News from StatesTelanganaTrending News

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు

Introductory Memo :

తెలంగాణ‌లో పేరుకుపోయిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కం బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ భార‌తీయ జ‌నతా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద్ర‌రావు రెండు రోజుల నిరాహార దీక్ష‌కు దిగారు.  రూ.12 వేల కోట్ల‌కు పైగా బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేసి విద్యార్థుల‌ను ఆదుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు.  ఈ బ‌కాయిల కార‌ణంగా దాదాపు 20 ల‌క్ష‌ల మంది విద్యార్థ‌లు భ‌విష్య‌త్తు అగమ్య గోచ‌రంగా మారింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ బ‌కాయిలు విదుడ‌ద‌లయ్యేంతవ‌ర‌కు త‌మ పోరాటాన్నిఆవేది లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. దీక్ష‌లో త‌న‌తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటార‌ని ఆయ‌న తెలిపారు.  ఈ దీక్ష‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించార‌ని బీజేపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వీరేంద‌ర్ తెలిపారు. అయినా పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో దీక్ష‌కు దిగ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  ఈ నేప‌థ్యంలో దీక్ష‌కు కార‌ణ‌మైన ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ స్కీంకు సంబంధించిన స‌మ‌గ్ర వివ‌రాల‌తో విశ్లేష‌ణ ఇది.

Analytical view/ Analysis :

పేద విద్యార్థుల‌కు ఉన్న‌త విద్య అందుబాట్లోకి తీసుకురావాల‌న్న సదాశ‌యంతో 2008లో ఉమ్మ‌డి  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు డబ్బుల కొరత వల్ల ఉన్నత విద్యకు దూరం కాకూడదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ తదితర వర్గాల విద్యార్థులకు ప్రొఫెషనల్ కోర్సులు, ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడం ఈ ప‌థ‌కం ప్ర‌ధాన ఉద్దేశం. ఇది ఒక చ‌రిత్రాత్మ‌క ప‌థ‌కంగా నిల‌చిపోయింది. ప్ర‌తిభ ఉన్నప్ప‌టికీ క‌ళాశాల ఫీజులు చెల్లించ‌లేని స్థితిలో ఉన్న‌త చ‌దువుల‌కు దూరమ‌వుతున్న వెన‌క‌బ‌డిన వ‌ర్గాల‌కు ఈ ప‌థ‌కం ఒక వ‌రంగా మారింది. ఏటా కొన్ని వేల మంది ఈ ప్ర‌యోజ‌నాన్ని పొంది ఉన్న‌త విద్యావంతుల‌య్యారు. ఒక ర‌కంగా  రెండు రాష్ట్రాల  సామాజిక ముఖచిత్రాన్నే ఈ ప‌థ‌కం మార్చివేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. నిరుపేద కుటుంబాల పిల్ల‌లు బీటెక్ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్  రంగంలో ఉపాధిపొంద‌డంతో పాటు విదేశీ అవ‌కాశాల‌ను కూడా అందిపుచ్చుకోవ‌డంతో ఈ ద‌శాబ్ద కాలంలో వారి ఆర్థిక స్థితిగ‌తులే మారిపోయాయి. అన‌ర్షులు కూడా ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధి పొందుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్న‌ప్ప‌టికీ మొత్త‌మ్మీద చూస్తే ఇది అత్యంత ప్ర‌యోజ‌న‌కారిక‌గా మారింది.  ప్ర‌యివేట్ రంగంలో క‌ళాశాల‌లు కూడా ఈ ప‌థ‌కం ద్వారా ఎంత‌గానో ల‌బ్ధిపొందాయి. ప్ర‌వేశాలు పెర‌గ‌డం, ఫీజుల‌కు ప్ర‌భుత్వం జ‌వాబు దారీ కావడంతో వారికి కూడా నిర్వ‌హ‌ణ ప‌రంగా ఉప‌యోగ‌ప‌డింది. ఈ ప‌థ‌కాన్ని ఏ పార్టీ కూడా వ్య‌తిరేకించ‌లేని స్థితి ఏర్ప‌డింది.  ప్ర‌భుత్వాలు మారినా …విధానాలు మారినా విద్యార్థి లోకానికి మేలు చేసే ఈ ప‌థ‌కాన్ని కొన‌సాగించాల్సి వ‌స్తోంది. అయితే ఉద్దేశం మంచిదే అయినా…ఫ‌లితాలు ఆశించిన స్థాయిలో ఉన్నా నిధుల లేమి ప్ర‌భుత్వాల‌కు ఒక స‌వాల్‌గా ప‌రిణ‌మించింది. ప‌ర్య‌వ‌సానంగా క్ర‌మంగా బ‌కాయిలు పేరుకుపోవ‌డం మొద‌లైంది. తెలంగాణ‌లో గ‌త బీ  ఆర్ ఎస్ ప్ర‌భుత్వంలోనే ఈ స‌మ‌స్య ప్రారంభం కాగా…ప్ర‌స్తుత కాంగ్రెస్ హ‌యాంలోనూ ఈ స‌మ‌స్య కొన‌సాగుతోంది.  2009-10లో ఈ పథకానికి సుమారు రూ.2,500 కోట్ల కేటాయింపు చేసినట్లు అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు చెబుతున్నాయి. ఆ సమయంలో సుమారు 26 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని, తదుపరి విస్తరణతో సుమారు 33 లక్షల మందికి ప్రయోజనం కల్పించాలన్న లక్ష్యం ఉన్నట్లు నమోదైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకానికి వార్షికంగా రూ.5,000 కోట్లకు పైగా ఆర్థిక భారం ఉండేదని 2014లో వచ్చిన నివేదిక పేర్కొంది.

బీఆర్ ఎస్‌ హయాంలో పరిస్థితి

2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.2,000 కోట్లు ఉన్నాయని మాజీ ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు 2025లో అసెంబ్లీలో పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే ఆ బకాయిలను చెల్లించామని ఆయన చెప్పారు.

అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం పథకాన్ని కొనసాగించింది. 2014-15 విద్యా సంవత్సరం నుంచే పథకాన్ని కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్ ఎస్ నేతల ప్రకారం 2014 నుంచి సుమారు పదేళ్లలో రూ.20,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించారు. కానీ ఆ ప్ర‌భుత్వ కాలంలో కూడా  బకాయిలపై విద్యార్థి సంఘాలు, కాలేజీ యాజమాన్యాలు ఆందోళనలు చేశాయి.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ..

2023 డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్య మరింత తీవ్రంగా మారిందని విద్యార్థి సంఘాలు, కాలేజీ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ హైకోర్టులో కాలేజీ యాజమాన్యాలు సుమారు రూ.10,000 కోట్ల బకాయిలు ఉన్నాయని వాదించాయి జూలైలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు సుమారు రూ.12,000 కోట్లు, 20 లక్షల మంది విద్యార్థులు ప్రభావితమవుతున్నారని ఆరోపించారు. ఆగస్టు 23న  …దీక్ష ప్రారంభానికి ముందు రోజు కూడా ఆయ‌న ఇందే సంఖ్య‌ను ప్ర‌స్తావించారు. బీజేపీ నేత‌లు అక్క‌డ‌క్కడా ఈ మొత్తాన్ని ఇంకా పెంచి చెప్తున్నారు.

తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది?

జూలై 2026లో హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన హామీని రికార్డు చేసి, 2వ, 3వ, 4వ సంవత్సరం విద్యార్థుల వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత జూలై 31లోగా బకాయిలను విడుదల చేయాలని ఆదేశించింది. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు 15లోగా తొలి విడత చెల్లింపులు చేస్తామ‌ని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జూలై 9న ప్రభుత్వం హైకోర్టుకు రూ.250 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పగా, కాలేజీలు మాత్రం రూ.2,800 కోట్లకు పైగా బకాయిల్లో కనీసం 50 శాతం విడుదల చేయాలని వాదించాయి. బీజేపీ చెబుతున్న మొత్తం బకాయి, ప్రభుత్వం అంగీకరించే లెక్క మధ్య వ్యత్యాసం ఉంది.

విద్యార్థి, యువ‌జ‌న  సంఘాల పోరాటం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థి ఉద్యమాలు కొత్తవి కావు. బీఆర్ ఎస్  ప్రభుత్వ కాలంలో ఏబీవీపీ, ఎన్ ఎస్ యూ, ఐ ఇతర విద్యార్థి సంఘాలు బకాయిల విడుదల కోసం ఆందోళనలు నిర్వహించాయి. విద్యార్థుల సమస్య కాలేజీ యాజమాన్యాల ఆర్థిక సమస్యగా మాత్రమే కాకుండా విద్యార్థుల చదువు, పరీక్షలు, సర్టిఫికెట్లతో ముడిపడిన సమస్యగా మారింది. 2017లోనే విద్యావేత్త చుక్కా రామయ్య, టీ జేఏసీ  నేత కోదండరామ్ తదితరులు బకాయిలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా  ఏబీవీపీ సహా విద్యార్థి సంఘాలు రంగంలో ఉన్నాయి. 2025లో  ఏబీవీపీ  హైదరాబాద్‌లో బకాయిల విడుదల కోసం నిరసన చేపట్టింది. 2026లో బీజేపీ యువజన విభాగం  ఫీజుల బ‌కాయి..బీజేపీ ల‌డాయి పేరుతో  పోరాటం   చేపట్టింది. బీజేపీ ప్రకారం విద్యార్థుల నుంచి సుమారు 5 లక్షల సంతకాలు సేకరించారు.

అడ‌క‌త్తెర‌లో కాలేజిల‌ యాజ‌మాన్యాలు

ఫీజుల బకాయిలు పేరుకుపోతుండ‌టం కాలేజీ యాజ‌మాన్యాల‌కు  కొర‌క‌రాని కొయ్య‌గా మారింది. రావ‌ల‌సిన ఫీజులు రాక‌పోవ‌డంతో ఆదాయం ఒక్క‌సారిగా పడిపోతోంది. అదే స‌మ‌యంలో వారు లెక్చ‌రర్ల‌కు జీతాలు, భ‌వ‌నాల‌కు అద్దెలు, విద్యుత్ బిల్లులు, ఇత‌ర నిర్వ‌హ‌ణ ఛార్జీలు చెల్లించుకోవ‌ల‌సి ఉంటుంది. దాంతో వారు ఇక్క‌ట్ల‌లో ప‌డుతున్నారు. దాంతో వారు కూడా పోరుబాట‌కు దిగారు.

2025లో  ది ఫెడ‌రేష‌న్ ఆఫ్ అసోసియేష‌న్స్ ఆఫ్ తెలంగాణ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ (The Federation of Associations of Telangana Higher Institutions -FATHI), ఆధ్వర్యంలో వేలాది ప్రైవేట్ కాలేజీలు నిధుల కొరతతో సమ్మెకు దిగాయి. వారు అప్పటికే బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,200 కోట్లను విడుదల చేయాలని, పాత బకాయిలన్నీ చెల్లించాలని డిమాండ్ చేశారు. 2026లో కాలేజీలు హైకోర్టును ఆశ్రయించడానికి కూడా ఇదే ఆర్థిక సంక్షోభం కారణమైంది.

విద్యార్థుల‌పై ప్ర‌భావం

ఉరుమురిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్లు ఇప్పుడు ప‌రిస్థితి తీవ్ర‌త నేరుగా విద్యార్థుల‌పై ప‌డుతోంది. ప్ర‌భుత్వం నుంచి బ‌కాయిలు రాలేని ప‌రిస్థితుల్లో యాజ‌మాన్యాలు విద్యార్థుల‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. కొన్ని కాలేజీలు   ట్రాన్స్‌ఫ‌ర్ స‌ర్టిఫికేట్‌,  బోనాఫైడ్ వంటి సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఉన్నత విద్య, ఉద్యోగాలు, తదుపరి అడ్మిషన్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

బీజేపీ ఎందుకు ఈ అంశాన్ని భుజాన వేసుకుంది?

భార‌తీయ జ‌న‌తాపార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జా పోరాటాలు, ఆందోళ‌న‌ల విష‌యంలో గ‌త కొంత కాలంగా అంత చురుగ్గా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని అభిప్రాయం ఉంది.  దానికి తోడు పార్టీలో ఉన్న అంత‌ర్గ‌త విభేదాలు,  స‌మ‌న్వ‌య లోపం కార‌ణంగా ఎవ‌రి ధోర‌ణి వారిదే అన్న‌ట్లుగా సాగుతోంది. ఈ ద‌శ‌లో  పార్టీ అభిమానుల్లో ఒకింత నిరాశా  నిస్పృహ‌లు మొద‌ల‌య్యాయి. ఇదే స‌మ‌యంలో ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద జెన్ జీ విద్యార్థుల ఆందోళ‌న విజ‌య‌వంతం కావ‌డం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ప‌ద‌వికి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల్సి రావ‌డం బీజేపీ వ‌ర్గాల‌ను ఉలిక్కి ప‌డేలా చేసింది. పార్టీ విద్యార్థులు, యువ‌తను ఆక‌ర్షించే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేలా పురికొల్పింది.  కేంద్ర మంత్రులు యూనివ‌ర్సిటీల‌ను సంద‌ర్శించాల‌ని, వారి స‌మ‌స్య‌లు వినాల‌ని, వారి కోసం కేంద్రం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను వివరించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అలాగే పార్టీ అంత‌ర్గ‌తంగా కూడా యువ‌త‌ను, విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో స్త‌బ్ధ‌త‌ను దూరం చేయ‌య‌డానికి, అదే స‌మ‌యంలో విద్యార్థి లోకాన్ని ఆక‌ట్టుకునేలా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ అంశాన్ని భుజానికెత్తుకున్న‌ట్లు తెలుస్తోంది.

బీజేపీకి క‌ల‌సివ‌చ్చే అంశం

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోవ‌డం పెను స‌మ‌స్యగా ప‌రిణ‌మించింది.  అటు కాంగ్రెస్ ను, ఇటు బీఆర్ ఎస్ ను ఏక‌కాలంలో ఇర‌కాటంలో పెట్టేందుకు వీలున్న అంశం. అందువ‌ల్ల రామ‌చంద్ర‌రావు దీక్ష రాజ‌కీయంగా గ‌ణ‌నీయ‌మైన ప్ర‌భావం చూప‌నుంది.  ఇది రాజ‌కీయంగా బీజేపీకి చాలా క‌లిసివ‌చ్చే అంశం. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ప్ర‌యివేట్ కాలేజీల యాజ‌మాన్యాలు, ఉద్యోగులు, యువ‌త అంద‌రూ ఈ ప‌థ‌కం వ‌ల్ల ప్ర‌భావితుల‌వుతున్నందున బకాయిలు విడుద‌లైతే ఆయా రంగాల వారి నుంచి పార్టీకి మంచి ఆద‌రణ ల‌భించే అవ‌కాశాలున్నాయి.విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వాలపై అసంతృప్తితో ఉన్న తరుణంలో ఈ పోరాటం యువతలో బీజేపీ పట్ల సానుకూలత పెంచే అవకాశం ఉంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటోంది?

ఫీజు రీ యింబ‌ర్స్ మెంట్ బ‌కాయిలు పేరుకుపోయిన‌ది వాస్త‌వ‌మే అయినా ఆ పాపం త‌మ ఒక్క ప్ర‌భుత్వానిదే కాద‌ని కాంగ్ర‌స్ అంటోంది.  సమస్య  గత ప్రభుత్వాల కాలం నుంచే కొనసాగుతోంద‌ని పేర్కొంటోంది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూలై 28న రాష్ట్రానికి సంవత్సరానికి రూ.2,200–2,400 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అవసరమవుతుందని చెప్పారు. భవిష్యత్తులో అర్హత ఉన్న కాలేజీలకు సకాలంలో చెల్లించే కొత్త విధానం తీసుకువస్తామని, తప్పుడు క్లెయిమ్‌లు చేసే సంస్థలపై చర్యలు ఉంటాయని చెప్పారు.

దీక్ష‌తో ప్ర‌యోజ‌నం ఉంటుందా?

బీజేపీ దీక్ష ఒక్కటే రూ.10–12 వేల కోట్లను వెంటనే విడుదల చేయించే స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ హైకోర్టు ఆదేశాలు,  కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి, విద్యార్థి సంఘాల ఆందోళనలు, ప్రతిపక్ష రాజకీయ ఒత్తిడి కలిస్తే ప్రభుత్వం చెల్లింపుల షెడ్యూల్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.    నిరసనలు తీవ్రరూపం దాల్చితే, విద్యాసంస్థల మూసివేతను నివారించడానికి , శాంతిభద్రతల సమస్య రాకుండా చూడటానికి ప్రభుత్వం తక్షణమే కొంత మొత్తాన్ని (కనీసం బకాయిల్లో కొంత శాతం) అత్యవసరంగా విడుదల చేసే దిశగా అడుగులు వేయక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు.

News at a Glance: ;

https://cms.sakshi.com/telugu-news/telangana/bjp-ramchander-rao-serious-comments-congress-govt-2882950?utm_source=chatgpt.com

https://www.eenadu.net/telugu-news/telangana/general/1899/126151798

https://epaper.andhrajyothy.com/article/Hyderabad?OrgId=248778cdd88&eid=34&imageview=1&device=desktop

https://epaper.andhrajyothy.com/article/Hyderabad?OrgId=24838857e48&eid=34&imageview=1&device=desktop

https://epaper.andhrajyothy.com/article/Hyderabad?OrgId=248833b3efb&eid=34&imageview=1&device=desktop

https://timesofindia.indiatimes.com/city/hyderabad/govt-to-credit-2400-crore-fee-reimbursement-directly-to-students-revanth/articleshow/133250348.cms?utm

https://thesouthfirst.com/opinion/generation-at-risk-telanganas-youth-caught-between-fee-reimbursement-failure-and-the-unemployment-crisis/?utm

https://www.deccanchronicle.com/southern-states/telangana/telangana-to-unveil-new-fee-reimbursement-policy-to-pay-200cr-pm-1960235?utm

https://trinetnews.com/latest/bjp-state-president-ramachander-rao-fires-on-fee?lang=en&utm

https://telanganatoday.com/telangana-congress-govt-drops-bombshell-on-students?utm

https://telanganatoday.com/jeevan-reddy-demands-withdrawal-of-go-9-over-fee-reimbursement-row?utm

https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/rs-5000-crore-fee-reimbursement-dues-to-25-hyderabad-colleges-government-set-to-address-by-end-of-april-1513256.html?utm

https://www.ndtv.com/telangana-news/telangana-colleges-end-strike-after-assurance-to-release-rs-600-crore-dues-9284680?utm

https://telugu.samayam.com/telangana/news/telangana-cm-revanth-reddy-on-pending-fee-reimbursement-for-students/articleshow/132688227.cms?utm

https://www.newindianexpress.com/states/telangana/2026/Aug/24/students-in-limbo-as-telangana-dithers-on-fee-sop?utm_source=chatgpt.com

 

 

By the Numbers :

అంశం విద్యార్థుల సంఖ్య మొత్తం బకాయి డేటా స్థితి
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం RTF Pending ₹9,000–₹10,000+ కోట్లు కాలేజీలు/విద్యాసంస్థల వాదనలు; అధికారిక consolidated figure కాదు
BC-RTF – నాగర్‌కర్నూల్, 2025–26 367 ₹0.35 కోట్లు ✅ జిల్లా అధికారిక డేటా
EBC-RTF – నాగర్‌కర్నూల్, 2025–26 6 ₹0.12 కోట్లు ✅ జిల్లా అధికారిక డేటా
BC + EBC – నాగర్‌కర్నూల్ 373 ₹0.47 కోట్లు ✅ జిల్లా అధికారిక డేటా
Minority RTF – మహబూబాబాద్ 550 sanctioned ₹0.388 కోట్లు ✅ జిల్లా అధికారిక డేటా
Post-Matric Scholarship – తెలంగాణ, 2025–26 6,84,826 beneficiaries ₹1,291.80 కోట్లు disbursed ✅ CGG/ePASS data

గమనిక: ₹9,000–₹10,000 కోట్లను “ప్రభుత్వ అధికారిక బకాయిగా  చూప‌కూడ‌దు

 

రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌స్తుత ప‌రిస్థితి

తెలంగాణ Fee Reimbursement — సమగ్రంగా

అంశం మొత్తం / సంఖ్య ఆధారం అర్థం
2023–24 Fee Reimbursement ₹484.90 కోట్లు Telangana Socio-Economic Outlook 2024 1,92,908 BC + 21,482 EBC + 53,883 Minority విద్యార్థులకు చెల్లింపు జరిగింది
2023–24 beneficiaries 2,68,273 తెలంగాణ ప్రభుత్వం పై మూడు categories మొత్తం
కాలేజీల వాదన – 2026 దాదాపు ₹10,000 కోట్లు High Court proceedings / Deccan Chronicle 2023 నుంచి pending duesగా కాలేజీల తరఫు వాదన
News reportsలో cited arrears ₹9,000–₹12,000 కోట్లు వివిధ news reports ఇది ఒకే official consolidated government number కాదు
Engineering colleges claim ₹1,000+ కోట్లు High Court reporting Engineering collegesకే సంబంధించిన dues
ప్రభుత్వం ప్రకటించిన కొత్త annual mechanism ₹2,400 కోట్లు/ఏడాది Telangana State Portal 2026–27 నుంచి ముందస్తుగా students’ accountsలో జమ చేసే విధానం

 

తెలంగాణ Fee Reimbursement — 2024–26

సంవత్సరం / కాలం డేటా మొత్తం విద్యార్థులు స్థితి / మూలం
2024–25 BC Reimbursement Tuition Fee ₹22.2183 కోట్లు Suryapet జిల్లా అధికారిక డేటా
2024–25 EBC Reimbursement Tuition Fee ₹5.8161 కోట్లు Suryapet జిల్లా అధికారిక డేటా
2024–25 BC + EBC RTF ₹28.0344 కోట్లు Suryapet జిల్లా అధికారిక డేటా; ₹35.94 కోట్లు విడుదలలో భాగం
2025–26 BC-RTF ₹0.35 కోట్లు 367 Nagarkurnool అధికారిక డేటా
2025–26 EBC-RTF ₹0.12 కోట్లు 6 Nagarkurnool అధికారిక డేటా
2025–26 BC + EBC RTF ₹0.47 కోట్లు 373 Nagarkurnool అధికారిక డేటా
2025 Professional colleges pending ₹1,650 కోట్లు FATHI claim; tokens already issued అని పేర్కొంది
2026 గత 3 సంవత్సరాల institutional dues ₹7,500 కోట్లు College-management claim; గత 3 సంవత్సరాల్లో ₹900 కోట్లు మాత్రమే చెల్లించామని పేర్కొన్నారు
2026 Fee reimbursement arrears దాదాపు ₹10,000 కోట్లు 14 లక్షల వరకు KTR claim; 2,500+ institutions ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు
2026–27 కొత్త RTF/MTF DBT విధానం 2026–27 నుంచి విద్యార్థుల Aadhaar-linked bank accountకు చెల్లింపు; 2025–26 వరకు పాత dues చెల్లించాల్సి ఉంటుందని GO పేర్కొంది

 

Academic Insight : https://www.scribd.com/document/1033888167/G-O-Ms-No-7-dt-29-04-2026?utm

https://telanganaepass.cgg.gov.in/?utm

https://www.cgg.gov.in/it_project/electronic-payment-and-application-system-for-scholarships-epass/?utm

https://cag.gov.in/en/state/telangana?utm

Social Media Pulse :

https://www.facebook.com/watch/?v=1013604534689632

https://www.facebook.com/watch/?v=1201729123026653

https://www.instagram.com/reel/DaNg_Zpyl5n/?utm_source=ig_web_button_share_sheet

https://www.instagram.com/reel/DXzBpAfK6E_/?utm_source=ig_web_button_share_sheet

https://w.twstalker.com/BJP4Telangana?utm_source=chatgpt.com

https://w.twstalker.com/BJP4Telangana?utm_source=chatgpt.com

On Our Reading List :

https://des.telangana.gov.in/publications/?utm

https://des.telangana.gov.in/publications/SEEEPC/?utm

https://cag.gov.in/en/state/telangana?utm

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *