వామపక్ష ముసుగు సంస్థలు ఎలా పనిచేస్తాయో తెలుసా?
మహారాష్ట్రలో ప్రస్తుతం నడుస్తున్న ఒక కేసు మావోయిస్టు ముసుగు సంస్థలపై దృష్టిని మరల్చింది. మావోయిస్టు ఫ్రంట్లు అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి, 2014 ప్రారంభంలో గుర్తించిన కొన్ని సంస్థల పేర్లు ఏమిటి? ఈ అంశాలను గుర్తించినది కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం కాదు.
2014 ప్రారంభంలో, కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం లోక్‌సభలో ‘యాక్టివ్ మావోయిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్’ జాబితాను ప్రవేశపెట్టింది. పదేళ్లకు పైగా కాలం తర్వాత ఇలాంటి ఫ్రంట్ సంస్థలపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 2025ని ప్రవేశపెట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతో కలిసి కాంగ్రెస్ యాక్ట్ ని సవాలు చేసింది.
మహారాష్ట్రలోనే గుర్తించబడిన మావోయిస్టు ఫ్రంట్లు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. వీటిలో చాలా వరకు పట్టణ ప్రాంతాల నుండి పనిచేస్తున్నాయి. అయినప్పటికీ ఈ నెట్వర్క్ రాష్ట్ర సరిహద్దులను దాటి విస్తరించి ఉంది. దేశవ్యాప్తంగా 187 మావోయిస్టు ఫ్రంట్ సంస్థలను గుర్తించగా, ఒక్క మహారాష్ట్రలోనే 64 ఉన్నాయి. మావోయిస్టు గ్రూపులు ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి, ప్రజలను సమీకరించడానికి, దేశ వినాశకర ఎజెండాతో ప్రజలను ఆకర్షించడానికి ఈ సంస్థలు ఒక వేదికను అందిస్తాయి.
ఈ సంస్థలు ఎలా పనిచేస్తాయి? అవి ఒక నిర్దిష్ట నిర్మాణం లేదా సమగ్ర నమూనాను అనుసరిస్తాయా? 2014 ప్రారంభంలో మహారాష్ట్రలో ఏ సంస్థలను గుర్తించారు? వీటన్నిటికీ ఇక్కడ సమాధానాలు దొరుకుతాయి.
మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, 2025, రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు కొందరు కార్యకర్తలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లకు సమాధానమిస్తూ, రాష్ట్రం ‘అర్బన్ మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా’ మారడం వల్లే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో తెలిపింది.
రాష్ట్రాల్లోకెల్లా అత్యధికంగా మహారాష్ట్రలోనే 64 గుర్తించబడిన మావోయిస్ట్ ఫ్రంట్ సంస్థలు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ ఎం సీ త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేత్నాతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ అఫిడవిట్‌పై రీజాయిండర్ దాఖలు చేయడానికి పిటిషనర్లకు సమయం ఇచ్చింది. విషయం ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలతో ప్రమేయం లేకుండా వరుస ప్రభుత్వాలు పర్యవేక్షిస్తున్న భారతదేశ అంతర్గత భద్రత, ఆందోళనల సుదీర్ఘ కోణాన్ని కూడా ఈ అంశాలు గుర్తుచేస్తాయి. మావోయిస్టు ఫ్రంట్ సంస్థలు ఎలా పనిచేస్తాయి, అవి అనుసరించే నిర్మాణం, మావోయిస్టు పత్రాలలో ప్రతిబింబించే వారి ప్రతిపాదిత సిద్ధాంతం, గుర్తించబడిన కొన్ని సంస్థల పేర్లపై స్పష్టమైన డాక్యుమెంటేషన్ ఉంది.
‘అర్బన్ నక్సల్’, ‘దిమాగీ నక్సల్’: మావోయిస్టు పత్రాలు ఏం చెబుతున్నాయి?
మొదట ‘అర్బన్ నక్సల్,’ ఇటీవల ‘దిమాగీ నక్సల్’ వంటి పదాలపై వివాదం ఇటీవలి సంవత్సరాలలో తీవ్రమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమను తాము మేధావులుగా, కార్యకర్తలుగా లేదా విద్యావేత్తలుగా పరిచయం చేసుకుంటూనే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రేమిస్ట్ (వామపక్ష తీవ్రవాద) ఎజెండాను సమర్థించే వారిని వర్ణించడానికి ‘దిమాగీ నక్సల్’ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ తర్వాత మాజీ కేంద్ర హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తాను “దిమాగీ నక్సల్ అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను” అని వ్యాఖ్యానించడంతో వివాదం మరింత ముదిరింది.
కానీ ఈ సమస్య రాజకీయ వాద ప్రతివాదనలకు మించి విస్తరించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ హయాంలో నిషేధించబడిన సిపిఐ (మావోయిస్ట్) పత్రాలలోనే చాలా వరకు సమాధానం ఉంది.
వీటిలో, ‘అర్బన్ పెర్స్పెక్టివ్: అవర్ వర్క్ ఇన్ అర్బన్ ఏరియాస్’ అనే పత్రం పట్టణ కార్యకలాపాల కోసం మావోయిస్టు ప్రణాళికల గురించిన సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. అది ఇలా పేర్కొంది: “చట్టవిరుద్ధమైన, చట్టబద్ధమైన నిర్మాణాల మధ్య సరైన సమన్వయం చేసుకుంటూ, పోరాట రూపాలను దశలవారీగా పెంచుతూ, ప్రభుత్వ అధికారానికి వ్యతిరేకంగా నిలబడేలా ప్రజలను సిద్ధం చేసే విధానం మనకు ఉండాలి.”
ఈ వ్యత్యాసం స్పష్టంగా ఉంది: ‘చట్టవిరుద్ధమైన’ నిర్మాణాలు రహస్యంగా పనిచేస్తాయి, కాగా ‘చట్టబద్ధమైన’ నిర్మాణాలు బహిరంగ, రెజిస్టర్డ్, ప్రజా సంఘాల ద్వారా పనిచేస్తాయి. మరొక మావోయిస్టు పత్రం ‘లీగల్ డెమోక్రటిక్’, రహస్య, ‘ఓపెన్ రివాల్యూషనరీ,’ ‘కవర్ ఆర్గనైజేషన్స్’ వంటి వివిధ రకాల ప్రజా సంఘాలను నిర్మించడం గురించి మాట్లాడుతుంది. రాజకీయ పరిస్థితికి అనుగుణంగా సాధ్యమైనంత విస్తృతమైన నెట్‌వర్క్‌ను సృష్టించడం, ఈ సంస్థల యొక్క సరైన సమన్వయం కనుగొనడమే దీని లక్ష్యం అని అది పేర్కొంది.
ఈ పత్రాలు ఏఏ సంస్థలు ఇలా పని చేస్తాయన్న స్పష్టంగా చెపుతున్నాయి: ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి, మహిళా సంఘాలు, కుల ఆధారిత సంస్థలు, ‘జాతీయ’ సంస్థలు, రచయితలు, న్యాయవాదులు, ఉపాధ్యాయుల సంఘాలు, అలాగే సాంస్కృతిక సంస్థలు. కాంట్రాక్ట్ కార్మికులు, నిరుద్యోగం, కుల అణచివేతలు, మతతత్వం, మహిళల రక్షణ, విద్య, అవినీతి, ప్రాంతీయ వెనుకబాటుతనం, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లపై సమస్యల పనిచేసే సంస్థలు. ఇవి క్రమంగా అణచివేత, ప్రపంచీకరణ, హిందూత్వ, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ఏర్పడే సంస్థల వరకు దీని పరిధి విస్తరించింది.
పట్టణ సమీకరణకు మావోయిస్టుల విధానాన్ని గ్రహించడానికి ఇది ఒక మార్గాన్ని అందిస్తుంది. గడచిన రెండు దశాబ్దాలుగా, పట్టణాలు, నగరాలు, జిల్లా కేంద్రాలు, రాష్ట్ర రాజధానులు, ఢిల్లీలలో ఇటువంటి సంస్థలు నిర్మించారు, ప్రోత్సహించారు. సామాజిక లేదా రాజకీయ అశాంతిని రేకెత్తించే సామర్థ్యం ఉన్న సంఘటనలను విస్తరించడానికి, సోషల్ మీడియా ద్వారా ప్రజలను సమీకరించడానికి, నిరసనలు, ప్రచారాల ద్వారా గుంపులను వీధుల్లోకి తీసుకురావడానికి వారి నెట్‌వర్క్‌ను ఉపయోగించవచ్చు.
నిర్వాహకులకు, సాధారణ భాగస్వాములకు మధ్య ఉన్న వ్యత్యాసం ముఖ్యం. సాంప్రదాయ నిరసనలు, ఆందోళనలు లేదా బహిరంగ సభలలో చేరే ప్రజలకు వాటి వెనుక ఉన్న పెద్ద రాజకీయ వ్యూహం తెలియకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ, వారి భాగస్వామ్యం ఈ విస్తృత ఎజెండాకు చట్టబద్ధతను, ప్రజా రక్షణను (పబ్లిక్ కవర్) అందిస్తుంది.
ఈ సందర్భంలోనే ‘అర్బన్ నక్సల్’, ‘దిమాగీ నక్సల్’ వంటి పదాలు భారత రాజకీయ నిఘంటువులోకి ప్రవేశించాయి. మావోయిస్టు పత్రాలు ఈ లేబుల్‌ల వెనుక ఉన్న వ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
మావోయిస్ట్ ఫ్రంట్ల A1 నుండి A7 నిర్మాణం
సిపిఐ (మావోయిస్ట్), దాని ఫ్రంట్ సంస్థలు ఇప్పటికే నిషేధం లో ఉన్నాయి. కానీ, వారి కేడర్లు కొత్త ఫ్రంట్ సంస్థలను ఏర్పాటు చేసి, వివిధ అంశాలపై ప్రజలలో అశాంతిని సృష్టించే ఎజెండాతో కొనసాగుతున్నారు. మావోయిస్ట్ ఫ్రంట్లు రెండు విధాలుగా పనిచేస్తాయి – మొదటి విధానంలో ‘స్పష్టమైన’ ‘ కారణాలను తీసుకుని వాటికి ‘పోరాటాల’ రూపాన్ని ఇచ్చే ప్రజా సంఘాలు. రెండవ విధానంలో సమన్వయం, సమీకరణ, సిద్ధాంతాన్ని వంటబట్టేలా చేయడం కోసం పనిచేయడం.
మావోయిస్టుల అర్బన్ ఫ్రంట్లు ఏడు రకాలుగా ఉన్నాయి – A1 నుండి A7 వరకు.
- A1 – అధికారంలో ఉన్న ప్రభుత్వం (ఏ పార్టీతో సంబంధం లేకుండా) భద్రతా దళాల ప్రతిష్టను దిగజార్చడానికి వివిధ సంఘటనలలో ‘ఫాక్ట్-ఫైండింగ్’ (సత్యశోధన) చేసే సంస్థలు. ఇది మహిళలు, విద్యార్థులు, మానవ హక్కులు మొదలైన వాటి కోసం ప్రత్యేక విభాగాలను కలిగి ఉంది. పోలీసు ఎన్కౌంటర్లలో నక్సలైట్లు/మావోయిస్టులు మరణించిన తర్వాత, ఈ ‘సత్యశోధకులు’ ప్రత్యక్షమై, ఘటనా స్థలాన్ని సందర్శించి, నివేదికను రూపొందించి, ఎన్‌కౌంటర్‌ను ‘అదనపు జ్యుడీషియల్ హత్యలు’ అని పిలుస్తారు. మావోయిస్టులు పోలీసులను చంపినప్పుడు, ఈ సంస్థలు కనిపించవు.
- A2 – జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదాన్ని, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటును ‘జాతీయ పోరాటాలు’ అని పిలవడం. విడిపోవడానికి, విభజన కారణాలను ప్రోత్సహించే సంస్థలతో టాక్టికల్ యునైటెడ్ ఫ్రంట్ (TUF)ను ఏర్పాటు చేయడంలో నిమగ్నం కావడం.
- A3 – ‘ప్రజల ప్రతిఘటన’, నిర్వాసితుల వ్యతిరేక ఐక్యత మొదలైన వాటి గురించి మాట్లాడే అంతర్జాతీయ కమిటీలు. ఇవి భారతదేశ అంతర్గత సమస్యలను అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లడంలో నిమగ్నమై ఉన్నాయి. వీటిలో ‘విముక్తి’, ‘పోరాటాలు’, ‘ప్రతిఘటన’, ‘స్వయం నిర్ణయాధికారం’ వంటి పదాల వినియోగాన్ని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తెచ్చే విద్యావేత్తలు ఉంటారు.
- A4 – ప్రధానంగా మూడు రకాల ప్రజా సంఘాలు: రహస్య విప్లవ ప్రజా సంఘాలు, బహిరంగ, అతి తక్కువగా బయటకు వచ్చే విప్లవ ప్రజా సంఘాలు, ‘పార్టీకి (సిపిఐ-మావోయిస్ట్) నేరుగా సంబంధం లేని’ బహిరంగ చట్టబద్ధమైన ప్రజా సంఘాలు. ‘బహిరంగ చట్టబద్ధ ప్రజా సంఘాల’ పరిధిలోని పట్టణ ప్రక్రియ మూడు విస్తృత విభాగాలుగా వర్గీకరించబడింది – ఫ్రాక్షనల్ వర్క్, కవర్ ఆర్గనైజేషన్లు, మరియు లీగల్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్లు.
- A5 – ప్రధానంగా విశ్వవిద్యాలయాల స్థాయిలో ఉండే ఉపాధ్యాయ సంఘాలు, సౌకర్యాన్ని బట్టి ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి విద్యార్థులకు భావజాలాలను పరిచయం చేస్తాయి. వారిని మావోయిస్టుల ఆలోచనా విధానంతో ప్రభావితం చేస్తాయి. ఇవి ముఖ్యంగా సెంట్రల్ యూనివర్శిటీలపై దృష్టి సారించి విద్యార్థి సంఘాలు లేదా యూనియన్ల ఏర్పాటుకు చురుగ్గా సహకరిస్తున్నాయి.
- A6 – ప్రచురణలు, ప్రభావ కార్యకలాపాల విభాగం. ఇది ఎన్కౌంటర్లలో హతమైన ఉగ్రవాదులను, మావోయిస్టులను కొనియాడే, భద్రతా దళాలను, ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపే ప్రచురణలను నడుపుతుంది.
- A7 – ‘రాజకీయ ఖైదీలు’ డొమైన్లో పనిచేస్తుంది. మావోయిస్టులు తమ అరెస్టయిన కేడర్ల కోసం ఈ పదాన్ని ఉపయోగిస్తారు. నిషేధిత మావోయిస్టు ఫ్రంట్ సంస్థలలో ఒకటైన – కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ – A7లో భాగం.
భారతదేశంలో 187 మావోయిస్ట్ ఫ్రంటల్స్ యాక్టివ్‌గా ఉన్నాయి, మహారాష్ట్రలోనే 64 ఉన్నాయి
దేశవ్యాప్తంగా వివిధ వర్గాల మావోయిస్టు ఫ్రంట్ సంస్థలు చురుగ్గా ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం, ఎనిమిది రాష్ట్రాల్లో కనీసం 187 ఇటువంటి సంస్థలు పనిచేస్తున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 64 ఉండగా, తెలంగాణ (29), బీహార్ (24), ఆంధ్రప్రదేశ్ (19), కేరళ (19), జార్ఖండ్ (14), ఛత్తీస్‌గఢ్ (11), ఒడిశా (7) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఈ 187 సంస్థల్లో 46 సంస్థలపై నిషేధం విధించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మహారాష్ట్ర, బీహార్ లేదా కేరళలో గుర్తించబడిన మావోయిస్టు ఫ్రంట్లలో ఏ ఒక్కటీ నిషేధించబడలేదు. నిషేధించబడిన సంస్థలలో జార్ఖండ్‌లో 14, ఛత్తీస్‌గఢ్‌లో 11, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలో ఏడేసి చొప్పున ఉన్నాయి.
అన్ని రాష్ట్రాల్లోకన్నా మహారాష్ట్రలోనే మావోయిస్ట్ ఫ్రంట్ సంస్థలు అత్యధిక సంఖ్యలో గుర్తించారు. అనేక అంశాలు ఈ రకమైన నెట్‌వర్క్‌ల కోసం రాష్ట్రానికి వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఇస్తున్నాయి. ఇది అధికంగా పట్టణీకరించబడింది. సుదీర్ఘ తీరప్రాంతంతో పాటు విస్తృతమైన రహదారి, రైలు, విమాన అనుసంధాన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. మహారాష్ట్ర వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఫైనాన్స్ వంటి విభిన్న పునాదితో ప్రధాన ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా కూడా ఉంది.
దీని భౌగోళిక ప్రాంతం మరొక కోణాన్ని జోడిస్తుంది. మహారాష్ట్ర గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక మరియు తెలంగాణలతో సరిహద్దులను పంచుకుంటుంది, చారిత్రాత్మకంగా వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు నమోదైన అనేక రాష్ట్రాలకు ఇది అనుసంధానించబడి ఉంది.
ఈ రాష్ట్రంలో సామాజిక, సాంస్కృతిక, న్యాయ, విద్యా, పౌర-సమాజ సంస్థల విస్తృత నెట్వర్క్ కూడా ఉంది. ఇటువంటి బహిరంగ, చట్టబద్ధమైన వేదికలను మావోయిస్టు నెట్‌వర్క్‌లు తమ ప్రభావాన్ని పెంపొందించడానికి, మద్దతును సమీకరించడానికి లేదా తమ కార్యకలాపాలకు రక్షణగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇది భద్రత నేపథ్యంలో చూడవలసిన అంశం.
యుపిఎ హయాంలోనే మావోయిస్ట్ ఫ్రంటల్స్ పేర్ల వెల్లడి
మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, 2025 యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, దాని నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం దేశంలో ‘యాక్టివ్ మావోయిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్’ జాబితాను సమర్పించింది. ఇందులో మొత్తం 74 సంస్థలను ప్రస్తావించారు రాష్ట్రాల వారీగా వాటిని వర్గీకరించారు.
ఎటి నానా పాటిల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్‌పిఎన్ సింగ్ ఫిబ్రవరి 18, 2014న లోక్‌సభలో ఈ జాబితాను ప్రవేశపెట్టారు.
అటవీ ప్రాంతాలలో భద్రతా కార్యకలాపాలు తీవ్రతరం కావడంతో సురక్షితమైన ప్రాంతాలకోసం
మావోయిస్టు కేడర్లు ‘పట్టణ ప్రాంతాలతో సహా సాఫ్టర్ ఏరియాస్’ మారే ధోరణిని ప్రదర్శించారని సింగ్ పేర్కొన్నారు. మావోయిస్ట్ ల రహస్య ఉద్యమానికి మద్దతు ఇవ్వడంలో బహిరంగంగా పని చేస్తున్న ఫ్రంట్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన వివరించారు.
“అటువంటి సమయాల్లో, ఓవర్ గ్రౌండ్ ఫ్రంట్ సంస్థలు ఆయుధ కేడర్లకు సురక్షితమైన ప్రాంతాలను చూపిస్తాయి. ఫ్రంట్ సంస్థలు మావోయిస్టు యుద్ధ యంత్రానికి అవసరమైన సరఫరాల కొనుగోలు మొదలైన వాటికి కూడా సహకరిస్తాయి” అని సింగ్ చెప్పారు. మావోయిస్ట్ లపై చట్టపరమైన చర్యలు అమలు ప్రయత్నాలను నెమ్మదింపజేయడానికి ఈ సంస్థలు వివిధ సమస్యలపై పోరాటం, కార్యకలాపాలు ప్రారంభిస్తాయని, ప్రభుత్వం, భద్రతా దళాలను దెయ్యాలు, భూతాలుగా చూపించే లక్ష్యంతో ప్రచారం చేయడం, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో నిష్ణాతులని ఆయన జోడించారు.
నెట్వర్క్ మరొక కోణాన్ని కూడా సింగ్ ఎత్తి చూపారు. కొన్ని ఫ్రంట్ సంస్థల సభ్యులు రహస్య ఉద్యమంలో చేర్చడానికి ‘ప్రొఫెషనల్ విప్లవకారులకు’ మార్గదర్శకత్వం వహిస్తున్నట్లు తమ దృషికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్‌ను మహారాష్ట్ర లో మాత్రమే ఉందా?
కానే కాదు. వామపక్ష తీవ్రవాదం, మావోయిస్టు నెట్‌వర్క్‌లకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించిన తర్వాతి రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు తమ భద్రతా చర్యలలో భాగంగా ఇటువంటి చట్టాన్ని పరిశీలించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొన్నేళ్లుగా సలహా ఇస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1992లో ప్రత్యేక పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్‌ను రూపొందించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నక్సలైట్ కార్యకలాపాలకు పాల్పడే సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం వీలు కల్పించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇదే చట్టాన్ని కొనసాగించింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా 2005లో ఇలాంటి చట్టాలను రూపొందించాయి.
ఆంధ్రప్రదేశ్ ఇటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టిన మూడు దశాబ్దాల కంటే ఎక్కువ కాలం తర్వాత, మహారాష్ట్ర ప్రభుత్వం 2024లో శాసనసభలో మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ బిల్‌ను ప్రవేశపెట్టింది. ఈ చట్టం తదనంతరం మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, 2025గా అమలులోకి వచ్చింది.
ఈ చట్టం మహారాష్ట్రలో ఇంకా ఉపయోగించబడలేదు. ఇది మావోయిస్ట్ ఫ్రంట్లుగా గుర్తించబడిన సంస్థలపై చర్య తీసుకోవడానికి చట్టపరమైన అస్త్రాన్ని అందిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 64 సంస్థల పేర్లను ఇంకా బహిరంగపరచలేదు. అయితే, ఫిబ్రవరి 2014 లోక్‌సభ సమాధానం మహారాష్ట్రలో కనీసం ఏడు సంస్థలను క్రియాశీల మావోయిస్ట్ ఫ్రంట్లుగా గుర్తించింది: దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన, క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన, రివాల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్, విద్రోహి సాంస్కృతిక చల్వాల్ (విదర్భ), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్, కమిటీ అగైనెస్ట్ వయొలెన్స్ ఆన్ ఉమెన్, కబీర్ కలా మంచ్.
ఇటువంటి చట్టాన్ని పరిశీలించడానికి మహారాష్ట్ర చేసిన మునుపటి ప్రయత్నాలు కూడా కొన్ని సంవత్సరాల క్రితం నాటివి. దివంగత ఆర్ఆర్ పాటిల్ హోంమంత్రిగా ఉన్న సమయంలో పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్‌పై చర్చ జరిగింది. ఈ ప్రతిపాదిత చట్రం యుఎస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ యాక్ట్ నుండి తీసుకున్నట్లు నివేదికలు వచ్చాయి. , భారతీయ న్యాయ, భద్రతా రంగానికి అనుగుణంగా రూపొందించబడిన ఒక భిన్నమైన వ్యవస్థ స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్. చట్టవిరుద్ధమైన, వినాశకరమైన కార్యకలాపాలలో పాల్గొనే సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ చట్టాన్ని రూపొందించారు.
ఇది కాంగ్రెస్ చెపుతున్న నిజం!
News at a Glance
1) Maharashtra focal point of urban Maoist activity, 64 groups active: Govt to court
3) Maharashtra cites 64 Maoist front organisations to defend security law in HC
5) Public Security Act: State says petitioners must show ‘real grievance’
6) From the Streets to the Courtroom: The constitutional battle over Maharashtra’s Public Safety Act
9) Maharashtra Defends MSPSA; Calls Congress, CPI’s Challenge ‘Frivolous’
10) Maha Bill aims at scuttling Maoist plan ‘Lal Salam@Lal Quila-2047’
