుంది.

ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఆందోళన, ఉత్తర్వులను ధిక్కరిచడం, అవిధేయతకు పిలుపు, వ్యవస్థపై  తిరుగుబాటును రెచ్చగొట్టే ప్రతి ప్రయత్నాన్ని చట్టబద్ధమైన రాజకీయ అభివ్యక్తికరణగా అంగీకరించాలని అర్థం కాదు. ఎన్నికలు పాలించే అధికారాన్ని ఇస్తాయి. రాజ్యాంగం జవాబుదారీతనానికి, మార్పునకు మార్గాలను సూచిస్తుంది.

అసమ్మతి ఉనికిలో ఉండటం ప్రధాన ఆందోళన కాదు, కానీ అటువంటి సమీకరణ ఏ రాజకీయ లక్ష్యం వైపు వెడుతోందనేది ముఖ్యం. బహిరంగ ప్రకటనలు పదేపదే ప్రభుత్వ మార్పును కోరుతున్నప్పుడు, అశాంతిని కొనియాడుతున్నప్పుడు, భద్రతా యంత్రాంగంలో ప్రతిఘటనను ప్రోత్సహిస్తున్నప్పుడు, అవి నిరంతర అశాంతి, రాజకీయ ప్రయోజనాలను సాధించే సాధనంగా మారే ఆందోళనకరమైన అజెండాను వెల్లడిస్తున్నాయి.

News at a glance

Prashant Bhushan’s ‘Want Regime Change’ Call, BJP Says ‘We Told You So’
https://www.ndtv.com/india-news/sir-protests-cjp-prashant-bhushans-want-regime-change-call-bjp-says-we-told-you-so-12193127

“We want regime change, nothing wrong with that”: Prashant Bhushan  https://www.aninews.in/news/national/politics/we-want-regime-change-nothing-wrong-with-that-prashant-bhushan20261015175208/

‘Forgive your enemies once, friends twice, but never traitors’: Kiren Rijiju on ‘regime change’ remark https://telanganatoday.com/forgive-your-enemies-once-friends-twice-but-never-traitors-kiren-rijiju-on-regime-change-remark

‘Educate, Agitate, Organise’: German YouTuber Dhruv Rathee Provokes Army & Police to Challenge Elected Govt
https://www.republicworld.com/india/educate-agitate-organise-german-youtuber-dhruv-rathee-provokes-army-police-to-challenge-elected-govt-2026-10-15-138998

Complaint Filed Against Dhruv Rathee Over Alleged Remarks Inciting Army, Police To Revolt
https://www.news18.com/india/complaint-filed-against-dhruv-rathee-over-alleged-remarks-inciting-army-police-to-revolt-ws-kl-10384768.html

Why are foreigners interfering? Dipke, US singer spar over CJP funding claims 

https://www.indiatoday.in/world/story/mary-millben-abhijeet-dipke-clash-cjp-us-funding-claims-ptag-3017591-2026-10-15

By the numbers

When governments fall outside the ballot box 

Country and year What happened Outcome 
Sri Lanka, 2022 Mass protests erupted amid economic collapse, shortages of fuel and food, and anger over the Rajapaksa family’s rule. Protesters stormed the presidential residence and other government premises. President Gotabaya Rajapaksa fled the country and resigned.
Bangladesh, 2024 Student protests against public-sector job quotas escalated into a nationwide uprising demanding Prime Minister Sheikh Hasina’s resignation. The crackdown and mounting violence intensified the crisis. Hasina resigned and fled on August 5. An interim administration subsequently took charge.
Nepal, 2025 Youth-led protests, triggered by a social-media ban and fuelled by anger over corruption, privilege and unemployment, escalated into violent unrest. Government buildings were attacked and set on fire. Prime Minister K. P. Sharma Oli resigned, and an interim government was formed.
Sudan, 2019 Months of mass demonstrations against economic hardship and President Omar al-Bashir’s long rule culminated in military intervention. The military removed Bashir, but the transition to civilian democratic rule remained contested.
Algeria, 2019 The Hirak protest movement mobilised large crowds against President Abdelaziz Bouteflika’s bid for another term. Bouteflika resigned after weeks of mass protests and pressure from the military leadership.
Syria, 2024 An armed opposition offensive advanced rapidly after years of civil war, culminating in the collapse of Bashar al-Assad’s government. Assad fled Damascus on December 8. This was an armed rebel victory, not a mob-led removal of a democratically elected government.
Niger, 2023 Presidential guards detained President Mohamed Bazoum, and the military seized power, citing security and governance failures. A military coup overthrew the elected president and suspended constitutional institutions.
Venezuela, 2024 Protests erupted after the disputed presidential election, with opposition supporters challenging Nicolás Maduro’s declared victory. The protests did not remove Maduro from power. This was an unsuccessful challenge to the incumbent government, not a successful overthrow.

Academic insights

Hybrid Wars: The indirect adaptive approach to regime change
By Andrew Horybho, Institute for Strategic Studies and Predictions, PFUR
https://resistir.info/livros/hybrid_wars_updated.pdf

The CIA and regime change: Lessons from the Cold War
Bergin, Eleanor Reid, Woodrow Wilson School
https://dataspace.princeton.edu/handle/88435/dsp01h415pc89r

Social media pulse

“This is a fight for regime change, and we will make it happen.” : Prashant Bhushan
https://x.com/HemanNamo/status/2110709780566487475

Yes, We Want Regime Change in India
https://x.com/mitrapredator/status/2110700810548216159

Imran Masood started to talk about REGIME CHANGE openly now.  https://x.com/PoliticalKida/status/2110995487302255089

Pawan Khera joins the gang too!
https://x.com/PoliticalKida/status/2110999746026623051

Deep State, Social Media & Regime Change !
https://x.com/MonaPatelT/status/2110849385978593688

Neha Bora talks to Bangladeshi SSF which led the COUP against Sheikh Hasina
https://x.com/Indian_Analyzer/status/2110383878489706497

Neha Bora Says Bangladesh Youth Inspired Indian Gen Z
https://www.youtube.com/watch?v=-8RfK-l4r-A

Reporter to Neha: Do you want to recreate Bangladesh anarchy in India?
https://x.com/farzlicioustahe/status/2110735094189322569

Replicate Bangladesh in India?
https://x.com/Pamphlet_in/status/2110726931247174089

Dhruv Rathee Faces Veterans’ Backlash Over Army, Police Remarks
https://x.com/AugadhBhudeva/status/2110824231026217367

mche Goa. 

https://www.facebook.com/amchegoa/videos/2899876943719988/

 

The cat is out of the bag!! 

https://www.facebook.com/narendra.sawaikar

This is outright sedition. The armed forces are meant to protect the nation, not rise in revolt – Maj Gen Harsha Kakar

https://x.com/kakar_harsha/status/2110983395824275660?s=20

Our reading list

In the Name of Democracy: JP Movement and the Emergency
by Bipan Chandra

A political history book examines the relationship between the Jayaprakash Narayan movement and India’s Emergency of 1975–1977, offering a provocative interpretation of how both political opposition and government authoritarianism threatened democratic institutions.

Overthrow: America’s Century of Regime Change from Hawaii to Iraq

by Stephen Kinzer

Citing cases, the book argues that ‘regime change’ has been an integral part of U.S. foreign policy for more than 100 years. Starting with the overthrow of the Hawaiian monarchy in 1893 and continuing through the Spanish-American War and the Cold War and into our own time, the United States has not hesitated to overthrow governments that stood in the way of its political and economic goals.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *