గల్ఫ్ వలస కార్మికుల సమస్యలు
పరిచయం:
ఉద్యోగాల కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఒమన్, సౌదీ అరేబియా వంటి దేశాలకు వెళ్లిన తెలంగాణకు చెందిన ఎనిమిది మంది గత కొన్ని నెలలుగా కనిపించకుండా పోయారు. వారి గురించి తమకు ఎలాంటి సమాచారం తెలియడం లేదని తెలిపారు. వారిని గుర్తించి స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వ సహాయం కోసం అనేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ, పెద్దగా సహాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చేగుంట్లకు చెందిన క్లీనర్ మహ్మద్ సులేమాన్ జూన్నుంచి కనిపించడం లేదని ఆమె భార్య సైదా తెలిపారు. ఒమన్‌లో తమకు సహాయం చేసే వారు ఎవరూలేరని ఆమె ఆవేదన చెందుతున్నారు. “జూన్ 16న ఆయన ఒమన్ వెళ్లారు. కొన్ని రోజులకే ఆయనతో సంబంధాలు తెగిపోయాయి. చివరిసారిగా మా దగ్గర మాట్లాడినప్పుడు తన రూమ్మేట్స్తో కలిసి బీచ్‌కు వెళ్తున్నానని చెప్పారు” అని సైదా కన్నీటితో చెప్పారు. తన భర్తను ఒమన్‌కు పంపించిన ఏజెంట్ కూడా ఇప్పుడు ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక్క సైదా ఆవేదన కాదు. ఆమె లాగే ఎంతో మంది తమ బంధువుల జాడ తెలియక తల్లడిల్లిపోతున్నారు. తాజాగా 8 మంది ఇలా ఆచూకీ లేకుండా పోయారని తెలుస్తోంది. జగిత్యాల జిల్లాకు చెందిన రమేశ్ జూన్ 16 నుంచి UAEలో కనిపించకుండా పోయారు. కామారెడ్డికి చెందిన మలుత్ కోటయ్య మానవ వనరుల సంస్థలో పనిచేయడానికి సౌదీ అరేబియాకు వెళ్లారు. ఆయన జూన్ 30 నుంచి కనిపించకుండా పోయారు. భూక్య శ్రీకాంత్ కూడా జూన్ 7 నుంచి ఆచూకీ లేకుండా పోయారు. బనియాస్‌లోని లులు హైపర్‌మార్కెట్ సమీపంలోని ఒక సంస్థలో పనిచేయడానికి ఆయన దుబాయ్ వెళ్లి సుమారు రెండేళ్ల తర్వాత కనిపించకుండా పోయారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌కు చెందిన మరో మహిళ మాట్లాడుతూ.. తన భర్త కూడా దుబాయ్‌లోనే ఉన్నారని తెలిపారు. అయితే తన కుమారుడి కోసం వెతకడానికి ఆయన స్వేచ్ఛగా బయటకు వెళ్లలేకపోతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఉద్యోగ వీసా పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతున్నందున ప్రయాణం చేయడం సాధ్యం కావడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు అసలు ఎందుకు వెళ్తున్నారు. అక్కడ వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? ప్రభుత్వాలు అసలేం చేస్తున్నాయి? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
విశ్లేషణాత్మక దృక్పథం:
ఉపాధి కోసం తెలంగాణ జిల్లాల నుంచి గత కొన్నిసంవత్సరాలుగా అనేక మంది గల్ఫ్ దేశాలకు వలసపోతున్నారు. విద్యాధికులతో పాటు స్కిల్డ్ , అన్ స్కిల్డ్ వర్కర్స్, అసంఘటిత రంగ కార్మికులు ఈ దేశాలకు వెళ్లడం సర్వసాధారణం. అదే సమయంలో ఏజెంట్ల బారినపడి ఎంతో మంది మోసపోయిన ఉదంతాలు గతంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. సరైన వీసాలు లేక, వర్క్ పర్మిట్లు లేక గల్ఫ్ దేశాల్లో ఎంతోమంది చిక్కుకుపోతుంటారు. కొంతమంది ఒకరకంగా బానిసల్లాగా బతుకుతూ బయటపడే మార్గం లేక అల్లాడుతుంటారు. మరికొంత మంది పనిప్రదేశాల్లో మరణిస్తుంటారు.మరణించిన వారి మృతదేహాలు భారతదేశానికి తీసుకురాలేని స్థితి కూడా ఏర్పడుతుంటుంది. ఎంతో మంది జాడ కూడా తెలియకుండా పోతోంది.
తెలంగాణ నుంచి ఎంతమంది వలస వెళ్లారు?
“తెలంగాణ నుంచి సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నట్లు వివిధ అంచనాలు సూచిస్తున్నాయి; తెలంగాణలో గల్ఫ్ వలసలకు దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. గల్ఫ్ దేశాల్లో చమురు ఆదాయం పెరిగి, 1970లలో భారీగా నిర్మాణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రారంభమైనప్పుడు విదేశీ కార్మికులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. భారత్ నుంచి గల్ఫ్‌కు కార్మిక వలసలు కూడా 1970ల ప్రారంభంలో వేగం పుంజుకున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వలస ఎక్కువగా ఉంది. తర్వాత జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, సిద్దిపేట తదితర జిల్లాలకు విస్తరించింది.
గల్ఫ్ వలసకు ప్రధాన కారణాలు
తెలంగాణ నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. స్థానికంగా ఉద్యోగాల కొరత, పంటలు పండించలేని స్థితి, పండించినా వ్యవసాయంలో ఆదాయ తగ్గడం, గ్రామీణ ప్రాంతాల్లో తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడం ప్రధాన కారణాలు. ఈ పరిస్థితుల్లో కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే ఏం చేయాలో అర్థం కాక… భారత దేశంతో పోలిస్తే గల్ఫ్‌లో ఎక్కువ సంపాదించవచ్చన ఆశతో చాలా మంది ఆ దేశాల బాటపడుతున్నారు. వెళ్లిన కొంతమంది స్వల్ప కాలంలోనే పెద్దమొత్తంలో సంపాదించి ఊళ్లోని అప్పులు తీరుస్తుండటం, తిరిగి వచ్చిన వ్యక్తులు భూములు కొనుక్కోవడం, ఇళ్లు కట్టుకోవడం చూసి చాలా మంది ప్రభావితులవుతున్నారు. అప్పటికే దుబాయ్, సౌదీ, కువైట్, ఒమన్‌లో ఉన్న బంధువులు లేదా గ్రామస్థులను కొత్తవారిని ప్రోత్సహించి తీసుకువెళ్లడం కూడా వలసలు పెరిగేందుకు కారణమైంది. “గల్ఫ్‌లో ఉద్యోగం” అనే విషయం కూడా కొన్ని ప్రాంతాల్లో స్టేటస్సింబల్ గా మారింది. దాంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు గల్ఫ్ దేశాలకు పంపించడమే లక్ష్యంగా ప్రోత్సహించేవారు.
గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు
పొట్ట చేతపట్టుకుని కొందరు…తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న ఆశతో మరికొందరు ఎడారిదేశాల బాట పడుతున్నారు. ఈ మార్గంలో కొత్తగా ఉపాధి అవకాశాలు రావొచ్చు. అధిక సంపాదన కూడా సాధ్యం కావొచ్చు. కానీ ఈ దారిలో అనేక సమస్యలు, సవాళ్లు ఉన్నాయి.
గల్ఫ్ దేశాలకు వెళ్లాలన్న కోరికను అడ్డం పెట్టుకుని , దీనినే అదునుగా తీసుకుని ఏజెంట్లు మోసంచేయడం ప్రారంభించారు. ఇది గల్ఫ్ కు వెళ్లేవారు ఎదుర్కొంటున్న అతి తీవ్రమైనసమస్య. “దుబాయ్‌లో నెలకు ₹50,000 జీతం వస్తుంది” అని చెప్పి అక్కడికితీసుకువెళ్లిన తర్వాత అలాంటి ఉద్యోగం లేదు …మరో పనిచేయాలని చెప్పడంతో నిర్ఘాంతపోవడం వెళ్లినవారి వంతవుతోంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) కూడా ఇటువంటి సమస్యలను గుర్తించింది. deception, contract substitution, recruitment-fee debt, passport retention, illegal wage deductions వంటి అంశాలుగా నమోదు చేసింది.
టూరిస్ట్ వీసాతో వెళ్లి ఉద్యోగం చేయడం
పర్యాటక వీసాతో తీసుకెళ్లి ఉద్యోగం చేయించడం కూడా చాలా సందర్భాల్లో జరుగుతోంది. ఇది చాలా ప్రమాదకరం. భారత విదేశాంగ శాఖ (MEA) కూడా టూరిస్ట్ వీసాపై వెళ్లి, తరువాత వర్క్ వీసాగా మార్చుతామని ఏజెంట్ చెప్పినప్పుడు అంగీకరించవద్దని స్పష్టంగా సూచిస్తోంది. ఇలాంటి కేసుల్లో కార్మికుడు చట్టపరమైన రక్షణ కోల్పోవచ్చు, అరెస్టు/డిటెన్షన్ ఎదుర్కోవచ్చు, జీతం రాకపోవచ్చు, స్వదేశానికి తిరిగి రావడంలో ఇబ్బంది పడవచ్చు.
వేతనాలు ఇవ్వకపోవడం
గల్ఫ్ దేశాల్లో చాలా మందికి సకాలంలో జీతాలు అందడం లేదు. అందినా పూర్తిగా ఇవ్వడం లేదు. అలాగే అదనంగా చేసిన పనికి ఇవ్వాల్సిన డబ్బును ఎగ్గొడుతున్నారు.ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు చెప్పిన దానికంటే తక్కువ మొత్తాలను ఇస్తున్న ఉదంతాలు ఉన్నాయి. ఇలాంటి ఫిర్యాదులను భారత రాయబార కార్యాలయాలు స్థానిక యాజమాన్యం, అధికారులతో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాయని భారత విదేశాంగ శాఖ చెబుతోంది.
పాస్‌పోర్ట్ తీసేసుకోవడం
కొన్ని సందర్భాల్లో యజమానులు కార్మికుల నుంచి పాస్‌పోర్టులు తీసేసుకుంటున్నాయి. వారిని తమ నియంత్రణలో ఉంచుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఉపాధి కోసం వెళ్లిన వారు వేరే దారి లేక యజమామానులకు పాస్‌పోర్ట్‌లు ఇచ్చేసి తర్వాత ఒక రకంగా బందీగా మారిపోతున్నారు. ఇంటర్నేషన్ లేబర్ ఆర్గనైజేషన్ ఈ సమస్యను ప్రత్యేకంగా గుర్తించింది. ఎదురవుతాయి.
కాంట్రాక్ట్ మార్చడం
భారత్‌లో ఒక ఉద్యోగం, ఒక జీతం అని చెప్పి పంపించి, గల్ఫ్‌కు వెళ్లిన తర్వాత వేరే పని లేదా తక్కువ జీతం ఇవ్వడం. దీనినే కాంట్రాక్ట్ సబ్స్టిట్యూషన్ అంటారు. దీంతో కూడా కార్మికులకు వేతనం పరంగా, భద్రత పరంగా అన్యాయం జరుగుతోంది.
అప్పుల భారం
విదేశాలకు వెళ్లడానికి చాలా మంది అప్పులు చేయాల్సి వస్తోంది.కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రం కావడంతో .. ఉద్యోగం వచ్చాక తీర్చొచ్చులే అనే ధీమాతో చాలా మంది ముందుగా అప్పులు చేస్తున్నారు. ఏజెంట్ ఫీజు, వీసా, విమాన టికెట్, వైద్య పరీక్షలు, ఇతర ఖర్చుల కోసం రుణాలు తీసుకుంటున్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితులు అనుకున్నట్లు లేకపోవడం, తగినంత ఆదాయం రాకపోవడంతో ఇక్కడ వడ్డీలు పెరిగి కుటుంబాలు చాలా ఇబ్బందుల్లో పడుతున్నాయి. IOM–CESS అధ్యయనంలో కూడా చాలా మంది రిటర్నీ మైగ్రెంట్లు విదేశాలకు వెళ్లడానికి భారీగా అప్పులు చేసినట్లు తేలింది.
ప్రమాదాలు, మరణాలు
నిర్మాణ రంగం, పరిశ్రమలు, డ్రైవింగ్, ఇతర ప్రమాదకర పనుల్లో పనిచేసేవారికి ప్రమాదాల ముప్పు ఉంటుంది. మరణించిన తర్వాత మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడం, బీమా క్లెయిమ్, యజమాని నుంచి పరిహారం కుటుంబానికి రావాల్సిన బకాయిలు రాకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. భారత ప్రభుత్వం అవసరమైన సందర్భాల్లో ICWF ద్వారా మృతదేహాల రవాణా ఖర్చును కూడా భరించే అవకాశం కల్పించింది.
అదృశ్యం
తాజా తెలంగాణకు చెందిన ఎనిమిది మంది ఆచూకీ తెలియని కేసులు ఈ సమస్యకు మరో ముఖ్యమైన కోణాన్ని చూపుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? జైలులో ఉన్నాడా? ఆసుపత్రిలో ఉన్నాడా?, డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడా? ఉద్యోగం చేస్తున్నాడా? పాస్‌పోర్ట్/వీసా పరిస్థితి ఏమిటి? అన్నది కుటుంబానికి తెలియకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో భారత రాయబార కార్యాలయం, స్థానిక పోలీసులు, ఇమ్మిగ్రేషన్, ఆసుపత్రులు, జైళ్లు మొదలైన వాటితో సమన్వయం అవసరం.
కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది?
భారత ప్రభుత్వంలో ప్రస్తుతం ఈ అంశానికి ప్రధాన బాధ్యత భారత విదేశాంగ మంత్రిత్వశాఖ (MEA) వద్ద ఉంది. ఇందులో ముఖ్యమైన వ్యవస్థలు ఇవి.
ఈ మైగ్రేట్ ( eMigrate)
విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే కార్మికులు, రిక్రూటింగ్ ఏజెంట్లు, విదేశీ యజమానులు తదితరులను నియంత్రించడానికిఈ మైగ్రేట్ వ్యవస్థ ఉంది. ఏజెంట్ నిజంగా రిజిస్టర్ అయిన వ్యక్తా…కాదా అనేది కూడా ఇందులో పరిశీలించవచ్చు.
ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమిగ్రెంట్స్
(Protector General of Emigrants)
వలస కార్మికుల ఫిర్యాదులు, రిక్రూటింగ్ ఏజెంట్ల పై చర్యలు తదితర విషయాల్లో ముఖ్యమైన వ్యవస్థ.
అనధికారిక ఏజెంట్లపై ఫిర్యాదులను పోలీసులకు పంపే విధానం ఉంది. రిజిస్టర్డ్ ఏజెంట్‌పై ఫిర్యాదు వచ్చినప్పుడు షోకాజ్ నోటీస్, సస్పెన్షన్, అవసరమైతే రిజిస్ట్రేషన్ రద్దు వంటి చర్యలు తీసుకోవచ్చు.
మదద్ (MADAD)
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు కాన్సులర్/గ్రీవెన్స్ సమస్యలను నమోదు చేసుకునే వ్యవస్థ.
ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ICWF)
2009లో ప్రారంభమైన ఈ నిధి ద్వారా అవసరమైన సందర్భాల్లో తాత్కాలిక వసతి, ఆహారం, భారత్‌కు తిరిగి రావడానికి విమాన టికెట్, అత్యవసర వైద్యం, న్యాయ సహాయం జైలు/డిటెన్షన్ సమస్యల్లో సహాయం, మృతదేహాలను భారత్‌కు తరలించడం వంటి సహాయం అందించవచ్చు.
ప్రవాసీ భారతీయ బీమా యోజన
అర్హతగల విదేశీ కార్మికులకు ₹10 లక్షల వరకు ప్రమాద మరణం/శాశ్వత వైకల్య బీమా వంటి రక్షణ ఉంది. వైద్యం, తదితర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
భారత రాయబార కార్యాలయాలు: గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు/కాన్సులేట్లు కార్మికుల ఫిర్యాదులు, జైలు కేసులు, యజమానులతో వివాదాలు వేతన సమస్యలు, మృతదేహాల తరలింపు వంటి అంశాల్లో సహాయం చేస్తాయి.
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
తెలంగాణలో కూడా ఇటీవలి కాలంలో గల్ఫ్ వలస సమస్యపై దృష్టి పెరిగింది. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వీకరించడానికి తెలంగాణ ప్రభుత్వ ప్రవాసీ ప్రజావాణి వ్యవస్థ ఉంది. విదేశాల్లో
విదేశాల్లో మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ₹5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థలు
ప్రభుత్వ సంస్థలు
Ministry of External Affairs
Protector General of Emigrants
Indian Missions/Embassies
Indian Consulates
India Centre for Migration
Telangana Pravasi Prajavani
అంతర్జాతీయ సంస్థలు
International Labour Organization – ILO
International Organization for Migration – IOM
పౌర సమాజ సంస్థలు
Migrant workers associations
Gulf returnee organisations
NRI welfare organisations
కొన్ని కార్మిక సంఘాలు
స్థానిక మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్లు
సమస్యలు మాత్రమేనా..?
అయితే గల్ఫ్ వలస అనేది కేవలం సమస్యల కొని తెచ్చుకోవడానికే కాదు. తెలంగాణ గ్రామీణ ముఖచిత్రాన్నికూడా ఈవలస మార్చేసింది అని చెప్పక తప్పదు. గల్ఫ్ వలస వల్ల చాలా కుటుంబాల ఆదాయం పెరిగింది. అనేకమంది ఇళ్లు నిర్మించుకున్నారు. భూములు కొనుగోలు చేశారు. పిల్లలకు మెరుగైన విద్య అందించారు. అప్పులు తీర్చారుగ్రామాల్లో వినియోగం పెరిగింది. చిన్న వ్యాపారాలు ఏర్పడ్డాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం పెరిగింది. విజయ్ కొర్రా అధ్యయనం కూడా ఈ విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. అయితే గల్ఫ్ వలస తెలంగాణలో ఐదు దశాబ్దాలుగా లక్షలాది కుటుంబాల ఆర్థిక, సామాజిక జీవితాన్ని మార్చినప్పటికీ, వలసకు వెళ్లే ముందు రక్షణ, విదేశాల్లో కార్మిక హక్కులు, సంక్షోభ సమయంలో రక్షణ, మరణించిన వారి కుటుంబాలకు సహాయం, అదృశ్యమైన వారి ఆచూకీ, తిరిగి వచ్చినవారి పునరావాసం వంటి అంశాల్లో ఇంకా సమగ్ర వ్యవస్థ అవసరం ఉంది.”
STUDIES AND BOOKS
తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి గురించి ఇప్పటికే అనేక అధ్యయనాలు జరిగాయి. వాటిలో ముఖ్యమైనవి.
IOM–CESS అధ్యయనం — 2025
International Returnee Migrants in Telangana: A Survey అనే నివేదికను International Organization for Migration (IOM), తెలంగాణలోని CESS పరిశోధకులతో కలిసి ప్రచురించింది. ఇది తెలంగాణలో గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వలస కార్మికులపై జిల్లాల స్థాయిలో జరిగిన విస్తృతమైన అధ్యయనం. హైదరాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో 3,046 మంది రిటర్నీ మైగ్రెంట్లను పరిశీలించారు. ప్రత్యేక రాష్ట్ర స్థాయి వలస సంస్థ, సమగ్ర డేటాబేస్, నైపుణ్యాభివృద్ధి, రీ-ఇంటిగ్రేషన్ విధానం అవసరమని అధ్యయనం సూచించింది.
విజయ్ కొర్రా అధ్యయనం — Gulf Migration and Rural Transformation in Telangana
తెలంగాణ గల్ఫ్ వలసలపై ప్రత్యేకంగా వచ్చిన ముఖ్యమైన పుస్తకం ఇది.సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (CESS) నుంచి డాక్టర్ విజయ్ కొర్రా దీనిని 2025లో రచించగా మిట్టల్ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు.
ఈ పుస్తకం కోసం 2017 చివరి, 2018 ప్రారంభంలో తెలంగాణలోని 10 జిల్లాల్లో ఫీల్డ్ డేటా సేకరించారు. అందులో
గల్ఫ్‌కు ఎందుకు వెళ్తున్నారు?, ఎవరు వెళ్తున్నారు?, వారి విద్యా, సామాజిక, ఆర్థిక పరిస్థితి ఏమిటి?
ఎలాంటి పనులు చేస్తున్నారు? పని, నివాస పరిస్థితులు ఎలా ఉన్నాయి? గల్ఫ్ నుంచి వచ్చే డబ్బు కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? కుటుంబ సభ్యులపై ప్రభావం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
వలస వల్ల కుటుంబాలు అభివృద్ధి చెందాయా? వంటి అంశాలను పరిశీలించారు.
తెలుగు ఇమిగ్రెంట్స్ ఇన్ ది గల్ఫ్ Telugu Emigrants in the Gulf
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన త్రిలోక్ చందన్ గౌడ్, అజయ్ కుమార్ సాహూ అధ్యయనం చేశారు.
ఇది India’s Low-Skilled Migration to the Middle East: Policies, Politics and Challenges అనే పుస్తకంలో భాగంగా ఉంది.
ILO అధ్యయనాలు
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) కూడా ఇండియా -గల్ఫ్ మైగ్రేషన్‌పై ప్రత్యేక పరిశోధనలు చేసింది. From India to the Gulf Region: Exploring Links between Labour Markets, Skills and the Migration Cycle అనే నివేదికలో:
రిక్రూట్మెంట్ వ్యవస్థ, స్కిల్ మ్యాచింగ్, వేతనాలు, శిక్షణ, ఉద్యోగ డిమాండ్, వలస ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను విశ్లేషించారు. మరో ILO అధ్యయనం కువైట్ సౌదీ అరేబియా, యుఏఈలో భారతీయ కార్మికులకు సంబంధించిన కనీస వేతనాల వ్యవస్థను పరిశీలించింది.
NEWS AT A GLANCE
https://ideas.repec.org/h/spr/sprchp/978-981-13-9224-5_12.html?utm_source=chatgpt.com
https://ideas.repec.org/h/spr/sprchp/978-981-13-9224-5_12.html?utm_source=chatgpt.com
https://www.mea.gov.in/complaints-against-recruiting-agents.htm?utm_source=chatgpt.com
BY RAVIKANTI SRINIVAS
