NationalNewsPopular NewsRecent NewsTrending News

ఊమర్ ఖలీద్ కేసు వెనుక వాస్తవం ఏమిటి? వాయిదాలు ఎందుకు అడిగారు?

పరిచయం

హిందూ వ్యతిరేక ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో సెప్టెంబర్ 2, 2020, న ఉమర్ ఖాలిద్, షార్జీల్ ఇమామ్, ఇతరులకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.

లెఫ్టిస్ట్ లాబీ సంకేతం ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే, తమను తాము “లిబరల్ మేధావులు” అని పిలుచుకునేవారు ఉమర్‌ను స్వాతంత్ర్య సమరయోధుడిగా, షార్జీల్‌ను తప్పుగా అర్థం చేసుకున్న తత్వవేత్తగా, నరేంద్ర మోదీని ప్రపంచంలోనే అతిపెద్ద నియంతగా చిత్రీకరించడం ప్రారంభించారు. వారు చెప్పిన ప్రకారం, భారతదేశంలో న్యాయం హత్యకు గురైందని, ప్రజాస్వామ్యం పూడ్చిపెట్టబడిందని, నిరసనను నేరంగా పరిగణించారాణి వారు చెప్పుకొచ్చారు.

 

కానీ ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఇది నిజంగా నిజమా… లేక లిబరల్ ప్లేబుక్ నుండి వచ్చిన మరొక కథనమా? ఉమర్ ఖాలిద్ ఉదాహరణనే తీసుకోండి. ఒక క్రూరమైన న్యాయ వ్యవస్థకు బాధితుడిగా ప్రచారం పొందుతున్న ఈ వ్యక్తి, నిజానికి ఏడుసార్లు విచారణ వాయిదాలు కోరి, చివరకు తన సొంత బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు. అవును, మీరు విన్నది నిజమే — అతను తన కేసుపై తానే పాజ్ బటన్ నొక్కాడు, ఆపై ఆ ముఠా బాధితులమని ఏడ్చింది. ఇప్పుడు చెప్పండి, నిజంగా న్యాయం కోరే వ్యక్తి అలా ఎందుకు చేస్తాడు? ఒకవేళ ఆ ప్లాన్ న్యాయం పొందడం కాకుండా, కేవలం గందరగోళం సృష్టించడమే అయితే తప్ప!

ఇది ప్రజాస్వామ్యం గురించి కాదు. ఇది నిరసన తెలపడం గురించి కాదు. ఇది అరాచకాన్ని సృష్టించడం, ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయడం, ప్రపంచం దృష్టిలో భారతదేశాన్ని ఒక అరాచక రాజ్యంగా చిత్రీకరించడం గురించి. ఇది లిబరల్ పర్యావరణ వ్యవస్థ యొక్క కొత్త రాజకీయ టూల్‌కిట్—వాస్తవాలను తిరస్కరించడం, అబద్ధాలను ఆయుధాలుగా మార్చడం, శాశ్వతంగా బాధితుడి కార్డ్ ఆడటం. అమెరికా వార్తాపత్రికలు పెద్ద పెద్ద కథనాలను ప్రచురిస్తూ, ఉమర్ ఖాలిద్‌కు న్యాయం నిరాకరించబడిందని వర్ణించాయి.

విశ్లేషణాత్మక కోణం

మీరు ఈ మొత్తం వ్యవహారం అర్థం చేసుకోవాలనుకుంటే, ప్రధాన పాత్రధారులైన ఉమర్ ఖలీద్ షార్జీల్ ఇమామ్‌ల గురించి తెలుసుకోవాలి.

ఉమర్ ఖలిద్ – పూర్వ జెఎన్‌యు విద్యార్థి నాయకుడు, లెఫ్ట్-లిబరల్ వర్గం ద్వారా “రాజకీయ ఖైదీ”గా చిత్రీకరించబడ్డాడు. వాస్తవానికి, అతను ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో నిందితులలో ఒకడు. సిఎఎ వ్యతిరేక నిరసనల సమయంలో అతను చేసిన ప్రసంగాలు శాంతియుత నిరసన గురించి కావు—అవి జాగ్రత్తగా రూపొందించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు. “వీధుల్లో రాకపోకలు ఆపడం,””ప్రత్యక్ష చర్య”లకు అతడు  పిలుపునిచ్చాడు. అవి ప్రజలను రెచ్చకొట్టి హింసకు దారి తీశాయి.

షార్జీల్ ఇమామ్ – సిలిగురి కారిడార్‌ను దిగ్బంధించడం ద్వారా ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశం నుండి విడదీయాలని బహిరంగంగా సూచించి వార్తల్లోకి వచ్చిన వ్యక్తి. అవును, ఆ ప్రసిద్ధ “చికెన్స్ నెక్” ప్రసంగం చేసింది అతడే. అతను ట్రాఫిక్ జామ్ గురించి మాట్లాడటం లేదు — భారతదేశ జీవనాడిని తొలగించాలని కోరుకున్నాడు.

దురదృష్టం ఏమిటంటే ఈ ఇద్దరినీ లిబరల్ వర్గాలు ఫాసిజం బాధితులుగా కొనియాడుతున్నాయి. కానీ వారి గతం వేరే విషయం చెప్తోంది. వారు ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రయత్నంలో లేరు, అశాంతిని రెచ్చగొడుతున్నారు.

వారి అరెస్టు నాటి నుండి, లెఫ్ట్-లిబరల్ వర్గం ఉమర్ ఖలిద్, షార్జీల్ ఇమామ్‌లను కాపాడటానికి కుట్రలు చేస్తోంది. అయితే విభిన్నమైన కథనాలను ప్రచారం చేసిన మునుపటి ప్రయత్నాలలా కాకుండా, ఈసారి వారు ఒకే స్క్రిప్ట్‌ను ఎంచుకున్నారు—మోదీ ప్రభుత్వం ద్వారా బెయిల్ నిరాకరించబడిన నిస్సహాయ “బాధితులు”గా వారిని చిత్రీకరించడం.

కానీ ఇదో అనుకోని మలుపు తిరిగింది. వారు ఏం చేద్దామనుకున్నారన్న విషయం రాజకీయ నాయకుల వల్ల కాకుండా స్వయంగా న్యాయ వ్యవస్థ ద్వారా బయటపడింది.

మాజీ ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖా దత్‌‌తో జరిగిన ఒక ఇటీవలి ఇంటర్వ్యూలో ఎటువంటి దాపరికాలు లేకుండా నిజాలను బహిర్గతం చేశారు. ఉమర్ ఖాలిద్ బెయిల్ పిటిషన్‌లో వరుస వాయిదాలు, జాప్యాలు న్యాయవ్యవస్థ వైఫల్యం కాదని, డిఫెన్స్ టీమ్ కావాలని చేసిన వ్యూహాత్మక జాప్యమని ఆయన స్పష్టం చేశారు.

ప్రతిసారీ వాదనలు వినిపించే బదులు డిఫెన్స్ టీమ్ మరింత సమయం కోరింది. ఆ కేసుపై పూర్తిస్థాయిలో వాదనలు వినే దశకు వచ్చినప్పుడు పిటిషన్‌ను సైలెంట్‌గా ఉపసంహరించుకున్నారు.

సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ నేతృత్వంలోని ఉమర్ ఖాలిద్ లీగల్ టీమ్ అక్టోబర్ 2023, ఫిబ్రవరి 2024 మధ్య సుప్రీంకోర్టును వ్యూహాత్మక జాప్యాలకు వేదికగా మార్చింది. పద్నాలుగు విచారణలు జాబితాలో చేర్చారు. అందులో ఏడు విచారణలు నిందితుల స్వంత కోరికపైనే వాయిదా వేయపడ్డాయి. ఇది జాగ్రత్త కోసం చేసినది కాదు. ఇది ఒక ప్రణాళికాబద్ధమైన నాటకం. ప్రజల సానుభూతి సంపాదించడానికి కొత్త వ్యూహం రచించారు. తమంతట తాము కోరుకున్న కేసు వాయిదాలను ‘ఒక నిస్సహాయ కార్యకర్త న్యాయవ్యవస్థ ఆలస్యం’  కింద నలిగిపోతున్నాడనే కథనం ప్రచారంలోకి తీసుకు వచ్చారు. చాలామంది ఇదే నిజమని నమ్మారు. వాస్తవాలు వారి దృష్టికి రాలేదు.

బెయిల్ పిటిషన్ ను ఫిబ్రవరి 2024 లో ఆకస్మికంగా ఉపసంహరించుకున్నారు. “పరిస్థితుల్లో మార్పు వచ్చింది” అని సిబల్ చెప్పారు. ఆ నాటకం దాని లక్ష్యాన్ని నెరవేర్చింది. మళ్లీ ట్రయల్ కోర్టుకు వెళ్లి కథను కొత్తగా ప్యాక్ చేయడానికి సమయం వచ్చింది. నెలల తరబడి వాయిదాలు, సమయానుకూల ఉపసంహరణలు, మీడియా ప్రచారాలు—అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. నిందితుడైన ఖాలిద్ కాస్త  న్యాయవ్యవస్థ కారణంగా ఒక పోరాట యోధుడు అయ్యాడు.

కానీ ఇక్కడ కథనంలో ఒక పెద్ద లోపం ఉంది: జాప్యాలే నిజమైన సమస్య అయితే, అక్టోబర్ 2022లో ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన తర్వాత ఉమర్ ఖాలిద్ ఏప్రిల్ 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ఆరు నెలలు ఎందుకు వేచి చూశాడు? వ్యవస్థ నెమ్మదిగా ఉందా — లేక బాధితుడి కథనాన్ని నిర్మించడానికి ఇది కావాలని చేసిన జాప్యమా?

ఫోరమ్ షాపింగ్: బెంచ్-హంటింగ్ గేమ్

వాయిదాలు కోరడం ఒక్కటే ట్రిక్ కాదు. ఖాలిద్ టీమ్ చట్టంలో అత్యంత పాతదైన ‘ఫోరమ్ షాపింగ్’ గేమ్‌ను ఆడింది—అంటే తమ వాదనకు అనుకూలంగా ఉండే బెంచ్ ముందుకు కేసు వెళ్లేలా చూసుకోవడం.

ఫోరమ్ షాపింగ్ అనేది ఒక వ్యాజ్యదారుడు తనకు అనుకూలమైన తీర్పు వస్తుందనే ఆశతో అందుబాటులో ఉన్న బహుళ కోర్టులు లేదా అధికార పరిధుల నుండి నిర్దిష్ట కోర్టును కావాలని ఎంచుకునే విధానం. వారు ఎక్కువ సానుభూతి సంపాదించడం కోసం ఈ బెయిల్ పిటిషన్‌ను ఇతర UAPA కేసులతో జత చేయడానికి ప్రయత్నించారు. అది పనిచేయనప్పుడు, వాటిని విడదీయాలని, వేరే బెంచ్‌కు కేటాయించాలని ఒత్తిడి చేశారు. లాయర్ల ఉత్తరాలు, వాదనలు—అన్నీ “సరైన” న్యాయమూర్తి శోధనలోనే సాగాయి.

డిసెంబర్ 2023 నాటికి, ఈ నాటకాలు బహిరంగమయ్యాయి. ఖాలిద్ బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేది ముందుకు రావడంపై ప్రశాంత్ భూషణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పటి సీజేఐ డి.వై. చంద్రచూడ్‌కు లేఖ రాశారు. దుష్యంత్ దవే, అభిషేక్ మను సింఘ్వి కూడా ఈ గ్రూప్ లో చేరారు. సత్యేందర్ జైన్ బెయిల్ విచారణను సైతం మళ్లించి సింఘ్వి ఇది “అక్రమం” అని ఆరోపించారు.

సీజేఐ చంద్రచూడ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు: “ఆరోపణలు చేయడం, లేఖలు విసరడం చాలా సులభం” అని ఆయన స్పష్టం చేశారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరింత తీవ్రంగా స్పందిస్తూ: ఇలాంటి లేఖలకు ఉత్తమ ప్రతిస్పందన వాటిని నిర్లక్ష్యం చేయడమే అన్నారు.

వాయిదాల విచిత్రం: కానీ వాయిదాలు మాత్రం పడుతూనే ఉన్నాయి:

జనవరి 17, 2024: ఎస్జీ అందుబాటులో లేనందున వాయిదా పడింది.

జనవరి 24, 2024: కపిల్ సిబల్ మరొక వాయిదా కోరారు. సహజంగానే, అది మంజూరు అయింది.

అదే రోజు, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బెంచ్ ముందర ప్రతివాదులు విచారణ ఆపడానికి ఇంకో కారణం చెప్పారు. దానికి కూడా అంగీకరించింది.

ఈ పోరాటం నిజంగా న్యాయం కోసమే అయితే, కపిల్ సిబల్, ఆయన బృందం కోర్టు గదిలోకి అడుగుపెట్టి, కేసు వాదించి, సాక్ష్యాలను ప్రశ్నించి తీర్పు కోసం వేచి ఉండేవారు. న్యాయం అలాగే  సాధ్యం అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది ? రాజకీయ నాటకం నుండి వచ్చిన ఒక ప్లేబుక్: ప్రతి సందర్భంలోనూ విచారణలను ఆలస్యం చేయడం, నిందను న్యాయవ్యవస్థపైకి నెట్టడం, పిటిషన్లను తమ ఇష్టానుసారం ఉపసంహరించుకోవడం, ఆపై “రాజకీయ వేధింపులు” అని ఏడుస్తూ మీడియా ముందరకు పరుగెత్తడం. ఇది చట్టపరమైన పోరాటం కాదు; కోర్టులో గెలవడానికి కాకుండా, హెడ్‌లైన్స్‌లో గెలవడానికి రాసిన నాటకం.

ఇది కేవలం ఉమర్ ఖాలిద్ బెయిల్ గురించి మాత్రమే కాదు. ఇది అంతకంటే పెద్ద విషయం — భారతీయ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు జరుగుతున్న క్రమబద్ధమైన ప్రయత్నం.

వామపక్ష వాదులనుండి, వారు మద్దతు ఇచ్చేవారు, వారికి మద్దతు ఇచ్చేవారినుండి ఇంతకు మించి ఆశించలేం.

తీర్పులు తమనుకున్న దాని ప్రకారం రానప్పుడు న్యాయవ్యవస్థపై దాడి చేయడం, చట్టాలు అమలవుతున్నప్పుడు ప్రభుత్వాన్ని నియంతృత్వ ప్రభుత్వంగా ముద్ర వేయడం, ఆపై అనుకూలమైన ఉత్తర్వు వచ్చినప్పుడు అదే వ్యవస్థను ప్రశంసించడం. ఇది వారు ఎంపిక చేసుకున్న ఒక ప్రక్రియ. దీని లక్ష్యం  ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కాదు, దాన్ని బలహీనపరచడం.

అంతిమ లక్ష్యం స్పష్టం: ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడం, గందరగోళాన్ని సృష్టించడం, విచ్ఛిన్నమైన గణతంత్ర రాజ్యంగా చిత్రీకరించడం.

News at a glance

  1. OpIndia: Denial of bail to Umar Khalid a ‘travesty of justice’? Conspirators’ delay tactics explained
  2. OpIndia: Delhi Riots 2020 – High Court rejects bail pleas of Umar Khalid, Sharjeel Imam
  3. The Hindu: Bail plea highlights – Prosecution opposed Khalid, Imam applications
  4. Moneycontrol: Ex-CJI Chandrachud questions repeated adjournments in Khalid bail case
  5. Lawchakra: Former CJI DY Chandrachud highlights defense adjournments in Khalid case
  6. LawBeat: Umar Khalid moves Supreme Court for bail in Delhi Riots case
  7. Swarajya: Delhi High Court rejects bail pleas of Khalid, Imam in conspiracy case

By the Numbers

The Legal Timeline

  • Sessions Court: Bail filed → denied in 8 months
  • High Court: Bail dismissed in 6 months
  • Supreme Court: Khalid’s team requested 7 adjournments out of 14 hearings after waiting 6 months to approach SC
  • Sessions Court (post-SC withdrawal): Bail again rejected in under 3 months

Clear story: delays were engineered by the defense, not the courts.

Academic insight

Delhi High Court Judgment PDF: Umar Khalid & Sharjeel Imam Bail Case

Social Media pulse

https://x.com/UnSubtleDesi/status/1890255522810720699?s=20

https://x.com/AbhishBanerj/status/1962895584135942147?s=20

Source

https://www.vayuveg.com//Encyc/2025/9/11/umar-khalid-bail-plea-leftist-anti-hindu-delhi-riots-jnu-anti-caa-barkha-dutt.php

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *