Andhra PradeshAndhra PradeshNationalNewsPoliticsTelanganaTelanganaTelanganaTeluguTrending News

ప్రశాంత్ భూషణ్ అంతిమ లక్ష్యం అరాచకం ద్వారా అధికార మార్పేనా?

ప్రశాంత్ భూషణ్ ప్రముఖ లాయర్. అయితే ఆయన వ్యవహారశైలిని గమనిస్తే అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.

రాజ్యాంగ పరమైన అంశాలపై ఆయన వాదనలు, ఆయన ఉద్యమాల వెనుక ఉన్న రాజకీయ నెట్‌వర్క్‌లు, ఎన్నికలకు సంబధించి తలెత్తే చిన్నచిన్న నిరసనలను ప్రభుత్వంపై పూర్తిస్థాయి ఘర్షణగా మార్చడంలో ఆయన నైపుణ్యం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.

 Introductory memo

ప్రశాంత్ భూషణ్ రాజకీయ ప్రయాణం అవినీతి వ్యతిరేక ఉద్యమాల నుండి ఆమ్ ఆద్మీ పార్టీతో తీవ్రమైన విభేదాలతో సాగి, చివరికి ప్రభుత్వ నిర్ణయాలను నిరంతరం సవాలు చేసే స్థితి వరకు చేరుకుంది. CJP, ఇతర కార్యకర్తలతో కలిసి ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఈ విభిన్న అంశాలన్నింటినీ ఒకే చోటికి చేర్చాయి. ఆయన బహిరంగ ప్రకటనలు, రాజకీయ సంబంధాలు, ఎన్నికల వ్యవస్థల పట్ల ఆయన వైఖరిని పరిశీలించడం ద్వారా ప్రజాస్వామ్య నిరసన, ఘర్షణాత్మక యాక్టివిసం, రాజకీయ మార్పు కోసం చేసే ప్రయత్నాలు జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి మధ్య ఉన్న సంబధం అర్ధం అవుతుంది.

Analysis/ analytical view

ప్రశాంత్ భూషణ్  న్యూఢిల్లీలో అక్టోబర్ 15, 2026న జరిగిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ భూషణ్  స్పష్టమైన రాజకీయ ప్రకటన చేశారు. CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే, నటుడు ప్రకాష్ రాజ్, విద్యార్థి నాయకులు, ఇతర ప్రముఖులతో కలిసి ఆయన మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) లో అక్రమాలు జరిగాయంటూ సాగుతున్న నిరసన “నిజంగా ప్రభుత్వ మార్పు (regime change) కోసం జరుగుతున్న పోరాటం” అని ఆయన వ్యాఖ్యానించారు. “అవును, మేమందరం ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నాం… అందులో తప్పేముంది?” అని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని మార్చాలని కోరడం ఒక ప్రజాస్వామ్య హక్కని, రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచడం నేరం కాదని భూషణ్ వాదించారు. వాస్తవానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను లక్ష్యంగా చేసుకుని ఉద్యమం సాగుతోంది. కానీ ఆయన ప్రకటన ఒక ప్రధానమైన ప్రశ్నను లేవనెత్తింది-  ఈ నిరసన ఎన్నికలకు సంబధించిన ఫిర్యాదులను పరిష్కరించాలని కోరుతోందా లేక అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని దించడం మాత్రమే దీని ఏకైక రాజకీయ లక్ష్యంగా మారిందా? అని

ఇక్కడ ఒక ముఖ్యమైన రాజ్యాంగపరమైన వ్యత్యాసం ఉంది. ప్రభుత్వాన్ని మార్చాలని ప్రచారం చేసే, ఎన్నికల సంఘాన్ని విమర్శించే, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసే పూర్తి హక్కు ప్రజలకు, ప్రతిపక్షాలకు ఉంది. శాంతియుత నిరసన అనేది చట్టబద్ధమైన ప్రజాస్వామ్య సాధనం. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామని చెప్పుకునే ఉద్యమం ఎన్నికల తీర్పులను, వ్యవస్థాగత ప్రక్రియలను, విభిన్న రాజకీయ అభిప్రాయాలు ఉన్న పౌరుల హక్కులను కూడా గౌరవించాలి.

ప్రశాంత్ భూషణ్‌  చేసిన ప్రకటన అక్రమ కుట్ర కాదు.  అలాగే ప్రభుత్వ మార్పును డిమాండ్ చేయడం వల్ల అరాచకం ఏర్పడుతుందని అర్థం కాదు. కానీ ఈ ప్రకటన వెనుక ఉన్న రాజకీయ వ్యూహమే ఆందోళన కలిగిస్తోంది – సుదీర్ఘ వీధి నిరసనలు, వ్యవస్థల ప్రామాణికతను దెబ్బతీయడం, రాజకీయ వైరుధ్యాలను పక్కనబెట్టి కూటములు కట్టడం ద్వారా ఎన్నికల ప్రక్రియకు ప్రత్యామ్నాయంగా ఘర్షణను వాడుతున్నారా అనేదే అసలు సందేహం.

అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడి నుండి ప్రతిపక్ష ప్రచారకుడిగా ప్రశాంత్ భూషణ్ ప్రయాణం

ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు (PIL) లేదా రాజకీయ యాక్టివిజంకు ప్రశాంత భూషణ్  క్రొత్తేమీ కాదు. అవినీతి, పాలన, న్యాయ వ్యవస్థ జవాబుదారీతనం, పౌర హక్కులపై చేసిన చట్టపోరాటాల ద్వారా ఆయన గుర్తింపు పొందారు. అన్నా హజారే నాయకత్వంలో జరిగిన ‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమంలో ఆయన ఒక ప్రముఖ వ్యక్తిగా మారారు. ఈ ఉద్యమం అవినీతిపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ఒక్కటిగా చేసి  ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆవిర్భావానికి అనుకూల  రాజకీయ వాతావరణాన్ని సృష్టించింది.

ఆ తర్వాత ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా మారి, దాని అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అయితే పార్టీ నాయకత్వం, పనితీరు, రాజకీయ వైఖరి పై ఏర్పడిన తీవ్ర విభేదాల కారణంగా అరవింద్ కేజ్రీవాల్‌తో ఆయన సంబంధం దెబ్బతింది. 2015లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను పార్టీ నుండి బహిష్కరించారు. ఆ తర్వాత వారు స్వరాజ్ అభియాన్ అనే సంస్థను స్థాపించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రీకృతంగా మారిందని, పారదర్శకత లోపించిందని కేజ్రీవాల్ నాయకత్వాన్ని ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ఈ సంఘటన ఆయన రాజకీయ జీవితంలో పదే పదే కనిపిస్తున్న ఒక అంశాన్ని స్పష్టం చేస్తుంది: తాను స్వయంగా ఏర్పాటుచేసిన సంస్థలతో సహా అన్నింటిలో రాజకీయ అధికారాన్ని నిరంతరం సవాలు చేసే ఉద్యమకారుడిగా ఆయన మిగిలిపోయారు. నిష్పాక్షికతకు, శక్తివంతమైన నాయకులను సవాలు చేసే ఆయన తెగువకు నిదర్శనంగా దీనిని చూడవచ్చు. అదే సమయంలో, ఆయన ఉద్యమాల రాజకీయ గమ్యం ఏమిటనే ప్రశ్నలను కూడా ఇది లేవనెత్తుతోంది. అవినీతి, ఎన్నికల విధానాలు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలు ‘ప్రభుత్వ మార్పు’ అనే ఒకే డిమాండ్ వద్ద ఏకమైనప్పుడు వాటి లక్ష్యాలు, పద్ధతులు, జవాబుదారీతనంపై ప్రజలకు స్పష్టత కావాలి.

న్యాయవాదిగా ప్రశాంత్ భూషణ్ కు ఉన్న సీనియారిటీ ఆయన బహిరంగ ప్రకటనలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుంది. అయితే ఆయన న్యాయవాది అయినంత మాత్రాన ఆయన చేసే రాజకీయ వాదనలు విమర్శలకు అతీతం కాదు.  ఆయన మద్దతు ఇచ్చే ప్రతి ఉద్యమం లేదా కూటమి తప్పనిసరిగా రాజ్యాంగ స్థిరత్వానికే తోడ్పడుతుందని చెప్పలేం.

కాశ్మీర్ రాజకీయ వ్యాఖ్యల పరిమితులు

కాశ్మీర్‌పై ప్రశాంత్ భూషణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. 2011లో ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమ సమయంలో, జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ (plebiscite) ప్రతిపాదనకు ఆయన మద్దతు తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి, సైన్యాన్ని ఉపసంహరించి, AFSPA ను రద్దు చేస్తే ఈ అభిప్రాయ సేకరణను పరిశీలించవచ్చని ఆయన సూచించారు. అది తన వ్యక్తిగత అభిప్రాయమని అంటూ ఈ అంశంపై జవహర్‌లాల్ నెహ్రూ గతంలో చేసిన చారిత్రక ప్రకటనలను ఉటంకిస్తూ ఆయన తన వాదనలను సమర్థించుకున్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర నిరసనకు దారితీశాయి. జాతీయవాద సంస్థల నుండి విమర్శలు రావడమే కాకుండా కార్యకర్తలు ఆయనపై భౌతిక దాడి కూడా చేశారు.

తరువాత AAP తో ఉన్న సమయంలో ప్రశాంత్ భూషణ్ దానిపై స్పష్టత ఇస్తూ ప్రజాభిప్రాయ సేకరణపై తన వ్యాఖ్యలను దేశంలో దాని విలీనాన్ని ప్రశ్నించడంగా భావించకూడదని కాశ్మీర్ భారతదేశంలోర్భాగమని పేర్కొన్నారు.

ఈ సంఘటన కాశ్మీర్‌పై భేదాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన ద్రోహంగా ముద్ర వేయడానికి ప్రామాణికం కాకపోవచ్చు, కానీ సున్నితమైన రాజ్యాంగ, ప్రాంతీయ అంశాలపై వ్యాఖ్యలు చేసినప్పుడు ఎదురయ్యే తీవ్ర పర్యవసానాలను ఇది స్పష్టం చేస్తుంది. నిరసన తెలిపే హక్కును ఉపయోగించుకునే ప్రముఖులు తమ వాదనలు, వాటి పరిణామాలు, నిర్దిష్టతపై వచ్చే విమర్శలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలి.

ఇదే ప్రామాణికత ప్రశాంత్  భూషణ్ ప్రస్తుత ఉద్యమానికి కూడా వర్తిస్తుంది. తమ పోరాటం ప్రభుత్వ మార్పు కోసమేనని ఆయన చేసిన ప్రకటనను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం తప్పని కాదు, కానీ అటువంటి ప్రచారాల పద్ధతులు, వ్యవస్థలపై ఉండే దాని ప్రభావం చాలా ముఖ్యమైనవి.

సంభావనా, యోగేంద్ర యాదవ్, యాక్టివిస్ట్ నెట్‌వర్క్‌ల కొనసాగింపు

హిమాచల్ ప్రదేశ్‌లో తన తల్లిదండ్రుల పేరు మీద ఉన్న కుముద్ భూషణ్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ప్రశాంత్ భూషణ్ ‘సంభావన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ పాలిటిక్స్’ను స్థాపించారు. ఈ సంస్థ ప్రజా విధానం, ఎన్నికల ప్రజాస్వామ్యం, పర్యావరణం, సంబంధిత అంశాలపై శిక్షణలు, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది. మరో ప్రముఖుడు యోగేంద్ర యాదవ్ కు ఈ సంస్థ పాలక మండలి, విద్యా కార్యకలాపాలతో సంబంధం ఉంది. ఈయన ప్రశాంత్ భూషణ్ మాజీ సహచరుడు, కేజ్రీవాల్ నాయకత్వాన్ని విమర్శించిన వారిలో ఒకరు. వీరిద్దరూ ప్రభుత్వ నిర్ణయాలు, ఎన్నికల వ్యవస్థలను సవాలు చేసే పౌర సమాజ ఉద్యమాలలో భాగస్వాములయ్యారు.

వీరి భాగస్వామ్యం 2010ల ప్రారంభంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమం, తదనంతర ప్రతిపక్ష రాజకీయాలు, ఎన్నికల సంఘంపై ప్రస్తుత నిరసనల మధ్య ఒక లింక్ ను చూపెడతాయి. వారి కార్యకలాపాలు చట్టవిరుద్ధమని కాదు. అయితే, వ్యక్తులు, సంస్థలు, యాక్టివిస్ట్ నెట్‌వర్క్‌లు విభిన్న కాలాల్లో వేర్వేరు కారణాలతో రాజకీయ ప్రచారాలను ఎలా కొనసాగించగలవో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే – ఎన్నికల వ్యవస్థలపై చేసే విమర్శలను నిరూపించే ఆధారాలు ఉన్నాయా, డిమాండ్లను వ్యవస్థాగతంగా పరిష్కారించుకోవడానికి వారు కట్టుబడి ఉన్నారా లేదా అనేది తెలియాలి. నిర్దిష్టమైన తప్పులను నిరూపించకుండా ఎన్నికల ప్రామాణికతను పదే పదే ప్రశ్నించడం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు ఉన్న విశ్వాసం బలహీనపడే ప్రమాదం ఉంది.

జంగ్‌పురా సమావేశం, వాస్తవాలు ఏమిటి

ప్రశాంత్ భూషణ్ యాక్టివిస్ట్ నెట్‌వర్క్‌కు సంబంధించిన చర్చల్లో ఢిల్లీలోని జంగ్‌పురాలోని ఒక బేస్‌మెంట్ ప్రాంగణంలో డిసెంబర్ 8, 2019న జరిగిన సమావేశం ప్రస్తావనకు వచ్చింది. ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులోని ఆరోపణలను ప్రస్తావిస్తూ కోర్టు రికార్డులు 6/6 జంగ్‌పురా ఎక్స్‌టెన్షన్‌లో యోగేంద్ర యాదవ్, ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, ఇతర వ్యక్తులు పాల్గొన్న ఒక సమావేశాన్ని ప్రస్తావించాయి. పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా నిరసనల సందర్భంలో చక్కా జామ్ (రహదారుల దిగ్బంధనం) ప్రణాళికలు ఈ చర్చలలో ఉన్నాయని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

సుప్రీంకోర్టుకు ప్రశాంత్ భూషణ్ సమర్పించిన పత్రాలలో తన కార్యాలయంగా పేర్కొన్న చిరునామాతో ఈ అడ్రసు సరిపోలింది. విస్తృత నిరసన నెట్‌వర్క్‌లోని వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలపై ఈ అంశం అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

అయితే, ఒక చిరునామాకు, ఒక సమావేశం ఉద్దేశ్యానికి, ఒక వ్యక్తి వ్యక్తిగత భాగస్వామ్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడం చాలా అవసరం. ఈ ఆరోపణలు మాత్రమే భూషణ్ ఆ సమావేశానికి హాజరయ్యారని, ఆ కుట్ర గురించి ఆయనకు తెలుసని లేదా ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నారని నిరూపించలేవు. స్వతంత్ర ఆధారాలు లేకుండా ఆ ఆరోపణలను వాస్తవాలుగా చెప్పలేం.

ఢిల్లీ అల్లర్ల కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని సుదీర్ఘకాలం నిర్బంధించడాన్ని ప్రశాంత్ భూషణ్ విమర్శించారు.  వారిపై మోపిన కేసులు సక్రమమైన న్యాయ ప్రక్రియపై తీవ్ర సందేహాలను లేవనెత్తుతున్నాయని వాదించారు. అటువంటి న్యాయపోరాటం నేరంలో భాగస్వామ్యానికి లేదా హింసను సమర్థించడానికి నిదర్శనం కాదు. ఇక్కడ ఉద్భవించే నిష్పాక్షికమైన ప్రశ్న ఏమిటంటే: ఈ కేసులపై జరుగుతున్న బహిరంగ చర్చల్లో రాజకీయ కథనాల కంటే ఆధారాలు, న్యాయపరమైన ప్రక్రియలకే ప్రాధాన్యత లభిస్తుందా లేదా అనేది.

CJP మరియు బహుళ-పార్టీ సమీకరణ రాజకీయాలు

CJP తో కలిసి భూషణ్ ప్రత్యక్షమవ్వడం ఆయన ప్రస్తుత రాజకీయ వ్యూహాన్ని మరింత స్పష్టంగా చూపుతోంది. CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉన్నారు. ఆ సంస్థలోని ఇతర వ్యక్తులకు AAP యువజన విభాగంతో సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ గ్రూప్ రాజకీయ సంబంధాల నివేదికలలో AAP మాజీ కమ్యూనికేషన్స్ వ్యూహకర్త విజయ్ నాయర్ పేరు కూడా వినబడింది.

CJP లక్ష్యాలు ‘INDIA’ ప్రతిపక్ష కూటమి లక్ష్యాలతో ఏకీభవిస్తున్నాయని దిప్కే అంగీకరించారు. ఈ సంస్థ రాజకీయ నిష్పాక్షికతపై ప్రశ్నలు ఉన్నప్పటికీ, నిరసనల మధ్య కాంగ్రెస్ నాయకులు కూడా వారితో కలిసి పనిచేస్తున్నారు.

ఈ సంబంధాలు CJP ఏదో ఒక రాజకీయ పార్టీ నియంత్రణలో ఉందని చెప్పవు. అయినప్పటికీ, ఇది ఒక స్వతంత్ర యువజన ఉద్యమం అనే ప్రతిపాదనను సంక్లిష్టం చేస్తుంది. ఒక కొత్త సంస్థ తన సిబ్బందిని, లక్ష్యాలను, ప్రచార వేదికలను రాజకీయ శక్తులతో పంచుకున్నప్పుడు, దాని నిధులు, నాయకత్వం, నిర్ణయాధికారాలను పారదర్శకంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

దీనికి తోడు అంతర్జాతీయ అంశాలు వివాదాన్ని మరింత పెంచాయి. ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకించే యుఎస్ దాతలు దిప్కే, CJP కి వెన్నుదన్నుగా ఉన్నారని అమెరికా గాయని మేరీ మిల్‌బెన్ బహిరంగంగా ఆరోపించారు. దిప్కే ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ప్రశ్నించారు. కాబట్టి ఈ ఆధారాలు సరైన రికార్డుల ద్వారా నిరూపించబడే వరకు, వీటిని కేవలం ఆరోపణలుగానే చూడాలి తప్ప నిరూపితమైన నిజాలుగా పరిగణించకూడదు.

భారతదేశంలో యువకులు ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, దానికి మద్దతు ఇస్తున్నానని బంగ్లాదేశ్ కు చెందిన నాహిద్ ఇస్లాం ప్రకటించారు. ఆయనకు  బంగ్లాదేశ్ లో ఇటీవలి రాజకీయ పరిణామాలతో సంబంధం ఉంది. భారతీయ విద్యార్థి నాయకులు కూడా బంగ్లాదేశ్ యువజన ఉద్యమాన్ని ప్రేరణగా పేర్కొన్నారు. ఇటువంటి మద్దతు ప్రకటనలు విదేశీ నిర్దేశకత్వానికి లేదా సమన్వయానికి ఆధారాలు కావు. అయితే, స్వదేశీ నిరసనలు అంతర్జాతీయ రాజకీయ దృష్టిని ఎలా ఆకర్షిస్తాయో, ప్రభుత్వ మార్పు గురించిన విస్తృత కథనంలో ఎలా భాగమవుతాయో ఇవి స్పష్టం చేస్తాయి.

ఇక్కడ తలెత్తే ప్రశ్నలు స్పష్టమైనవే: ఈ సంస్థలకు నిధులు ఎవరు ఇస్తున్నారు? చట్ట ప్రకారం విరాళాలను వెల్లడిస్తున్నారా? వారి రాజకీయ ప్రాధాన్యతలను ఎవరు నిర్ణయిస్తారు? విదేశీ జోక్యానికి సంబంధించిన ఆరోపణలు కేవలం భావజాల అనుమానాల ఆధారంగా ఉన్నాయా లేక నిజంగా ఆధారాలు ఉన్నాయా?

విదేశీ నిధులు, ఎన్నికల పరిశీలన, పోటీ ప్రమాణాలు

ఎన్నికల పారదర్శకత, అభ్యర్థుల వివరాల వెల్లడి మరియు రాజకీయ నిధులకు సంబంధించిన న్యాయ సవాళ్లలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ADR) ప్రముఖ పాత్ర పోషించింది. విస్తృత ఎన్నికల-జవాబుదారీ రంగానికి చెందిన సంస్థలకు విరాళాలు ఇచ్చిన వారిలో ఫోర్డ్ ఫౌండేషన్, ఒమిడ్యార్ నెట్‌వర్క్, ఇతర దేశీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఉన్నట్లు పబ్లిక్ నివేదికలు పేర్కొంటున్నాయి. డచ్ అభివృద్ధి సంస్థ అయిన Hivos కూడా ప్రభుత్వ,  అంతర్జాతీయ నిధుల ఆధారాల నుండి మద్దతు పొందింది.

ఈ నిధుల సంబంధాలపై సంబంధిత సంస్థలు, నివేదిక కాలాలు, గ్రాంట్లు, చట్టపరమైన వివరాల ఆధారంగా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒక సంస్థ పొందిన నిధులను మరొక సంస్థకు ముడిపెట్టలేము, అలాగే ఎన్నికల పరిశోధన లేదా పారదర్శకత పని కోసం వచ్చిన గ్రాంట్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అజెండా అని చెప్పజాలం.

ADR తన పనిని నిష్పాక్షికమైనదిగా వర్ణించుకుంటుంది. విదేశీ నిధులతో పనిచేసే పౌర సమాజ సంస్థలు దేశంలోని  రాజకీయ చర్చలను తమ ప్రాధాన్యతలు పెంచడం ద్వారా, వ్యవస్థలను సవాలు చేయడం ద్వారా ప్రభావితం చేస్తాయనే వాదం కూడా ఉంది. దీనికి సరైన పరిష్కారం నిధులు, కార్యకలాపాలను పారదర్శకంగా పరిశీలించడమే తప్ప, ప్రతి విదేశీ గ్రాంట్‌ను కుట్రగా భావించడం కాదు.

కేజ్రీవాల్‌తో సంబంధం ఉన్న సంస్థలు, CJP, ఇతర యాక్టివిస్ట్ నెట్‌వర్క్‌లపై వచ్చే ఆరోపణలకు కూడా ఇదే ప్రామాణికం వర్తించాలి. నమోదిత గ్రాంట్లు, సంస్థాగత సంబంధాలు, బహిరంగ ప్రకటనలు విచారణకు చట్టబద్ధమైన అంశాలు. అయితే, ఒక సమన్వయంతో,  విదేశీ మద్దతుతో ప్రభుత్వ మార్పునకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలకు స్పష్టమైన సాక్ష్యాధారాలు అవసరం.

దేశంలో రాజకీయ స్థిరత్వం కూడా చాలా ముఖ్యమైనదే. ఎన్నికల అక్రమాల ఆరోపణలను ఆధారాల ప్రాతిపదికన మాత్రమే అంచనా వేయాలి. ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందనే దాని ఆధారంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఓటర్ల జాబితాలు, ఎన్నికల సంఘంపై వచ్చే ప్రశ్నలను తేల్చలేము. అలాగే విమర్శకుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడనే కారణంతో మాత్రమే విమర్శలను తోసిపుచ్చలేము.

అసలైన పరీక్ష పద్ధతి మాత్రమే, నినాదం కాదు

ప్రశాంత్ భూషణ్ కెరీర్ భారతదేశంలో లీగల్ యాక్టివిజం, పౌర సమాజ సమీకరణ, ప్రతిపక్ష రాజకీయాల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన చేసిన చట్టపోరాటాలు అన్ని పార్టీల ప్రభుత్వాలను, రాజకీయ నాయకులను సవాలు చేశాయి. ఆయన మద్దతుదారులు ఆయనను రాజ్యాంగ హక్కుల రక్షకుడిగా చూస్తే; ఆయన విమర్శకులు ఆయన ప్రచారాలు తరచుగా అధికారంలో ఉన్న ప్రభుత్వ, రాజకీయ ప్రత్యర్థుల లక్ష్యాలతో ఏకీభవిస్తాయని భావిస్తారు.

ఈ రెండు అభిప్రాయాల్లో దేనినీ ఆధారాలను పరిశీలించకుండా స్వీకరించకూడదు.

ఆయన తాజా ప్రకటన ప్రాముఖ్యత కలిగినది. ఎందుకంటే ఇది నిర్దిష్ట ఎన్నికల పారదర్శకత డిమాండ్‌ను దాటి ‘ప్రభుత్వ మార్పు’ అనే స్పష్టమైన రాజకీయ లక్ష్యం వైపు సాగింది. ఎన్నికలు, చట్టబద్ధమైన ప్రచారాలు, శాంతియుత ప్రజాస్వామ్య నిరసనల ద్వారా ఆ లక్ష్యాన్ని అనుసరించినప్పుడు అది చట్టబద్ధమైనదే. కానీ ఆధారాల స్థానంలో ఆరోపణలు చేరినప్పుడు, వ్యవస్థాగత విమర్శలు వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా మారినప్పుడు, లేదా ఎన్నికల తీర్పునకు ప్రత్యామ్నాయంగా వీధి నిరసనలను చూపినప్పుడు అది ఆందోళనకరంగా మారుతుంది.

ప్రజాస్వామ్య ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో సహా నిరసన తెలిపే హక్కును భారతదేశ రాజ్యాంగం రక్షిస్తుంది. అలాగే ఎన్నికల ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకునే పౌరుల హక్కును కూడా అది రక్షిస్తుంది. రాజ్యాంగ స్వేచ్ఛలను ప్రస్తావించే ఒక సీనియర్ అడ్వకేట్, ఇతరుల నుండి తాను ఆశించే స్థిరత్వం, పారదర్శకత, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల గౌరవం అనే ప్రమాణాలకే తాను కూడా జవాబుదారీగా ఉండాలి.

ఇక్కడ అసలైన ప్రశ్న ప్రశాంత్ భూషణ్‌కు ప్రభుత్వ మార్పును కోరే హక్కు ఉందా లేదా అనేది కాదు. ఖచ్చితంగా ఆయనకు ఆ హక్కు ఉంది. అసలు ప్రశ్న ఏమిటంటే—ఆయన ఇప్పుడు మద్దతు ఇస్తున్న ఉద్యమం తన ఆరోపణలను రుజువు చేయగలదా, తన రాజకీయ, ఆర్థిక సంబంధాలను వెల్లడించగలదా, తాను రక్షిస్తున్నానని చెప్పుకునే ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీయకుండా తన లక్ష్యాలను సాధించగలదా లేదా అనేది మాత్రమే.

News at a glance

Prashant Bhushan “Regime Change” Remarks & CJP/SIR Protests

https://indianexpress.com/article/india/we-want-regime-change-says-prashant-bhushan-bjp-hits-back-out-to-stage-a-coup-10923771/

https://www.tribuneindia.com/news/delhi/cjps-anti-sir-protest-takes-political-turn-as-prashant-bhushan-calls-it-fight-for-regime-change/

https://thefederal.com/category/news/prashant-bhushan-regime-change-259702

https://www.moneycontrol.com/news/india/we-all-want-a-regime-change-prashant-bhushan-calls-it-citizens-constitutional-right-questions-allegations-of-conspiracy-14053090.html

https://www.opindia.com/news-updates/we-all-want-regime-change-prashant-bhushan-says-anti-sir-protests-are-about-removing-the-government/

Mary Millben Allegations of US Funding for CJP/Abhijeet Dipke

https://m.economictimes.com/magazines/panache/who-is-mary-millben-american-singer-spars-with-abhijeet-dipke-alleges-cjp-is-funded-by-us-donors/articleshow/134986138.cms

https://www.tribuneindia.com/news/india/dipke-cjp-being-funded-by-anti-modi-us-donors-american-singer/

https://www.moneycontrol.com/news/india/don-t-need-outsiders-to-interfere-abhijeet-dipke-hits-back-at-us-singer-for-saying-cjp-is-getting-foreign-funding-14052437.html

Nahid Islam / Bangladesh Support for CJP

https://timesofindia.indiatimes.com/world/south-asia/bangladesh-party-backs-cjp-stir-ex-yunus-aide-seeks-modis-fall/articleshow/134879664.cms

https://www.opindia.com/news-updates/bangladeshi-student-leader-nahid-islam-who-led-violent-protests-against-sheikh-hasina-supports-illegal-cjp-protests/

https://www.indiatvnews.com/news/india/kejriwal-admits-his-ngo-took-money-from-ford-foundation-2-years-back-10340.html (historical admission on Ford Foundation funding)

ADR Funding (Ford Foundation, Omidyar, etc.)

https://www.opindia.com/2025/02/adr-which-continues-to-target-modi-govt-is-funded-by-deep-state-entities-like-ford-foundation-and-omidyar-network/

https://www.fordfoundation.org/work/our-grants/awarded-grants/grants-database/association-for-democratic-reforms-adr-122669/ (official Ford grant page)

Bhushan Kashmir remarks (2011)

https://www.indiatoday.in/india/north/story/prashant-bhushan-interview-143239-2011-10-12

https://timesofindia.indiatimes.com/india/prashant-bhushan-attacked-for-kashmir-remark/articleshow/10333933.cms

https://web.archive.org/web/20111021164834/http:/indiatoday.intoday.in/video/what-prashant-bhushan-said-on-kashmir/1/154685.html

Sambhaavnaa Institute / Yogendra Yadav collaborations (recent protest detentions)

https://indianexpress.com/article/cities/delhi/sir-protest-jantar-mantar-60-detained-neha-bora-yogendra-yadav-10894247/

https://www.tribuneindia.com/news/india/3-firs-filed-yogendra-yadav-kapil-sibal-prashant-bhushan-among-150-detained-on-way-to-jantar-mantar/

2019 meeting links (Umar Khalid / Sharjeel Imam)

https://www.opindia.com/2023/12/delhi-anti-hindu-riot-prashant-bhushan-hosted-earliest-conspiracy-meeting-with-umar-khalid-sharjeel-imam-and-yogendra-yadav/

Academic insights

https://swarajyamag.com/magazine/imported-ideology-activism-for-export
(“Imported Ideology, Activism For Export” – Madhu Purnima Kishwar, Swarajya, 2015)

https://manushi.in/how-foreign-funded-ngos-circumvent-fcra-to-subvert-india/
(“How Foreign Funded NGOs Circumvent FCRA to Subvert India” – Manushi)

https://www.vayuveg.com//Encyc/2025/10/11/prashant-bhushan-sambhaavnaa-institute-anti-india-activities.php

Social Media pulse

Prashant Bhushan on regime change https://x.com/Dev_Fadnavis/status/2110974085903929369?s=20

https://x.com/PiyushGoyal/status/2111060341363036399?s=20

https://x.com/sankrant/status/2110780891316506965?s=20

https://x.com/JethmalaniM/status/2110946889504067889?s=20

https://x.com/JaipurDialogues/status/2111108289262195069?s=20

https://x.com/BJP4India/status/2111062967907455091?s=20

https://x.com/angeloinchina/status/2110929237830230350?s=20

https://x.com/BJP4India/status/2111081146306146804?s=20

https://x.com/MrParleG/status/2110691954929639901?s=20

https://x.com/Tejasvi_Surya/status/2111124468907303344?s=20

https://x.com/PratyushKanth/status/2110746407229407581?s=20

https://x.com/BesuraTaansane/status/2111121276802826286?s=20

https://x.com/MajorPoonia/status/2109562102503608745?s=20

https://x.com/arvind_Navy/status/2111124831798468881?s=20

https://x.com/ModifiedAayush/status/2110979080539750853?s=20

https://www.facebook.com/reel/1794260668772289

https://x.com/pratheesh_Hind/status/2111082248405754041

https://x.com/sgurumurthy/status/2111132280572047492?s=20

https://www.youtube.com/watch?v=ksz-5XsCHI8
(“Critical Look at Foreign Funded / Foreign Backed NGOs in India” – Sangam Talks)

https://www.youtube.com/watch?v=smuqVcfg31Q
(“भारत में विदेशी वित्तपोषित (foreign funded) NGOs पर एक आलोचनात्मक दृष्टिपात” – Madhu Purnima Kishwar)

https://www.youtube.com/watch?v=tyJSYlKH0jI
(“How the Foreign Funded NGOs are destroying the Social Fabric of India?” – Madhu Kishwar)

https://www.youtube.com/watch?v=wAiYXIaorXI
(Madhu Kishwar speaks at the Conference on Foreign Funded NGOs, 2015)

 

📚

On Our Reading List

1. Breaking India: Western Interventions in Dravidian and Dalit Faultlines

Authors: Rajiv Malhotra & Aravindan Neelakandan
https://www.amazon.in/Breaking-India-Western-Interventions-Faultlines/dp/8191067374

https://rajivmalhotra.com/product/breaking-india/

2. Snakes in the Ganga: Breaking India 2.0

Authors: Rajiv Malhotra & Vijaya Viswanathan

https://www.amazon.in/Snakes-Ganga-Breaking-India-2-0/dp/939220908X

  1. NGOs, Activists & Foreign Funds Anti-Nation Industry, edited by Radha Rajan and Krishen Kak

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *