జీన్ షార్ప్ పద్ధతులను సి జె పి అనుసరిస్తోందా?
అహింసే కానీ, యువతను రెచ్చగొట్టడమే లక్ష్యం
నీట్ పేపర్ లీక్ పై జరిగిన ఆందోళననుండి మొదలు పెట్టి ఇప్పటివరకు దేశ రాజధాని కేంద్రంగా జరిగిన అన్ని చెప్పిన ‘198 అహింసాత్మక చర్యల పద్ధతుల’తో పోలికలు ఉన్నాయి.
ఆందోళనలు గమనిస్తే ఒక విషయం అర్ధం అవుతుంది. ‘అధికారాన్ని’ సవాలు చేయడానికి అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త జీన్ షార్ప్ పేర్కొన్న ‘నిరసనలు, సహాయ నిరాకరణ, అడ్డంకులు సృష్టంచడం’ అనే 198 రకాల పద్ధతులకు వీటికి మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యూహాలతో వీటికి ఉన్న పోలికలు, ఆ పార్టీ అంతర్జాతీయ అరాచకత్వ సూత్రాలను (global playbook of anarchy) అనుసరిస్తోందా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
జూలై 2026లో జరిగిన NEET పేపర్ లీక్ నిరసనల ద్వారా, మీమ్‌లు, రీల్స్ ఆధారిత యాక్టివిజమ్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రజాదరణ పొందింది. యువతలో వివిధ అంశాలపై ఉన్న ఆగ్రహాన్ని ఈ సమస్యపై ఉపయోగించుకుంది. ఈ నిరసనల్లో నాట్యాలు, వేర్పాటువాద భావజాల సంబరాలు, అధికారులను అవమానించడం, ఎగతాళి చేయడం, పోలీసులపై దాడులు, పరుషంగా మాట్లాడటం, దేశ అగ్ర నాయకులను దూషించడం వంటివి చోటుచేసుకున్నాయి. అయితే, కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన CJP 2.0 నిరసన ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు వల్ల విఫలమైంది. ఇందుకు మెజారిటీ ప్రజలు దూరంగా ఉండటం కూడా ఒక కారణం.
CJP నిరసన వ్యూహం ఒక ముఖ్యమైన ప్రశ్నకు దారితీస్తోంది: ఇది యువత నుంచి స్వతంత్రంగా వచ్చిన ఆగ్రహమా లేక ఒక నిర్మాణాత్మక రాజకీయ అజెండానా? రాజకీయ ఉద్యమాలు వాటంతట అవి పుట్టుకురావు కనుక ఈ పోలికను పరిశీలించడం అవసరం. స్వతంత్రంగా కనిపించే వ్యూహాలు కూడా విస్తృత రాజకీయ సమీకరణలో భాగం కావచ్చు.
CJP నాయకులు అభిజీత్ దిప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్, యూట్యూబర్ ధృవ్ రాతీ, సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ, టిఎంసి నాయకురాలు మమతా బెనర్జీతో సహా దాదాపు 3,500 మంది నిరసనకారులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరాచకత్వానికి ఎలాంటి అవకాశం లేదని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌ను నిరసన వేదిక జాబితా నుండి తొలగించారు. అదుపులోకి తీసుకున్న CJP నాయకులు తిరిగి జంతర్ మంతర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా వారిని ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
రాజకీయం కొనసాగుతోంది. కానీ CJP పద్ధతులపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి: కావలనే వ్యూహంలో భాగంగా CJP జీన్ షార్ప్ విధానన్ని అనుసరిస్తోందా? వివాదాస్పద కార్యకర్త యోగేంద్ర యాదవ్ ప్రమేయం దీనికి నిదర్శనంగా నిలుస్తోందా?
జీన్ షార్ప్ ఎవరు, ఆయన పని ఇప్పుడు ఎందుకు వార్తల్లో?
జీన్ షార్ప్ (1928-2018) ఒక అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త. వ్యవస్థీకృత అహింసాత్మక చర్యల ద్వారా రాజకీయ ఉద్యమాలు ప్రభుత్వాలను ఎలా సవాలు చేయవచ్చో అధ్యయనం చేయడంలో ఆయన తన జీవితంలో ఎక్కువ భాగం గడిపారు. వ్యూహాత్మక అహింసాత్మక పోరాటంపై ‘పరిశోధన, అధ్యయనం’ కోసం 1983లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఇన్స్టిట్యూషన్ (AEI)ను స్థాపించారు. ఆయన రాసిన ప్రసిద్ధ గ్రంథం ‘ది పాలిటిక్స్ ఆఫ్ నాన్వయొలెంట్ యాక్షన్’ (1973)లో 198 రకాల ‘నిరోధక’ పద్ధతులను వర్గీకరించారు. షార్ప్ ఈ పద్ధతులను మూడు విస్తృత వర్గాలుగా విభజించారు:
- A. నిరసన, అంగీకరింప చేయడం (Protest and persuasion): నినాదాలు, చిహ్నాలు, బహిరంగ ప్రకటనలు, ర్యాలీలు, ప్రదర్శనలు, సమావేశాలు. వీటి ద్వారా అధికార వ్యవస్థపై వత్తిడి తెస్తారు.
- B. సహాయ నిరాకరణ (Non-cooperation): బహిష్కరణలు, సమ్మెలు, శాసనోల్లంఘన, రాజకీయ లేదా సామాజిక సంస్థల నుండి వ్యవస్థకు అందే సహకారాన్ని నిలిపివేయడం.
- C. అహింసాత్మక జోక్యం (Non-violent intervention): ధర్నాలు, ఆక్రమణలు, అడ్డంకులు సృష్టించడం, సాధారణ కార్యకలాపాలను నేరుగా అంతరాయం కలిగించే ఇతర చర్యలు.
రాజకీయ అధికారం అనేది పౌరులు, సంస్థల సహకారంపై ఆధారపడి ఉంటుందనేది జీన్ షార్ప్ ఆలోచన. ఒక ఉద్యమం ఆ సహకారాన్ని ఉపసంహరించుకున్నప్పుడు, అది అధికారంలో ఉన్నవారిపై ఒత్తిడి తెస్తుంది. నిరసనను కేవలం స్వతంత్ర ప్రతిస్పందనగా కాకుండా వ్యూహాత్మక చర్యగా చూడటంతో ఆయన పని ఉపయోగకరంగా మారింది. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఇన్స్టిట్యూషన్ తయారు చేసిన 198 పద్ధతుల జాబితా ఈ వ్యూహాలను అధ్యయనం చేయడానికి ప్రాథమిక ఆధారంగా ఉంది.
షార్ప్ నిరసనలను లేదా శాసనొల్లంఘనను కొత్తగా కనిపెట్టలేదు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంతో సహా వీటికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆయన కృషి వాటిని క్రమబద్ధంగా వర్గీకరించడంలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అరాచకవాదులు ఉపయోగించే ఒక సాధనంగా మారింది.
CJP నిరసన వ్యూహాలు, షార్ప్ పద్ధతులలో పోలికలు
ప్రభుత్వ సంస్థలు, జవాబుదారీతనంపై ఆరోపణలను లేవనెత్తడానికి ‘కాక్రోచ్’ అనే వ్యంగ్య గుర్తింపును ఉపయోగించి, యువత నేతృత్వంలో CJP జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత పొందింది. జంతర్ మంతర్ వద్ద మొదటి నిరసన విజయవంతమయ్యాక, అక్టోబర్ 2, 2026న ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ CJP ప్రచారాన్ని ప్రారంభించింది. నకిలీ, మరణించిన, అనర్హులైన ఎంట్రీలను తొలగించడమే తమ ఓటర్ ధృవీకరణ లక్ష్యమని ఎన్నికల సంఘం తెలిపింది.
పోలీసులపై దాడులు, అగ్ర నాయకత్వంపై అభ్యంతరకరమైన భాష వాడడం జరిగినప్పటికీ తాము శాంతియుత నిరసనలు నిర్వహించామని CJP పేర్కొంది. జీన్ షార్ప్ వ్యూహాలతో వీటిని పోల్చి చూద్దాం.
- నిరసన, అంగీకరింప చేయడం: ఒక చిహ్నాన్ని రాజకీయ గుర్తింపుగా మార్చడం
షార్ప్ మొదటి వర్గీకరణలో నినాదాలు, వ్యంగ్య చిత్రాలు, బానర్లు, హాస్య ప్రదర్శనలు, ప్రదర్శనలు, బహిరంగ సమావేశాలు ఉంటాయి. ఈ పద్ధతులు ఉద్యమకారులు తమ ఫిర్యాదులను తెలియజేయడానికి, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, భాగస్వామ్యులలో ఉమ్మడి గుర్తింపును పెంపొందించడానికి సహాయపడతాయి. CJP పేరు ప్రతి ప్రతిబింబించే ‘కాక్రోచ్’ వ్యంగ్యం ఒక గుర్తింపు పొందిన చిహ్నంగా మారింది.
ఇటీవలి CJP నిరసన సమయంలో, మీడియా దృష్టిని ఆకర్షించడానికి కొందరు వ్యక్తులు విచిత్రంగా దుస్తులు ధరించి వింతగా డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కొందరు ఆరోపించారు. అయితే, ఆ తర్వాత ఈ ఆరోపణలు నకిలీవని తేలింది. ఆ సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిని అరెస్టు చేశారు.
ఇలాంటి వ్యూహాలు సంక్లిష్టమైన రాజకీయ సమస్యను సులభంగా ప్రచారం చేసే సందేశంగా మారుస్తాయని షార్ప్ చెప్పారు.
- సహాయ నిరాకరణ: బహిరంగ ప్రదర్శనలకు స్థాయిని మించి ఒత్తిడి తేవడం
షార్ప్ రెండవ వర్గీకరణలో సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలతో సహకరించకపోవడం ఉంటుంది. ఇందులో బహిష్కరణలు, సమ్మెలు, కొన్ని రకాల శాసనోల్లంఘనలు ఉన్నాయి.
CJP ఉపయోగించిన పద్ధతులను, షార్ప్ మెథడ్ మరింత దగ్గరగా గమననించండి, మీకే అర్ధం అవుతుంది. షార్ప్ మెథడ్ 63 సామాజిక అనాదరణ; మెథడ్ 122 నిరోధాన్ని ప్రోత్సహించే సాహిత్యం, ప్రసంగాలు; మెథడ్ 141 చట్టాల శాసనోల్లంఘన; మెథడ్ 143 సమాచార వ్యవస్థలను నిరోధించడం. ఒక అధికారి రాజీనామాకు డిమాండ్ చేయడం మాత్రమే సహాయ నిరాకరణ కాదు. కచ్చితమైన సాక్ష్యాలు లేకుండా సోషల్ మీడియా విచారణ ద్వారా అధికారిని దోషిగా నిర్ణయించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంలోనే వ్యూహం ఇమిడి ఉంది.
- అహింసాత్మక జోక్యం: నిరసనల ద్వారా పనులకు ఆటంకం కలిగించడం
షార్ప్ మూడవ వర్గికరణలో నిరాహార దీక్షలు, ‘అహింసాత్మక అవరోధాలు’, ‘ఆక్రమణలు,’ పరిపాలనా వ్యవస్థలను స్తంభింపజేయడం వంటి పద్ధతులు ఉన్నాయి. ఆయన జాబితాలో నిరాహార దీక్షను మెథడ్ 159గా, అహింసాత్మక అవరోధాన్ని మెథడ్ 172గా, పరిపాలనా వ్యవస్థలను overload చేయడాన్ని మెథడ్ 193గా పేర్కొన్నారు.
ఒక ఉద్యమం కేవలం సమస్యలను తెలియజేయడానికి ప్రయత్నిస్తోందా లేదా సాధారణ వ్యవస్థల పనితీరుకు అంతరాయం కలిగించడం ద్వారా అధికార యంత్రాంగం నుండి బలవంతంగా ఏదో ఒక ప్రతిస్పందనను వచ్చేలా ప్రయత్నిస్తోందా అని పరిశీలించడానికి ఈ వర్గీకరణలు సహాయపడతాయి. ప్రజాస్వామ్యంలో ఈ వ్యత్యాసం ముఖ్యం.
ప్రభుత్వాలను కూల్చివేసిన ఉద్యమాలను షార్ప్ పద్ధతులు ప్రభావితం చేశాయా?
భారీ జన సమూహాన్ని కూడగట్టి వర్తమాన ప్రభుత్వాలను రాజకీయంగా సవాలు చేసిన అనేక సందర్భాలలో షార్ప్ వర్గీకరణలు తరచుగా చర్చికు వచ్చాయి.
సెర్బియాలో ‘ఓట్పోర్!’ (Otpor!) ఉద్యమం స్లోబోడాన్ మిలోసెవిచ్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారంలో ప్రముఖ పాత్ర పోషించింది. 2003లో జార్జియా ‘రోజ్ రివొల్యూషన్’, 2004లో ఉక్రెయిన్ ‘ఆరెంజ్ రివొల్యూషన్’ సుదీర్ఘ ప్రదర్శనలు. ఒక వ్యవస్థీకృత రాజకీయ విధానంపై జరిగిన ఆందోళనలన్నీ భారీగా జనాన్ని సమీకరించి సుదీర్ఘకాలం పాటు సాగించిన వ్యూహారచనలే.
సెర్బియా, ఉక్రెయిన్లపై జరిగిన పరిశోధనలు, భద్రతా దళాలను ప్రభావితం చేయడానికి నిరసన నిర్వాహకులు ఎలాంటి వ్యూహాలను ఉపయోగించారో రికార్డు చేశాయి. ఉదాహరణకు, ఉక్రెయిన్ ‘ఆరెంజ్ రివొల్యూషన్’లో, నిరసనకారులు ఉత్సాహభరితమైన వాతావరణాన్ని నిర్వహించడానికి ఐరనీ, వీధి నాటకాలు, సంగీత విభావరిలను ఉపయోగించారు. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటే శాంతియుత నిరసనకారులపై దాడి అని అంతర్జాతీయంగా విమర్శలు వస్తాయి; చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం బలహీనంగా కనిపిస్తుంది. ఇది జీన్ షార్ప్ ప్రతిపాదన ఆధారంగా రూపొందించిన ‘డైలమా యాక్షన్’ (Dilemma Action).
2011 ఈజిప్షియన్ తిరుగుబాటు 30 సంవత్సరాల పాలన తర్వాత అధ్యక్షుడు హోస్నీ ముబారక్ కూల్చివేతకు దారితీసింది. అయితే, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, నాయకుడిని తొలగించడం వల్ల శాశ్వత ప్రజాస్వామ్య పాలన ఏర్పడదని నిరూపించాయి.
ఈ ప్రపంచ ప్రతికూల ప్రభావం నుండి భారతీయ పరిశీలకులు పాఠం నేర్చుకోవాలి. ఇందులో రాజకీయ సమీకరణ, ప్రచారం చేసిన కథనాలు, లక్ష్యంగా చేసుకున్న సంస్థలు పరిణామాల క్రమబద్ధమైన అధ్యయనం ఉంటుంది.
ఇరాన్, వెనిజులా, రష్యాలో జాతీయ భద్రతా చర్చలు
2009 ఇరాన్ ఎన్నికల తదనంతర అశాంతి సమయంలో జీన్ షార్ప్ పేరును ప్రభుత్వం బహిరంగంగా ప్రస్తావించింది. నిరసనకారులు ‘వెల్వెట్ కూ’ (Velvet Coup)లో భాగంగా షార్ప్ ఫ్రేమ్‌వర్క్‌లోని 198 దశల్లో 100 కంటే ఎక్కువ అమలు చేశారని విచారణలో ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఇరాన్ హ్యూమన్ రైట్స్ డాక్యుమెంటేషన్ సెంటర్ కూడా తన నివేదికలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.
వెనిజులాలో, అధ్యక్షుడు హ్యూగో చావెజ్ వారాంతపు టెలివిజన్ ప్రసంగంలో ‘వెనిజులా జాతీయ భద్రతకు షార్ప్ ఒక ముప్పు’ అని హెచ్చరించారు. రష్యన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ అండ్ ప్రిడిక్షన్స్ 2015 నివేదిక ప్రకారం, “జీన్ షార్ప్ ప్రచురణలను [యునైటెడ్ స్టేట్స్] హైబ్రిడ్ వార్ ఫీల్డ్ మాన్యువల్‌లోని మొదటి భాగంగా చూడవచ్చు.”
భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశానికి ఒక విషయం స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. జీన్ షార్ప్ రాసిన పుస్తకం కేవలం ఒక అధ్యయన గ్రంధం కాదు. అంతకు మించి సి.జె.పి. దానిని వ్యూహం లోయ భాగంగా అమలు చేస్తున్నారు.
యోగేంద్ర యాదవ్ సంబంధం ఏమిటి?
CJPకి యోగేంద్ర యాదవ్ బహిరంగంగా తెలిపిన మద్దతు ఆయన పాత్రను ప్రాముఖ్యమైనదిగా చేస్తుంది. జూలై 2026లో CJP నిరసనకు సంబంధించి, యాదవ్ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో ప్రతిపక్ష రాజకీయం “సంసద్ నుండి జంతర్ మంతర్ వైపు, ఎన్నికల పోటీ నుండి క్షేత్రస్థాయి సమీకరణ వైపు” మారుతోందని రాశారు.
జీన్ షార్ప్, యోగేంద్ర యాదవ్ మధ్య ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ అనేకమంది పరిశీలకులు మరొక రకమైన సంబంధాన్ని వేలెత్తి చూపారు. జీన్ షార్ప్ ఫ్రేమ్‌వర్క్ సెర్బియాలోని ‘ఓట్పోర్!’ను ప్రభావితం చేసింది. ‘ఓట్పోర్!’ నుండి ఆవిర్భవించిన స్రజా పోపోవిక్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు ‘అహింసాత్మక చర్యల’లో శిక్షణ ఇచ్చే ‘కాన్వాస్’ (CANVAS) సంస్థను స్థాపించారు. మార్చి 2016లో, గోవాలో జరిగిన LSE ఇండియా సమ్మిట్‌లో స్రజా పోపోవిక్, యోగేంద్ర యాదవ్ మధ్య ప్రత్యక్ష సంభాషణ జరిగింది.
అంతకుముందు, 2012-13లో అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ నేతృత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం (IAC) సమయాల్లో కూడా పోపోవిక్ సంస్థ తయారు చేసిన ‘Nonviolent Struggle: 50 Crucial Points’ మాన్యువల్‌తో సమాంతర పోలికలను విశ్లేషకులు గుర్తించారు.
పరిశీలించాల్సిన అంశం
ఇటీవల CJP నేతృత్వంలో జరిగిన నిరసనలతో సహా వివిధ నిరసనల సమయాల్లో జీన్ షార్ప్ 198 పద్ధతులలో అవరసరమైన వాటిని సమయానుకూలంగా అమలు చేశారు. వ్యంగ్యం, బహిరంగ ప్రదర్శనలు, రాజకీయ డిమాండ్లను CJP ఉపయోగించడం షార్ప్ వర్గీకరణలతో పోలికను తెలియచేస్తుంది.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాను డిమాండ్ చేసే నిరసన ఉద్యమం సుస్పష్టమైన, పరిశీలించదగిన సాక్ష్యాలను చూపించగలగాలి. ప్రజాస్వామ్య నిరసన ఒక హక్కు, కానీ రాజ్యాంగబద్ధమైన సంస్థలపై చేసే తీవ్రమైన ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు ఉండాలి. కచ్చితమైన ఆధారాలతో వస్తే మాత్రమే ఆరోపణలకు విలువ ఉంటుందని ఆందోళనకారులకు చెప్పడం ద్వారా మాత్రమే విదేశీ వ్యూహం నుండి బయటపడగలుగుతాము.
News at a glance
https://thesouthfirst.com/opinion/withdrawing-consent-gene-sharp-and-the-cockroach-uprising/
Academic insights
https://www.aeinstein.org/198-methods-of-nonviolent-action
https://www.sciencedirect.com/science/article/abs/pii/S0967067X06000250
https://www.aeinstein.org/our-history
Social media pulse
- https://www.facebook.com/Smriti.Irani.Official/videos/what-we-saw-at-jantar-mantar-bore-an-uncanny-resemblance-to-gene-sharps-playbook/2437831826628243/
- https://www.youtube.com/watch?v=nfon-qlhFpc
- https://x.com/Kranthi766/status/2109218659503853795?s=20
- https://x.com/VivekPrtprssorg/status/2109203312633581869?s=20
- https://x.com/choga_don/status/2108770083594228127?s=20
- https://x.com/AugadhBhudeva/status/2087895809425813743?s=20
- https://x.com/Sarfarosh_IND/status/2087618797196976332?s=20
On our reading list
- AMBEDKAR’S LAST SPEECH IN THE CONSTITUENT ASSEMBLY ON ADOPTION OF THE CONSTITUTION (NOVEMBER 25, 1949) (Also known popularly as ‘Grammar of Anarchy’ speech)
- Parliamentary Democracy In India by Dr Lm Singhvi: Understanding India’s Democratic System, by Dr. L. M. Singhvi
