Andhra Pradesh https://dakshinam.org Sun, 18 Oct 2026 15:26:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.1.3 ప్రశాంత్ భూషణ్ అంతిమ లక్ష్యం అరాచకం ద్వారా అధికార మార్పేనా? https://dakshinam.org/2026/10/18/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b6%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%ad%e0%b1%82%e0%b0%b7%e0%b0%a3%e0%b1%8d-%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf%e0%b0%ae-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d/ https://dakshinam.org/2026/10/18/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b6%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%ad%e0%b1%82%e0%b0%b7%e0%b0%a3%e0%b1%8d-%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf%e0%b0%ae-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d/#respond Sun, 18 Oct 2026 15:26:10 +0000 https://dakshinam.org/?p=2064 ప్రశాంత్ భూషణ్ ప్రముఖ లాయర్. అయితే ఆయన వ్యవహారశైలిని గమనిస్తే అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.

రాజ్యాంగ పరమైన అంశాలపై ఆయన వాదనలు, ఆయన ఉద్యమాల వెనుక ఉన్న రాజకీయ నెట్‌వర్క్‌లు, ఎన్నికలకు సంబధించి తలెత్తే చిన్నచిన్న నిరసనలను ప్రభుత్వంపై పూర్తిస్థాయి ఘర్షణగా మార్చడంలో ఆయన నైపుణ్యం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.

 Introductory memo

ప్రశాంత్ భూషణ్ రాజకీయ ప్రయాణం అవినీతి వ్యతిరేక ఉద్యమాల నుండి ఆమ్ ఆద్మీ పార్టీతో తీవ్రమైన విభేదాలతో సాగి, చివరికి ప్రభుత్వ నిర్ణయాలను నిరంతరం సవాలు చేసే స్థితి వరకు చేరుకుంది. CJP, ఇతర కార్యకర్తలతో కలిసి ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఈ విభిన్న అంశాలన్నింటినీ ఒకే చోటికి చేర్చాయి. ఆయన బహిరంగ ప్రకటనలు, రాజకీయ సంబంధాలు, ఎన్నికల వ్యవస్థల పట్ల ఆయన వైఖరిని పరిశీలించడం ద్వారా ప్రజాస్వామ్య నిరసన, ఘర్షణాత్మక యాక్టివిసం, రాజకీయ మార్పు కోసం చేసే ప్రయత్నాలు జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి మధ్య ఉన్న సంబధం అర్ధం అవుతుంది.

Analysis/ analytical view

ప్రశాంత్ భూషణ్  న్యూఢిల్లీలో అక్టోబర్ 15, 2026న జరిగిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ భూషణ్  స్పష్టమైన రాజకీయ ప్రకటన చేశారు. CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే, నటుడు ప్రకాష్ రాజ్, విద్యార్థి నాయకులు, ఇతర ప్రముఖులతో కలిసి ఆయన మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) లో అక్రమాలు జరిగాయంటూ సాగుతున్న నిరసన “నిజంగా ప్రభుత్వ మార్పు (regime change) కోసం జరుగుతున్న పోరాటం” అని ఆయన వ్యాఖ్యానించారు. “అవును, మేమందరం ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నాం… అందులో తప్పేముంది?” అని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని మార్చాలని కోరడం ఒక ప్రజాస్వామ్య హక్కని, రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచడం నేరం కాదని భూషణ్ వాదించారు. వాస్తవానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను లక్ష్యంగా చేసుకుని ఉద్యమం సాగుతోంది. కానీ ఆయన ప్రకటన ఒక ప్రధానమైన ప్రశ్నను లేవనెత్తింది-  ఈ నిరసన ఎన్నికలకు సంబధించిన ఫిర్యాదులను పరిష్కరించాలని కోరుతోందా లేక అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని దించడం మాత్రమే దీని ఏకైక రాజకీయ లక్ష్యంగా మారిందా? అని

ఇక్కడ ఒక ముఖ్యమైన రాజ్యాంగపరమైన వ్యత్యాసం ఉంది. ప్రభుత్వాన్ని మార్చాలని ప్రచారం చేసే, ఎన్నికల సంఘాన్ని విమర్శించే, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసే పూర్తి హక్కు ప్రజలకు, ప్రతిపక్షాలకు ఉంది. శాంతియుత నిరసన అనేది చట్టబద్ధమైన ప్రజాస్వామ్య సాధనం. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామని చెప్పుకునే ఉద్యమం ఎన్నికల తీర్పులను, వ్యవస్థాగత ప్రక్రియలను, విభిన్న రాజకీయ అభిప్రాయాలు ఉన్న పౌరుల హక్కులను కూడా గౌరవించాలి.

ప్రశాంత్ భూషణ్‌  చేసిన ప్రకటన అక్రమ కుట్ర కాదు.  అలాగే ప్రభుత్వ మార్పును డిమాండ్ చేయడం వల్ల అరాచకం ఏర్పడుతుందని అర్థం కాదు. కానీ ఈ ప్రకటన వెనుక ఉన్న రాజకీయ వ్యూహమే ఆందోళన కలిగిస్తోంది – సుదీర్ఘ వీధి నిరసనలు, వ్యవస్థల ప్రామాణికతను దెబ్బతీయడం, రాజకీయ వైరుధ్యాలను పక్కనబెట్టి కూటములు కట్టడం ద్వారా ఎన్నికల ప్రక్రియకు ప్రత్యామ్నాయంగా ఘర్షణను వాడుతున్నారా అనేదే అసలు సందేహం.

అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడి నుండి ప్రతిపక్ష ప్రచారకుడిగా ప్రశాంత్ భూషణ్ ప్రయాణం

ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు (PIL) లేదా రాజకీయ యాక్టివిజంకు ప్రశాంత భూషణ్  క్రొత్తేమీ కాదు. అవినీతి, పాలన, న్యాయ వ్యవస్థ జవాబుదారీతనం, పౌర హక్కులపై చేసిన చట్టపోరాటాల ద్వారా ఆయన గుర్తింపు పొందారు. అన్నా హజారే నాయకత్వంలో జరిగిన ‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమంలో ఆయన ఒక ప్రముఖ వ్యక్తిగా మారారు. ఈ ఉద్యమం అవినీతిపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ఒక్కటిగా చేసి  ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆవిర్భావానికి అనుకూల  రాజకీయ వాతావరణాన్ని సృష్టించింది.

ఆ తర్వాత ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా మారి, దాని అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అయితే పార్టీ నాయకత్వం, పనితీరు, రాజకీయ వైఖరి పై ఏర్పడిన తీవ్ర విభేదాల కారణంగా అరవింద్ కేజ్రీవాల్‌తో ఆయన సంబంధం దెబ్బతింది. 2015లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను పార్టీ నుండి బహిష్కరించారు. ఆ తర్వాత వారు స్వరాజ్ అభియాన్ అనే సంస్థను స్థాపించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రీకృతంగా మారిందని, పారదర్శకత లోపించిందని కేజ్రీవాల్ నాయకత్వాన్ని ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ఈ సంఘటన ఆయన రాజకీయ జీవితంలో పదే పదే కనిపిస్తున్న ఒక అంశాన్ని స్పష్టం చేస్తుంది: తాను స్వయంగా ఏర్పాటుచేసిన సంస్థలతో సహా అన్నింటిలో రాజకీయ అధికారాన్ని నిరంతరం సవాలు చేసే ఉద్యమకారుడిగా ఆయన మిగిలిపోయారు. నిష్పాక్షికతకు, శక్తివంతమైన నాయకులను సవాలు చేసే ఆయన తెగువకు నిదర్శనంగా దీనిని చూడవచ్చు. అదే సమయంలో, ఆయన ఉద్యమాల రాజకీయ గమ్యం ఏమిటనే ప్రశ్నలను కూడా ఇది లేవనెత్తుతోంది. అవినీతి, ఎన్నికల విధానాలు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలు ‘ప్రభుత్వ మార్పు’ అనే ఒకే డిమాండ్ వద్ద ఏకమైనప్పుడు వాటి లక్ష్యాలు, పద్ధతులు, జవాబుదారీతనంపై ప్రజలకు స్పష్టత కావాలి.

న్యాయవాదిగా ప్రశాంత్ భూషణ్ కు ఉన్న సీనియారిటీ ఆయన బహిరంగ ప్రకటనలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుంది. అయితే ఆయన న్యాయవాది అయినంత మాత్రాన ఆయన చేసే రాజకీయ వాదనలు విమర్శలకు అతీతం కాదు.  ఆయన మద్దతు ఇచ్చే ప్రతి ఉద్యమం లేదా కూటమి తప్పనిసరిగా రాజ్యాంగ స్థిరత్వానికే తోడ్పడుతుందని చెప్పలేం.

కాశ్మీర్ రాజకీయ వ్యాఖ్యల పరిమితులు

కాశ్మీర్‌పై ప్రశాంత్ భూషణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. 2011లో ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమ సమయంలో, జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ (plebiscite) ప్రతిపాదనకు ఆయన మద్దతు తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి, సైన్యాన్ని ఉపసంహరించి, AFSPA ను రద్దు చేస్తే ఈ అభిప్రాయ సేకరణను పరిశీలించవచ్చని ఆయన సూచించారు. అది తన వ్యక్తిగత అభిప్రాయమని అంటూ ఈ అంశంపై జవహర్‌లాల్ నెహ్రూ గతంలో చేసిన చారిత్రక ప్రకటనలను ఉటంకిస్తూ ఆయన తన వాదనలను సమర్థించుకున్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర నిరసనకు దారితీశాయి. జాతీయవాద సంస్థల నుండి విమర్శలు రావడమే కాకుండా కార్యకర్తలు ఆయనపై భౌతిక దాడి కూడా చేశారు.

తరువాత AAP తో ఉన్న సమయంలో ప్రశాంత్ భూషణ్ దానిపై స్పష్టత ఇస్తూ ప్రజాభిప్రాయ సేకరణపై తన వ్యాఖ్యలను దేశంలో దాని విలీనాన్ని ప్రశ్నించడంగా భావించకూడదని కాశ్మీర్ భారతదేశంలోర్భాగమని పేర్కొన్నారు.

ఈ సంఘటన కాశ్మీర్‌పై భేదాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన ద్రోహంగా ముద్ర వేయడానికి ప్రామాణికం కాకపోవచ్చు, కానీ సున్నితమైన రాజ్యాంగ, ప్రాంతీయ అంశాలపై వ్యాఖ్యలు చేసినప్పుడు ఎదురయ్యే తీవ్ర పర్యవసానాలను ఇది స్పష్టం చేస్తుంది. నిరసన తెలిపే హక్కును ఉపయోగించుకునే ప్రముఖులు తమ వాదనలు, వాటి పరిణామాలు, నిర్దిష్టతపై వచ్చే విమర్శలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలి.

ఇదే ప్రామాణికత ప్రశాంత్  భూషణ్ ప్రస్తుత ఉద్యమానికి కూడా వర్తిస్తుంది. తమ పోరాటం ప్రభుత్వ మార్పు కోసమేనని ఆయన చేసిన ప్రకటనను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం తప్పని కాదు, కానీ అటువంటి ప్రచారాల పద్ధతులు, వ్యవస్థలపై ఉండే దాని ప్రభావం చాలా ముఖ్యమైనవి.

సంభావనా, యోగేంద్ర యాదవ్, యాక్టివిస్ట్ నెట్‌వర్క్‌ల కొనసాగింపు

హిమాచల్ ప్రదేశ్‌లో తన తల్లిదండ్రుల పేరు మీద ఉన్న కుముద్ భూషణ్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ప్రశాంత్ భూషణ్ ‘సంభావన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ పాలిటిక్స్’ను స్థాపించారు. ఈ సంస్థ ప్రజా విధానం, ఎన్నికల ప్రజాస్వామ్యం, పర్యావరణం, సంబంధిత అంశాలపై శిక్షణలు, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది. మరో ప్రముఖుడు యోగేంద్ర యాదవ్ కు ఈ సంస్థ పాలక మండలి, విద్యా కార్యకలాపాలతో సంబంధం ఉంది. ఈయన ప్రశాంత్ భూషణ్ మాజీ సహచరుడు, కేజ్రీవాల్ నాయకత్వాన్ని విమర్శించిన వారిలో ఒకరు. వీరిద్దరూ ప్రభుత్వ నిర్ణయాలు, ఎన్నికల వ్యవస్థలను సవాలు చేసే పౌర సమాజ ఉద్యమాలలో భాగస్వాములయ్యారు.

వీరి భాగస్వామ్యం 2010ల ప్రారంభంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమం, తదనంతర ప్రతిపక్ష రాజకీయాలు, ఎన్నికల సంఘంపై ప్రస్తుత నిరసనల మధ్య ఒక లింక్ ను చూపెడతాయి. వారి కార్యకలాపాలు చట్టవిరుద్ధమని కాదు. అయితే, వ్యక్తులు, సంస్థలు, యాక్టివిస్ట్ నెట్‌వర్క్‌లు విభిన్న కాలాల్లో వేర్వేరు కారణాలతో రాజకీయ ప్రచారాలను ఎలా కొనసాగించగలవో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే – ఎన్నికల వ్యవస్థలపై చేసే విమర్శలను నిరూపించే ఆధారాలు ఉన్నాయా, డిమాండ్లను వ్యవస్థాగతంగా పరిష్కారించుకోవడానికి వారు కట్టుబడి ఉన్నారా లేదా అనేది తెలియాలి. నిర్దిష్టమైన తప్పులను నిరూపించకుండా ఎన్నికల ప్రామాణికతను పదే పదే ప్రశ్నించడం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు ఉన్న విశ్వాసం బలహీనపడే ప్రమాదం ఉంది.

జంగ్‌పురా సమావేశం, వాస్తవాలు ఏమిటి

ప్రశాంత్ భూషణ్ యాక్టివిస్ట్ నెట్‌వర్క్‌కు సంబంధించిన చర్చల్లో ఢిల్లీలోని జంగ్‌పురాలోని ఒక బేస్‌మెంట్ ప్రాంగణంలో డిసెంబర్ 8, 2019న జరిగిన సమావేశం ప్రస్తావనకు వచ్చింది. ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులోని ఆరోపణలను ప్రస్తావిస్తూ కోర్టు రికార్డులు 6/6 జంగ్‌పురా ఎక్స్‌టెన్షన్‌లో యోగేంద్ర యాదవ్, ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, ఇతర వ్యక్తులు పాల్గొన్న ఒక సమావేశాన్ని ప్రస్తావించాయి. పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా నిరసనల సందర్భంలో చక్కా జామ్ (రహదారుల దిగ్బంధనం) ప్రణాళికలు ఈ చర్చలలో ఉన్నాయని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

సుప్రీంకోర్టుకు ప్రశాంత్ భూషణ్ సమర్పించిన పత్రాలలో తన కార్యాలయంగా పేర్కొన్న చిరునామాతో ఈ అడ్రసు సరిపోలింది. విస్తృత నిరసన నెట్‌వర్క్‌లోని వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలపై ఈ అంశం అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

అయితే, ఒక చిరునామాకు, ఒక సమావేశం ఉద్దేశ్యానికి, ఒక వ్యక్తి వ్యక్తిగత భాగస్వామ్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడం చాలా అవసరం. ఈ ఆరోపణలు మాత్రమే భూషణ్ ఆ సమావేశానికి హాజరయ్యారని, ఆ కుట్ర గురించి ఆయనకు తెలుసని లేదా ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నారని నిరూపించలేవు. స్వతంత్ర ఆధారాలు లేకుండా ఆ ఆరోపణలను వాస్తవాలుగా చెప్పలేం.

ఢిల్లీ అల్లర్ల కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని సుదీర్ఘకాలం నిర్బంధించడాన్ని ప్రశాంత్ భూషణ్ విమర్శించారు.  వారిపై మోపిన కేసులు సక్రమమైన న్యాయ ప్రక్రియపై తీవ్ర సందేహాలను లేవనెత్తుతున్నాయని వాదించారు. అటువంటి న్యాయపోరాటం నేరంలో భాగస్వామ్యానికి లేదా హింసను సమర్థించడానికి నిదర్శనం కాదు. ఇక్కడ ఉద్భవించే నిష్పాక్షికమైన ప్రశ్న ఏమిటంటే: ఈ కేసులపై జరుగుతున్న బహిరంగ చర్చల్లో రాజకీయ కథనాల కంటే ఆధారాలు, న్యాయపరమైన ప్రక్రియలకే ప్రాధాన్యత లభిస్తుందా లేదా అనేది.

CJP మరియు బహుళ-పార్టీ సమీకరణ రాజకీయాలు

CJP తో కలిసి భూషణ్ ప్రత్యక్షమవ్వడం ఆయన ప్రస్తుత రాజకీయ వ్యూహాన్ని మరింత స్పష్టంగా చూపుతోంది. CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉన్నారు. ఆ సంస్థలోని ఇతర వ్యక్తులకు AAP యువజన విభాగంతో సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ గ్రూప్ రాజకీయ సంబంధాల నివేదికలలో AAP మాజీ కమ్యూనికేషన్స్ వ్యూహకర్త విజయ్ నాయర్ పేరు కూడా వినబడింది.

CJP లక్ష్యాలు ‘INDIA’ ప్రతిపక్ష కూటమి లక్ష్యాలతో ఏకీభవిస్తున్నాయని దిప్కే అంగీకరించారు. ఈ సంస్థ రాజకీయ నిష్పాక్షికతపై ప్రశ్నలు ఉన్నప్పటికీ, నిరసనల మధ్య కాంగ్రెస్ నాయకులు కూడా వారితో కలిసి పనిచేస్తున్నారు.

ఈ సంబంధాలు CJP ఏదో ఒక రాజకీయ పార్టీ నియంత్రణలో ఉందని చెప్పవు. అయినప్పటికీ, ఇది ఒక స్వతంత్ర యువజన ఉద్యమం అనే ప్రతిపాదనను సంక్లిష్టం చేస్తుంది. ఒక కొత్త సంస్థ తన సిబ్బందిని, లక్ష్యాలను, ప్రచార వేదికలను రాజకీయ శక్తులతో పంచుకున్నప్పుడు, దాని నిధులు, నాయకత్వం, నిర్ణయాధికారాలను పారదర్శకంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

దీనికి తోడు అంతర్జాతీయ అంశాలు వివాదాన్ని మరింత పెంచాయి. ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకించే యుఎస్ దాతలు దిప్కే, CJP కి వెన్నుదన్నుగా ఉన్నారని అమెరికా గాయని మేరీ మిల్‌బెన్ బహిరంగంగా ఆరోపించారు. దిప్కే ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ప్రశ్నించారు. కాబట్టి ఈ ఆధారాలు సరైన రికార్డుల ద్వారా నిరూపించబడే వరకు, వీటిని కేవలం ఆరోపణలుగానే చూడాలి తప్ప నిరూపితమైన నిజాలుగా పరిగణించకూడదు.

భారతదేశంలో యువకులు ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, దానికి మద్దతు ఇస్తున్నానని బంగ్లాదేశ్ కు చెందిన నాహిద్ ఇస్లాం ప్రకటించారు. ఆయనకు  బంగ్లాదేశ్ లో ఇటీవలి రాజకీయ పరిణామాలతో సంబంధం ఉంది. భారతీయ విద్యార్థి నాయకులు కూడా బంగ్లాదేశ్ యువజన ఉద్యమాన్ని ప్రేరణగా పేర్కొన్నారు. ఇటువంటి మద్దతు ప్రకటనలు విదేశీ నిర్దేశకత్వానికి లేదా సమన్వయానికి ఆధారాలు కావు. అయితే, స్వదేశీ నిరసనలు అంతర్జాతీయ రాజకీయ దృష్టిని ఎలా ఆకర్షిస్తాయో, ప్రభుత్వ మార్పు గురించిన విస్తృత కథనంలో ఎలా భాగమవుతాయో ఇవి స్పష్టం చేస్తాయి.

ఇక్కడ తలెత్తే ప్రశ్నలు స్పష్టమైనవే: ఈ సంస్థలకు నిధులు ఎవరు ఇస్తున్నారు? చట్ట ప్రకారం విరాళాలను వెల్లడిస్తున్నారా? వారి రాజకీయ ప్రాధాన్యతలను ఎవరు నిర్ణయిస్తారు? విదేశీ జోక్యానికి సంబంధించిన ఆరోపణలు కేవలం భావజాల అనుమానాల ఆధారంగా ఉన్నాయా లేక నిజంగా ఆధారాలు ఉన్నాయా?

విదేశీ నిధులు, ఎన్నికల పరిశీలన, పోటీ ప్రమాణాలు

ఎన్నికల పారదర్శకత, అభ్యర్థుల వివరాల వెల్లడి మరియు రాజకీయ నిధులకు సంబంధించిన న్యాయ సవాళ్లలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ADR) ప్రముఖ పాత్ర పోషించింది. విస్తృత ఎన్నికల-జవాబుదారీ రంగానికి చెందిన సంస్థలకు విరాళాలు ఇచ్చిన వారిలో ఫోర్డ్ ఫౌండేషన్, ఒమిడ్యార్ నెట్‌వర్క్, ఇతర దేశీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఉన్నట్లు పబ్లిక్ నివేదికలు పేర్కొంటున్నాయి. డచ్ అభివృద్ధి సంస్థ అయిన Hivos కూడా ప్రభుత్వ,  అంతర్జాతీయ నిధుల ఆధారాల నుండి మద్దతు పొందింది.

ఈ నిధుల సంబంధాలపై సంబంధిత సంస్థలు, నివేదిక కాలాలు, గ్రాంట్లు, చట్టపరమైన వివరాల ఆధారంగా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒక సంస్థ పొందిన నిధులను మరొక సంస్థకు ముడిపెట్టలేము, అలాగే ఎన్నికల పరిశోధన లేదా పారదర్శకత పని కోసం వచ్చిన గ్రాంట్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అజెండా అని చెప్పజాలం.

ADR తన పనిని నిష్పాక్షికమైనదిగా వర్ణించుకుంటుంది. విదేశీ నిధులతో పనిచేసే పౌర సమాజ సంస్థలు దేశంలోని  రాజకీయ చర్చలను తమ ప్రాధాన్యతలు పెంచడం ద్వారా, వ్యవస్థలను సవాలు చేయడం ద్వారా ప్రభావితం చేస్తాయనే వాదం కూడా ఉంది. దీనికి సరైన పరిష్కారం నిధులు, కార్యకలాపాలను పారదర్శకంగా పరిశీలించడమే తప్ప, ప్రతి విదేశీ గ్రాంట్‌ను కుట్రగా భావించడం కాదు.

కేజ్రీవాల్‌తో సంబంధం ఉన్న సంస్థలు, CJP, ఇతర యాక్టివిస్ట్ నెట్‌వర్క్‌లపై వచ్చే ఆరోపణలకు కూడా ఇదే ప్రామాణికం వర్తించాలి. నమోదిత గ్రాంట్లు, సంస్థాగత సంబంధాలు, బహిరంగ ప్రకటనలు విచారణకు చట్టబద్ధమైన అంశాలు. అయితే, ఒక సమన్వయంతో,  విదేశీ మద్దతుతో ప్రభుత్వ మార్పునకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలకు స్పష్టమైన సాక్ష్యాధారాలు అవసరం.

దేశంలో రాజకీయ స్థిరత్వం కూడా చాలా ముఖ్యమైనదే. ఎన్నికల అక్రమాల ఆరోపణలను ఆధారాల ప్రాతిపదికన మాత్రమే అంచనా వేయాలి. ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందనే దాని ఆధారంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఓటర్ల జాబితాలు, ఎన్నికల సంఘంపై వచ్చే ప్రశ్నలను తేల్చలేము. అలాగే విమర్శకుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడనే కారణంతో మాత్రమే విమర్శలను తోసిపుచ్చలేము.

అసలైన పరీక్ష పద్ధతి మాత్రమే, నినాదం కాదు

ప్రశాంత్ భూషణ్ కెరీర్ భారతదేశంలో లీగల్ యాక్టివిజం, పౌర సమాజ సమీకరణ, ప్రతిపక్ష రాజకీయాల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన చేసిన చట్టపోరాటాలు అన్ని పార్టీల ప్రభుత్వాలను, రాజకీయ నాయకులను సవాలు చేశాయి. ఆయన మద్దతుదారులు ఆయనను రాజ్యాంగ హక్కుల రక్షకుడిగా చూస్తే; ఆయన విమర్శకులు ఆయన ప్రచారాలు తరచుగా అధికారంలో ఉన్న ప్రభుత్వ, రాజకీయ ప్రత్యర్థుల లక్ష్యాలతో ఏకీభవిస్తాయని భావిస్తారు.

ఈ రెండు అభిప్రాయాల్లో దేనినీ ఆధారాలను పరిశీలించకుండా స్వీకరించకూడదు.

ఆయన తాజా ప్రకటన ప్రాముఖ్యత కలిగినది. ఎందుకంటే ఇది నిర్దిష్ట ఎన్నికల పారదర్శకత డిమాండ్‌ను దాటి ‘ప్రభుత్వ మార్పు’ అనే స్పష్టమైన రాజకీయ లక్ష్యం వైపు సాగింది. ఎన్నికలు, చట్టబద్ధమైన ప్రచారాలు, శాంతియుత ప్రజాస్వామ్య నిరసనల ద్వారా ఆ లక్ష్యాన్ని అనుసరించినప్పుడు అది చట్టబద్ధమైనదే. కానీ ఆధారాల స్థానంలో ఆరోపణలు చేరినప్పుడు, వ్యవస్థాగత విమర్శలు వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా మారినప్పుడు, లేదా ఎన్నికల తీర్పునకు ప్రత్యామ్నాయంగా వీధి నిరసనలను చూపినప్పుడు అది ఆందోళనకరంగా మారుతుంది.

ప్రజాస్వామ్య ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో సహా నిరసన తెలిపే హక్కును భారతదేశ రాజ్యాంగం రక్షిస్తుంది. అలాగే ఎన్నికల ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకునే పౌరుల హక్కును కూడా అది రక్షిస్తుంది. రాజ్యాంగ స్వేచ్ఛలను ప్రస్తావించే ఒక సీనియర్ అడ్వకేట్, ఇతరుల నుండి తాను ఆశించే స్థిరత్వం, పారదర్శకత, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల గౌరవం అనే ప్రమాణాలకే తాను కూడా జవాబుదారీగా ఉండాలి.

ఇక్కడ అసలైన ప్రశ్న ప్రశాంత్ భూషణ్‌కు ప్రభుత్వ మార్పును కోరే హక్కు ఉందా లేదా అనేది కాదు. ఖచ్చితంగా ఆయనకు ఆ హక్కు ఉంది. అసలు ప్రశ్న ఏమిటంటే—ఆయన ఇప్పుడు మద్దతు ఇస్తున్న ఉద్యమం తన ఆరోపణలను రుజువు చేయగలదా, తన రాజకీయ, ఆర్థిక సంబంధాలను వెల్లడించగలదా, తాను రక్షిస్తున్నానని చెప్పుకునే ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీయకుండా తన లక్ష్యాలను సాధించగలదా లేదా అనేది మాత్రమే.

News at a glance

Prashant Bhushan “Regime Change” Remarks & CJP/SIR Protests

https://indianexpress.com/article/india/we-want-regime-change-says-prashant-bhushan-bjp-hits-back-out-to-stage-a-coup-10923771/

https://www.tribuneindia.com/news/delhi/cjps-anti-sir-protest-takes-political-turn-as-prashant-bhushan-calls-it-fight-for-regime-change/

https://thefederal.com/category/news/prashant-bhushan-regime-change-259702

https://www.moneycontrol.com/news/india/we-all-want-a-regime-change-prashant-bhushan-calls-it-citizens-constitutional-right-questions-allegations-of-conspiracy-14053090.html

https://www.opindia.com/news-updates/we-all-want-regime-change-prashant-bhushan-says-anti-sir-protests-are-about-removing-the-government/

Mary Millben Allegations of US Funding for CJP/Abhijeet Dipke

https://m.economictimes.com/magazines/panache/who-is-mary-millben-american-singer-spars-with-abhijeet-dipke-alleges-cjp-is-funded-by-us-donors/articleshow/134986138.cms

https://www.tribuneindia.com/news/india/dipke-cjp-being-funded-by-anti-modi-us-donors-american-singer/

https://www.moneycontrol.com/news/india/don-t-need-outsiders-to-interfere-abhijeet-dipke-hits-back-at-us-singer-for-saying-cjp-is-getting-foreign-funding-14052437.html

Nahid Islam / Bangladesh Support for CJP

https://timesofindia.indiatimes.com/world/south-asia/bangladesh-party-backs-cjp-stir-ex-yunus-aide-seeks-modis-fall/articleshow/134879664.cms

https://www.opindia.com/news-updates/bangladeshi-student-leader-nahid-islam-who-led-violent-protests-against-sheikh-hasina-supports-illegal-cjp-protests/

https://www.indiatvnews.com/news/india/kejriwal-admits-his-ngo-took-money-from-ford-foundation-2-years-back-10340.html (historical admission on Ford Foundation funding)

ADR Funding (Ford Foundation, Omidyar, etc.)

https://www.opindia.com/2025/02/adr-which-continues-to-target-modi-govt-is-funded-by-deep-state-entities-like-ford-foundation-and-omidyar-network/

https://www.fordfoundation.org/work/our-grants/awarded-grants/grants-database/association-for-democratic-reforms-adr-122669/ (official Ford grant page)

Bhushan Kashmir remarks (2011)

https://www.indiatoday.in/india/north/story/prashant-bhushan-interview-143239-2011-10-12

https://timesofindia.indiatimes.com/india/prashant-bhushan-attacked-for-kashmir-remark/articleshow/10333933.cms

https://web.archive.org/web/20111021164834/http:/indiatoday.intoday.in/video/what-prashant-bhushan-said-on-kashmir/1/154685.html

Sambhaavnaa Institute / Yogendra Yadav collaborations (recent protest detentions)

https://indianexpress.com/article/cities/delhi/sir-protest-jantar-mantar-60-detained-neha-bora-yogendra-yadav-10894247/

https://www.tribuneindia.com/news/india/3-firs-filed-yogendra-yadav-kapil-sibal-prashant-bhushan-among-150-detained-on-way-to-jantar-mantar/

2019 meeting links (Umar Khalid / Sharjeel Imam)

https://www.opindia.com/2023/12/delhi-anti-hindu-riot-prashant-bhushan-hosted-earliest-conspiracy-meeting-with-umar-khalid-sharjeel-imam-and-yogendra-yadav/

Academic insights

https://swarajyamag.com/magazine/imported-ideology-activism-for-export
(“Imported Ideology, Activism For Export” – Madhu Purnima Kishwar, Swarajya, 2015)

https://manushi.in/how-foreign-funded-ngos-circumvent-fcra-to-subvert-india/
(“How Foreign Funded NGOs Circumvent FCRA to Subvert India” – Manushi)

https://www.vayuveg.com//Encyc/2025/10/11/prashant-bhushan-sambhaavnaa-institute-anti-india-activities.php

Social Media pulse

Prashant Bhushan on regime change https://x.com/Dev_Fadnavis/status/2110974085903929369?s=20

https://x.com/PiyushGoyal/status/2111060341363036399?s=20

https://x.com/sankrant/status/2110780891316506965?s=20

https://x.com/JethmalaniM/status/2110946889504067889?s=20

https://x.com/JaipurDialogues/status/2111108289262195069?s=20

https://x.com/BJP4India/status/2111062967907455091?s=20

https://x.com/angeloinchina/status/2110929237830230350?s=20

https://x.com/BJP4India/status/2111081146306146804?s=20

https://x.com/MrParleG/status/2110691954929639901?s=20

https://x.com/Tejasvi_Surya/status/2111124468907303344?s=20

https://x.com/PratyushKanth/status/2110746407229407581?s=20

https://x.com/BesuraTaansane/status/2111121276802826286?s=20

https://x.com/MajorPoonia/status/2109562102503608745?s=20

https://x.com/arvind_Navy/status/2111124831798468881?s=20

https://x.com/ModifiedAayush/status/2110979080539750853?s=20

https://www.facebook.com/reel/1794260668772289

https://x.com/pratheesh_Hind/status/2111082248405754041

https://x.com/sgurumurthy/status/2111132280572047492?s=20

https://www.youtube.com/watch?v=ksz-5XsCHI8
(“Critical Look at Foreign Funded / Foreign Backed NGOs in India” – Sangam Talks)

https://www.youtube.com/watch?v=smuqVcfg31Q
(“भारत में विदेशी वित्तपोषित (foreign funded) NGOs पर एक आलोचनात्मक दृष्टिपात” – Madhu Purnima Kishwar)

https://www.youtube.com/watch?v=tyJSYlKH0jI
(“How the Foreign Funded NGOs are destroying the Social Fabric of India?” – Madhu Kishwar)

https://www.youtube.com/watch?v=wAiYXIaorXI
(Madhu Kishwar speaks at the Conference on Foreign Funded NGOs, 2015)

 

📚

On Our Reading List

1. Breaking India: Western Interventions in Dravidian and Dalit Faultlines

Authors: Rajiv Malhotra & Aravindan Neelakandan
https://www.amazon.in/Breaking-India-Western-Interventions-Faultlines/dp/8191067374

https://rajivmalhotra.com/product/breaking-india/

2. Snakes in the Ganga: Breaking India 2.0

Authors: Rajiv Malhotra & Vijaya Viswanathan

https://www.amazon.in/Snakes-Ganga-Breaking-India-2-0/dp/939220908X

  1. NGOs, Activists & Foreign Funds Anti-Nation Industry, edited by Radha Rajan and Krishen Kak

 

]]>
https://dakshinam.org/2026/10/18/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b6%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%ad%e0%b1%82%e0%b0%b7%e0%b0%a3%e0%b1%8d-%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf%e0%b0%ae-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d/feed/ 0 2064
మసకబారుతున్న సమాచార హక్కు చట్టం https://dakshinam.org/2026/10/14/%e0%b0%ae%e0%b0%b8%e0%b0%95%e0%b0%ac%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0-%e0%b0%b9%e0%b0%95%e0%b1%8d%e0%b0%95/ https://dakshinam.org/2026/10/14/%e0%b0%ae%e0%b0%b8%e0%b0%95%e0%b0%ac%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0-%e0%b0%b9%e0%b0%95%e0%b1%8d%e0%b0%95/#respond Wed, 14 Oct 2026 05:41:33 +0000 https://dakshinam.org/?p=2027 INTRODUCTION

స‌మాచార హ‌క్కు చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చి 21 ఏళ్లు పూర్త‌య్యాయి. ఎన్నో ఉద్య‌మాల ఫ‌లితంగా ఈ చ‌ట్టం రూపు దాల్చిప్పుడు ప్ర‌జాస్వామ్య ప్రియులు, స‌గ‌టు భార‌తీయులు ఎంతో సంబుర‌ప‌డ్డారు. అవినీతి, అక్ర‌మాల‌కు తెర‌వేయ‌డంలో ఈ చ‌ట్టం త‌మ‌కు ఆయుధంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఎంతో మంది అనుకున్నారు. చ‌ట్టం ఏర్పాటే ఒక ఘ‌న విజ‌యంగా భావించారు. మొదట్లో కొంత ప్ర‌భావ‌శీంగా క‌నిపించిన ఈ చ‌ట్టం  కాల క్ర‌మేణా మ‌స‌క‌బారిపోతోంది. దీనిపై ఆశ‌లు స‌న్న‌గిల్లుతూ వ‌స్తున్నాయి. అంత‌కుముందు అంకుశంలా క‌నిపించిన చ‌ట్టం ఇప్పుడు  నామ‌మాత్ర‌మై పోయింది. ప్ర‌భుత్వాలు ఈ చ‌ట్టం అమ‌లును ప‌ట్టించుకోక‌వ‌పోడం, స‌మాచార హ‌క్కు క‌మిష‌న్ల‌లో క‌మిష‌న‌ర్ల నియామ‌కాల‌ను పూర్తి స్థాయిలో చేప‌ట్ట‌క‌పోవ‌డం, రాజ‌కీయ నిరుద్యోగుల‌కు ఆవాసంగా క‌మిష‌న్‌ను మార్చ‌డం, నిబంధ‌న‌లు మార్చ‌డం, అధికారాలు త‌గ్గించ‌డంతో స‌మాచార హ‌క్కు చ‌ట్టం కోర‌లు పీకిన పాములా మారిపోతోంది. ఇప్ప‌టికీ చ‌ట్టం అమ‌లులో ఉంది.క‌మిష‌న్లు ప‌నిచేస్తూనే ఉన్నాయి. కానీ ఆశించిన ప‌నితీరు క‌న‌బ‌ర‌చ‌డం లేదు.   అప్పీళ్ల పరిష్కారంలో ఏళ్ల తరబడి నిరీక్షణ, జరిమానాల విధింపులో వెనుకంజ…వెర‌సి  లక్షలాది పెండింగ్‌ కేసులతో ల‌క్ష్యం నీరుగారిపోతోంది. స‌మాచార హ‌క్కు చ‌ట్టం ఏర్ప‌డి అక్టోబ‌రు 12 నాటికి 21 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా దీనిపై విశ్లేష‌ణ‌.

ANALYSIS

అక్టోబరు 12, 2026తో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 21 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకతను పెంచడం, అవినీతిని ప్రశ్నించడం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకోవడం కోసం రూపొందిన ఈ చట్టం కోట్లాది మంది పౌరులకు సాధికారత కల్పించింది. అయితే, చట్టం అమలుకు బాధ్యత వహించే సమాచార కమిషన్లలో ఖాళీలు, అప్పీళ్ల పెండింగ్‌, విచారణలో జాప్యం, అధికారులపై జరిమానాల విధింపులో వెనుకంజ వంటి సమస్యలు దాని లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌ విడుదల చేసిన 2025–26 నివేదిక ప్రకారం, 2026 జూన్‌ 30 నాటికి దేశంలోని 28 సమాచార కమిషన్లలో 3,85,716 అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి.

సమాచార హక్కు చట్టం ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు

ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు చేసే నిధులు ఎలా వినియోగమవుతున్నాయి? సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరుగుతున్నాయా? గ్రామాల్లో నిర్మించామని చెప్పే రహదారులు, పాఠశాలలు, చెరువులు వాస్తవంగా నిర్మించారా? ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టులు, రేషన్‌ పంపిణీ, పెన్షన్ల మంజూరులో అవకతవకలు ఉన్నాయా? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రజలకు అధికారిక రికార్డులు అందుబాటులో ఉండాలనే ఆలోచన నుంచే సమాచార హక్కు ఉద్యమం బలపడింది.

రాజస్థాన్‌లో మొదలైన ప్రజా ఉద్యమం

1990వ దశకం ప్రారంభంలో రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు కనీస వేతనాలు చెల్లించకపోవడం, ఉపాధి పనుల రికార్డుల్లో అక్రమాలు, జరగని పనులకు నిధులు ఖర్చు చేసినట్లు చూపించడం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి.ఈ నేపథ్యంలో మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ (MKSS) ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న ఖర్చుల వివరాలు, వేతనాల రికార్డులు, బిల్లులు, వోచర్లు ప్రజలకు అందించాలని డిమాండ్‌ చేసింది.1994, 1996లో నిర్వహించిన జన్‌ సున్వాయ్‌ (ప్రజా విచారణలు) ఈ ఉద్యమంలో కీలక ఘట్టాలుగా నిలిచాయి. ప్రభుత్వ రికార్డులను ప్రజల ముందు చదివి వినిపించడం ద్వారా, కాగితాలపై పూర్తయినట్లు చూపించిన పనులు వాస్తవంగా జరిగాయా లేదా అన్నది గ్రామస్థులే ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. ఈ ఉద్యమం సమాచారాన్ని పొందడం కేవలం ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విషయం కాదని, ప్రజాస్వామ్యంలో అది పౌరుల హక్కు కావాలనే ఆలోచనకు బలాన్నిచ్చింది. అనంతరం వివిధ రాష్ట్రాల్లో సమాచార హక్కు ఉద్యమాలు విస్తరించాయి.

రాష్ట్రాల నుంచి జాతీయ చట్టం వరకు

రాజస్థాన్‌ ఉద్యమంతో పాటు పౌరసంఘాలు, పాత్రికేయులు, న్యాయవాదులు, ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలు సమాచార హక్కు కోసం జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించారు.

– 1996: సమాచార హక్కుపై జాతీయ స్థాయి చట్టం కోసం ఉద్యమం మరింత విస్తరించింది.

– 1997–2000: పలు రాష్ట్రాలు సమాచార హక్కుకు సంబంధించిన చట్టాలు, విధానాలను రూపొందించడం ప్రారంభించాయి. రాజస్థాన్‌ సమాచార హక్కు చట్టం 1999లో ఆమోదం పొందింది; 2000లో అమల్లోకి వచ్చింది.

– 2002: కేంద్ర ప్రభుత్వం ఫ్రీడం ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ యాక్టు   తీసుకొచ్చింది. అయితే, అది సమర్థంగా అమల్లోకి రాలేదు.

– 2004: సమాచార హక్కుకు సంబంధించిన కొత్త బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

– 2005, జూన్‌ 15: సమాచార హక్కు చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది.

– 2005, అక్టోబరు 12: చట్టంలోని మిగిలిన ప్రధాన నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

 

ఈ చట్టం వెనుక ఉన్న ప్రధాన సందేశం స్పష్టం: ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. కాబట్టి ప్రజాధన వినియోగం, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన రికార్డులపై ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉండాలి.

రాజ్యాంగంలోని ఏ అంశం సమాచార హక్కుకు ఆధారం?

భారత రాజ్యాంగంలో సమాచార హక్కు అనే పేరుతో ప్రత్యేకంగా ఒక ప్రాథమిక హక్కును పేర్కొనలేదు. అయితే, సుప్రీంకోర్టు పలు తీర్పుల ద్వారా సమాచారాన్ని పొందే హక్కును రాజ్యాంగంలోని 19(1)(a) అధికరణం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛలో భాగంగా గుర్తించింది. ప్రభుత్వ నిర్ణయాలను తెలుసుకునే అవకాశం లేకుండా పౌరులు వాటిపై అభిప్రాయాలు ఏర్పరచుకోవడం, వాటిని విమర్శించడం, ప్రజాస్వామ్య ప్రక్రియలో అర్థవంతంగా పాల్గొనడం సాధ్యం కాదన్నది ఈ న్యాయసూత్రంలోని ప్రధాన భావన. 1975లో స్టేట్‌ ఆఫ్‌ ఉత్తరప్రదేశ్‌ వర్సెస్‌ రాజ్‌ నారాయణ్‌ కేసులోనూ, 1981లో ఎస్‌.పీ. గుప్తా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులోనూ ప్రభుత్వ కార్యకలాపాల పారదర్శకత, ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండాల్సిన అవసరంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

2005లో రూపొందిన సమాచార హక్కు చట్టం ఈ రాజ్యాంగ సూత్రానికి నిర్దిష్టమైన చట్టపరమైన విధానాన్ని కల్పించింది.అయితే, ఈ హక్కు సంపూర్ణమైనది కాదు. జాతీయ భద్రత, కొన్ని రకాల వ్యక్తిగత సమాచారం, వాణిజ్య రహస్యాలు, న్యాయపరమైన మినహాయింపులు వంటి అంశాలకు చట్టంలోని సెక్షన్‌ 8, ఇతర నిబంధనలు వర్తిస్తాయి. ప్రజా ప్రయోజనం, గోప్యత మధ్య సమతౌల్యం పాటించాల్సి ఉంటుంది.

సమాచార హక్కు చట్టంలోని ప్రధాన నిబంధనలు

సమాచార హక్కు చట్టం కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు దరఖాస్తులు పెట్టుకునే అవకాశం కల్పించే చట్టం మాత్రమే కాదు. సమాచారాన్ని అందించే విధానం, అధికారుల బాధ్యత, అప్పీళ్ల పరిష్కారం, ఉల్లంఘనలకు జరిమానాలు వంటి అంశాలకూ ఇందులో స్థానం ఉంది.

పౌరులకు ఉన్న హక్కులు

సెక్షన్‌ 4: ప్రభుత్వ సంస్థలు తమ కార్యకలాపాలు, విధులు, అధికారాలు, నిర్ణయాల ప్రక్రియ, నిధుల వినియోగం తదితర సమాచారాన్ని వీలైనంతవరకు స్వయంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. దీనివల్ల ప్రతి సమాచారానికీ దరఖాస్తు చేయాల్సిన అవసరం తగ్గుతుంది.

సెక్షన్‌ 6: పౌరులు సంబంధిత ప్రజా సమాచార అధికారికి దరఖాస్తు చేసి సమాచారం కోరవచ్చు.

సెక్షన్‌ 7: సాధారణంగా 30 రోజుల్లో సమాచారం అందించాలి. ఒక వ్యక్తి జీవితం లేదా స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం అయితే 48 గంటల్లో అందించాల్సి ఉంటుంది.

సెక్షన్‌ 19: సమాచారం అందకపోయినా, నిరాకరించినా లేదా అసంపూర్ణ సమాచారం ఇచ్చినా మొదటి అప్పీల్‌, ఆ తరువాత రెండో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

సెక్షన్‌ 20: సరైన కారణం లేకుండా సమాచారం ఇవ్వకపోవడం, దరఖాస్తును తిరస్కరించడం, తప్పుడు లేదా అసంపూర్ణ సమాచారం ఇవ్వడం వంటి నిర్దిష్ట ఉల్లంఘనలకు బాధ్యుడైన సమాచార అధికారిపై రోజుకు రూ.250 చొప్పున, గరిష్ఠంగా రూ.25,000 జరిమానా విధించవచ్చు. సంబంధిత అధికారికి తన వాదన వినిపించే అవకాశం ఇచ్చిన తరువాతే జరిమానాపై నిర్ణయం తీసుకోవాలి.

సెక్షన్‌ 25: సమాచార హక్కు చట్టం అమలు తీరుపై సమాచార కమిషన్లు వార్షిక నివేదికలను రూపొందించాలి. వాటిలో దరఖాస్తులు, తిరస్కరణలు, అప్పీళ్లు, వాటి పరిష్కారం, జరిమానాలు తదితర వివరాలు ఉండాలి.

ఈ నిబంధనల ఉద్దేశం కేవలం సమాచారం ఇవ్వడం కాదు; ప్రభుత్వ కార్యాలయాల్లో బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రోత్సహించడం కూడా.

కేంద్ర సమాచార కమిషన్‌ ఎలా పనిచేస్తుంది?

సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 12 ప్రకారం కేంద్ర సమాచార కమిషన్‌

ఏర్పాటైంది. ఇది 2005 అక్టోబరు 12 నుంచి పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రజా సంస్థలకు సంబంధించిన అప్పీళ్లు, ఫిర్యాదులను పరిష్కరించడం దీని ప్రధాన బాధ్యత.

కమిషన్‌ నిర్మాణం

కేంద్ర సమాచార కమిషన్‌లో ఒక ప్రధాన సమాచార కమిషనర్‌, అవసరాన్ని బట్టి గరిష్ఠంగా పది మంది సమాచార కమిషనర్లు ఉండవచ్చు.

ప్రధాన సమాచార కమిషనర్‌, ఇతర కమిషనర్ల నియామకానికి ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి , లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు , ప్రధానమంత్రి నామినేట్‌ చేసిన కేంద్ర మంత్రివర్గ మంత్రి ఉంటారు.

చట్టం ప్రకారం, ప్రజాజీవితంలో విశిష్టత కలిగి, న్యాయం, శాస్త్రసాంకేతిక రంగాలు, సామాజిక సేవ, నిర్వహణ, పాత్రికేయం, ప్రసార మాధ్యమాలు లేదా పరిపాలన వంటి రంగాల్లో విస్తృత పరిజ్ఞానం, అనుభవం ఉన్నవారిని నియమించవచ్చు. రాజకీయ పార్టీతో అనుబంధం ఉండటం, పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ సభ్యత్వం, ఇతర లాభదాయక పదవులు వంటి అంశాలపై చట్టంలో అనర్హత నిబంధనలు ఉన్నాయి.

 రాష్ట్ర సమాచార కమిషన్ల పరిస్థితి ఏమిటి?

సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 15 ప్రకారం ప్రతి రాష్ట్రం రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేయవచ్చు. ఈ కమిషన్ల పరిధిలోకి ఆయా రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్రజా సంస్థలకు సంబంధించిన అప్పీళ్లు, ఫిర్యాదులు వస్తాయి.

కేంద్ర కమిషన్‌తో పాటు రాష్ట్రాల సమాచార కమిషన్లు ఈ చట్టానికి కీలకమైన న్యాయపరమైన రక్షణ వ్యవస్థలు. కానీ అనేక రాష్ట్రాల్లో కమిషనర్ల నియామకం ఆలస్యం కావడం, తగినంత మంది కమిషనర్లు లేకపోవడం, వార్షిక నివేదికలు ప్రచురించకపోవడం వంటి సమస్యలు బయటపడ్డాయి.

సుప్రీంకోర్టు జోక్యం ఎందుకు అవసరమైంది?

2019 ఫిబ్రవరి 15న అంజలి భరద్వాజ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు సమాచార కమిషన్లలో తగిన సంఖ్యలో కమిషనర్ల నియామకం అత్యవసరమని స్పష్టం చేసింది. కేసుల భారాన్ని బట్టి కమిషనర్ల సంఖ్యను నిర్ణయించాలని, ఖాళీలు ఏర్పడకముందే నియామక ప్రక్రియను ప్రారంభించాలని సూచించింది.

2025–26లోనూ కమిషన్ల నియామకాల్లో జాప్యంపై సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. 2026 జూలై 28న వెలువడిన ఉత్తర్వుల్లో హిమాచల్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, అసోం, తమిళనాడు, రాజస్థాన్‌ కమిషన్లలో ఖాళీలు, సభ్యుల కొరత, ప్రధాన సమాచార కమిషనర్ల నియామకంపై ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో నియామక ప్రక్రియను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించింది.

రాష్ట్రాల వారీగా తాజా పరిస్థితిపై ముఖ్యమైన అంశాలు

రాష్ట్రం/కమిషన్‌                   అందుబాటులో ఉన్న తాజా సమాచారం

ఝార్ఖండ్‌:          2025–26 నివేదిక ప్రకారం కొత్త అప్పీళ్లు, ఫిర్యాదుల నమోదును నిలిపివేసి, ఆ కాలంలో కేసులను పరిష్కరించలేదు. 2026 జూలై సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం నలుగురు కమిషనర్లు నియమితులైనప్పటికీ, ప్రధాన సమాచార కమిషనర్‌తో సహా మరికొన్ని నియామకాలు అవసరమయ్యాయి.

హిమాచల్‌ప్రదేశ్‌:           2025 జూలై 3 నుంచి కమిషన్‌ పూర్తిగా పనిచేయడం లేదని 2026 అక్టోబరు నివేదిక పేర్కొంది.

అసోం  2026 జూలై సుప్రీంకోర్టు ఉత్తర్వు సమయానికి ప్రధాన సమాచార కమిషనర్‌ నియామకం జరగలేదని కోర్టు పేర్కొంది.

తమిళనాడు :    అదే ఉత్తర్వు సమయానికి నలుగురు సమాచార కమిషనర్లు పనిచేస్తుండగా, ప్రధాన సమాచార కమిషనర్‌ సహా మరికొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

రాజస్థాన్‌:           2026 జూలై ఉత్తర్వు సమయానికి ప్రధాన సమాచార కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉన్నట్లు కోర్టుకు తెలియజేశారు.

బీహార్‌: పెండింగ్‌ కేసులు అధికంగా ఉన్నప్పటికీ, కమిషనర్ల సంఖ్య సరిపోవడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఛత్తీస్‌గఢ్‌           పెండింగ్‌ కేసుల భారాన్ని దృష్టిలో ఉంచుకొని కమిషన్‌ సభ్యుల సంఖ్యను పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

తెలంగాణ  సమాచార కమిషన్‌

తెలంగాణలో సమాచార కమిషన్‌ 2017లో ఏర్పాటైంది. అయితే ప్రధాన సమాచార కమిషనర్‌ పోస్టు 2020 ఆగస్టు నుంచి 2025 మే వరకు ఖాళీగా ఉంది. మొత్తం కమిషన్‌ 2023 ఫిబ్రవరి నుంచి 2025 మే వరకు రెండేళ్లకు పైగా పనిచేయని పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత 2025 మేలో ప్రధాన సమాచార కమిషనర్‌తో సహా ఆరుగురిని నియమించారు.

ఆంధ్రప్రదేశ్‌ సమాచార హక్కు కమిషన్

– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌ను 2017 ఆగస్టు 11న ఏర్పాటు చేశారు.2026 అక్టోబరు 13 నాటికి అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌ సమాచార హక్కు కమిషన్‌లో మొత్తం 8 పోస్టులు భర్తీ అయ్యాయి. ఖాళీలు లేవని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం 2026 ఫిబ్రవరిలో తెలియజేసింది.

దేశవ్యాప్తంగా పెండింగ్‌ కేసులు:

2026 అక్టోబరులో వెలువడిన Report Card on the Performance of Information Commissions in India, 2025–26 నివేదిక ప్రకారం, జూన్‌ 30, 2026 నాటికి దేశంలోని 28 సమాచార కమిషన్లలో 3,85,716 అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి.

గత ఏడాది జూన్‌ 30 నాటికి 29 కమిషన్లలో 4,13,972 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నమోదైంది. తాజా గణాంకంలో ఒక కమిషన్‌కు సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోవడంతో, రెండు సంవత్సరాల సంఖ్యలను పోల్చేటప్పుడు ఈ పరిమితిని గుర్తుంచుకోవాలి.

IN NUMBERS

2026 జూన్‌ నాటికి అత్యధిక పెండింగ్‌ కేసులున్న కమిషన్లు

కమిషన్‌              పెండింగ్‌ కేసులు           గణాంకానికి సంబంధించిన గమనిక

మహారాష్ట్ర         77,397   2026 జూన్‌ 30

ఛత్తీస్‌గఢ్‌           52,559   2025 డిసెంబరు 10 నాటి సంఖ్య

బీహార్‌   42,243   2026 నివేదికలో పేర్కొన్న సంఖ్య

కేంద్ర సమాచార కమిషన్‌           39,121   2025 జూన్‌లో 24,102 ఉండగా పెరిగింది

తమిళనాడు      37,150   2026 జూన్‌ 30 నాటి సంఖ్యగా రాష్ట్ర వార్తా నివేదిక పేర్కొంది

తెలంగాణలో పెండింగ్‌ కేసుల పరిస్థితి

సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌ 2024–25 నివేదిక ప్రకారం, తెలంగాణ సమాచార కమిషన్‌లో 2025 జూన్‌ 30 నాటికి 18,192 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అప్పటి కేసుల పరిష్కార వేగాన్ని ఆధారంగా చేసుకుని, 2025 జూలై 1న దాఖలైన కొత్త అప్పీల్‌ను పరిష్కరించడానికి 29 సంవత్సరాల రెండు నెలలు పట్టవచ్చని అంచనా వేసింది.

2025 జూన్‌ 30 నాటి రాష్ట్రాల వారీ పెండింగ్‌ కేసులు

రాష్ట్రం/కమిషన్‌             పెండింగ్‌ కేసులు

మహారాష్ట్ర         95,340

కర్ణాటక 47,825

తమిళనాడు      41,059

ఛత్తీస్‌గఢ్‌           34,147

బీహార్‌   29,919*

ఒడిశా   19,239

ఉత్తరప్రదేశ్‌      18,424

తెలంగాణ          18,192

మధ్యప్రదేశ్‌      17,940

పంజాబ్‌              14,376

ఆంధ్రప్రదేశ్‌     13,591

ఝార్ఖండ్‌            7,728

రాజస్థాన్‌             7,028**

కేరళ     6,512

హర్యానా              5,542

పశ్చిమ బెంగాల్‌              4,954***

గుజరాత్‌             3,175

ఉత్తరాఖండ్‌     1,688

హిమాచల్‌ప్రదేశ్‌             1,195

అసోం  787

అరుణాచల్‌ప్రదేశ్‌         497

త్రిపుర  368

గోవా       241

మణిపూర్‌           80

మేఘాలయ      13

నాగాలాండ్‌        7

సిక్కిం  3

మిజోరం              0

మొత్తం 4,13,972

కేంద్ర సమాచార కమిషన్‌           24,102

కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

పెండింగ్‌ కేసులు పెరగడానికి కేవలం దరఖాస్తుల సంఖ్య పెరగడమే కారణం కాదు. కమిషన్లలో ఖాళీలు, కేసుల పరిష్కార వేగం, అప్పీళ్ల స్వీకరణ విధానం, అధికారుల బాధ్యతను అమలు చేయడంలో లోపాలు వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయి.

కమిషనర్ల నియామకంలో జాప్యం:

ప్రధాన సమాచార కమిషనర్‌, ఇతర కమిషనర్ల పదవీకాలం ఎప్పుడు ముగుస్తుందో ముందుగానే తెలుసుకోవచ్చు. అయినప్పటికీ నియామక ప్రక్రియను ముందుగానే ప్రారంభించకపోవడం వల్ల కమిషన్లు నెలలు, కొన్నిసార్లు సంవత్సరాల పాటు పనిచేయని పరిస్థితి ఏర్పడుతోంది.

సుప్రీంకోర్టు 2019లోనే ఖాళీలు ఏర్పడే తేదీకి ఒకటి లేదా రెండు నెలల ముందే నియామక ప్రక్రియ ప్రారంభించాలని సూచించింది. అయినప్పటికీ, తరువాతి సంవత్సరాల్లోనూ ఇలాంటి సమస్యలు పునరావృతమయ్యాయి.

కేసుల పరిష్కారంలో మందగమనం

2025–26 సంవత్సరంలో 27 కమిషన్లకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 2,61,669 కేసులు నమోదయ్యాయి. అదే కాలంలో 28 కమిషన్లు 2,41,627 కేసులను పరిష్కరించాయి. అంటే, నమోదైన కేసుల సంఖ్యను పరిష్కారాల సంఖ్య మించలేకపోయింది. ఈ తేడా ఒక్కటే మొత్తం పెండింగ్‌ మార్పును వివరించదు; పాత కేసుల పరిష్కారం, తిరిగి పంపిన అప్పీళ్లు, ఇతర గణాంక పరిమితులు కూడా ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ, పరిష్కార వేగాన్ని పెంచాల్సిన అవసరం స్పష్టమవుతోంది.

అప్పీళ్లను విచారించకుండానే తిరిగి పంపడం

2025 జూలై నుంచి 2026 జూన్‌ వరకు తొమ్మిది సమాచార కమిషన్లు 37,701 అప్పీళ్లు, ఫిర్యాదులను తుది ఉత్తర్వులు ఇవ్వకుండా తిరిగి పంపినట్లు తాజా నివేదిక పేర్కొంది.

వీటిలో:

– కేంద్ర సమాచార కమిషన్‌ — 14,603;

– మహారాష్ట్ర — 14,140;

– బీహార్‌ — 4,417;

– గుజరాత్‌ — 3,276.

సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌ నివేదిక ప్రకారం, గత సంవత్సరం కేంద్ర సమాచార కమిషన్‌ తిరిగి పంపిన అప్పీళ్లలో దాదాపు 95 శాతం మళ్లీ దాఖలు కాలేదు. పేజీలకు నంబర్లు వేయకపోవడం, సూచిక జతచేయకపోవడం వంటి లోపాల కారణంగా అప్పీళ్లను తిరిగి పంపడం ప్రజలను నిరుత్సాహపరచవచ్చని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

అప్పీల్‌ పత్రాల్లో అవసరమైన వివరాలు ఉండటం ముఖ్యం. కానీ చిన్నచిన్న సాంకేతిక లోపాల కారణంగా ప్రజలు కోరుతున్న సమాచారానికి సంబంధించిన వివాదాన్ని అసలు విచారించకపోతే, చట్టం ఉద్దేశమే దెబ్బతింటోంది.

 జరిమానాలు విధించడంలో కమిషన్లు వెనుకంజ వేస్తున్నాయా?

సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 20 అధికారులకు బాధ్యతను గుర్తుచేసే ముఖ్యమైన నిబంధన. చట్టాన్ని ఉల్లంఘించిన సమాచార అధికారిపై తగిన సందర్భాల్లో జరిమానా విధించే అధికారం కమిషన్‌కు ఉంది.

2024 జూలై నుంచి 2025 జూన్‌ వరకు 23 కమిషన్లు అందించిన వివరాల ప్రకారం, మొత్తం 1,252 కేసుల్లో రూ.2.32 కోట్ల జరిమానాలు విధించారు. ఇదే సమయంలో, 17 కమిషన్లు అందించిన వివరాల ప్రకారం 13,657 కేసుల్లో జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

నివేదికలోని మరో ముఖ్యమైన పరిశీలన ఏమిటంటే, జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసిన కేసుల్లోనూ కమిషన్లు చాలా తక్కువ సందర్భాల్లోనే జరిమానాలు విధించాయి. అయితే ప్రతి కేసులోనూ జరిమానా విధించడం సాధ్యం కాదు; అధికారికి సమాచారం ఇవ్వకపోవడానికి చట్టబద్ధమైన కారణం ఉందా లేదా అన్నది పరిశీలించాలి. అయినప్పటికీ, ఉల్లంఘన జరిగినప్పటికీ జరిమానా విధించకపోవడం పునరావృతమైతే, సమాచార అధికారుల్లో బాధ్యతాభావం తగ్గే ప్రమాదం ఉంది. ఈ విషయంలో కమిషన్ల నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలి; జరిమానా విధించకపోతే కారణాలు స్పష్టంగా నమోదు చేయాలి.

కమిషనర్ల నియామకంలో రాజకీయ ప్రభావం ఉందా?

సమాచార కమిషనర్‌ పదవి స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన బాధ్యత కలిగిన పదవి. అందువల్ల నియామక ప్రక్రియలో పారదర్శకత, అర్హత, అనుభవం, ప్రజాజీవితంలో విశిష్టత కీలకం.

చట్టం ప్రకారం కమిషనర్లకు న్యాయం, సామాజిక సేవ, పాత్రికేయం, శాస్త్రసాంకేతిక రంగాలు, పరిపాలన, నిర్వహణ తదితర రంగాల్లో విస్తృత పరిజ్ఞానం, అనుభవం ఉండాలి. రాజకీయ పార్టీతో సంబంధం ఉండకూడదనే అనర్హత నిబంధన కూడా ఉంది. అయితే, ప్రభుత్వాలు నియమించే వ్యక్తుల నేపథ్యాన్ని బట్టి మాత్రమే ప్రతి నియామకాన్ని చట్టవిరుద్ధమని తేల్చలేం. మాజీ ఉన్నతాధికారులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, ఇతర రంగాల నిపుణులు చట్టం నిర్దేశించిన అర్హతలకు అనుగుణంగా ఉంటే నియమితులు కావచ్చు.

కమిషన్ల స్వతంత్రతపై చర్చ

2019లో సమాచార హక్కు చట్టానికి చేసిన సవరణలు కూడా చర్చనీయాంశమయ్యాయి.అసలు చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్లు, ఇతర కమిషనర్ల పదవీకాలం ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయస్సు వరకు ఉండేది. వారి జీతభత్యాలు, ఇతర సేవా నిబంధనలకు చట్టంలోనే నిర్దిష్టమైన ఆధారాలు ఉండేవి.2019 సవరణ ద్వారా పదవీకాలం, జీతభత్యాలు, ఇతర సేవా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నియమాల ద్వారా నిర్ణయించే విధానం తీసుకొచ్చారు. 2019 నిబంధనల ప్రకారం కమిషనర్ల పదవీకాలం మూడేళ్లుగా నిర్ణయించారు.

ఈ సవరణపై విమర్శకులు వ్యక్తం చేసిన ప్రధాన ఆందోళన ఏమిటంటే, కమిషనర్ల పదవీకాలం, సేవా నిబంధనలను నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వానికి అధిక నియంత్రణ లభిస్తే సంస్థాగత స్వతంత్రతపై ప్రభావం పడవచ్చని. మరోవైపు, ప్రభుత్వం ఈ మార్పులను కమిషన్ల స్వభావం, విధులకు అనుగుణంగా సేవా నిబంధనలను సర్దుబాటు చేసే చర్యగా సమర్థించింది. ఈ చర్చను పరిశీలించేటప్పుడు రెండు అంశాలు ముఖ్యం: కమిషన్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉండాలి; అదే సమయంలో వాటి పనితీరుపై ప్రజలకు జవాబుదారీతనం కూడా ఉండాలి.

సమాచార హక్కు చట్టం సాధించిన విజయాలు

సమాచార కమిషన్లలో లోపాలు ఉన్నప్పటికీ, ఈ చట్టం వల్ల ప్రజలకు వచ్చిన ప్రయోజనాలను విస్మరించలేం.ప్రభుత్వ రికార్డులకు ప్రజలకు ప్రవేశం గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లోని రికార్డుల గురించి తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు పౌరులు ప్రభుత్వ ఖర్చులు, పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, నియామకాలు, టెండర్లు, పెన్షన్లు, రేషన్‌, స్థానిక సంస్థల పనుల గురించి అధికారిక సమాచారం కోరగలుగుతున్నారు.

సంక్షేమ పథకాల అమలుపై పర్యవేక్షణ

ఉపాధి హామీ పనుల రికార్డులు, వేతనాల చెల్లింపులు, రేషన్‌ సరఫరా, పెన్షన్ల మంజూరు వంటి అంశాల్లో సమాచార హక్కు పౌరుల పర్యవేక్షణకు ఉపయోగపడుతోంది. ప్రభుత్వ పథకాల రికార్డులు అందుబాటులో ఉండటం సామాజిక తనిఖీలకు కూడా తోడ్పడుతుంది. అయితే, సమాచార హక్కు ఒక్కటే అవినీతిని నిర్మూలిస్తుందని చెప్పలేం; సమాచారం ఆధారంగా జరిగే విచారణలు, చర్యలు, ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం.

ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం

ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఉన్న ఉత్తర్వులు, విధానాలు, ఖర్చుల వివరాలు, ఫైళ్లలో నమోదు చేసిన అధికారిక నిర్ణయాలను తెలుసుకోవడానికి ఈ చట్టం మార్గం కల్పించింది. తద్వారా పౌరులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వ చర్యలను ఆధారాలతో ప్రశ్నించే అవకాశం పొందారు.

అధికారుల బాధ్యతను గుర్తుచేసే వ్యవస్థ

సమాచారాన్ని సకాలంలో అందించకపోతే అప్పీల్‌ చేసుకునే అవకాశం, చట్ట ఉల్లంఘన జరిగిన సందర్భాల్లో జరిమానా విధించే నిబంధన అధికారులపై బాధ్యతను పెంచే సాధనాలు.

సమాచార హక్కు దుర్వినియోగం: వాస్తవం ఎంత?

సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి కొందరు వ్యక్తులు అధికారులను వేధించడం, వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడడం వంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని విస్మరించకూడదు. అయితే, దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలన్నింటినీ నిరూపిత వాస్తవాలుగా పరిగణించడం కూడా సరికాదు. 2011 ఆగస్టు 9న సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ వర్సెస్‌ ఆదిత్య బందోపాధ్యాయ్‌ కేసులో సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన సూత్రాన్ని స్పష్టం చేసింది.

పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి నిరోధం వంటి లక్ష్యాలకు సంబంధం లేని, విచక్షణారహితమైన లేదా ఆచరణ సాధ్యం కాని సమాచార అభ్యర్థనలు పరిపాలన సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చని కోర్టు హెచ్చరించింది. చట్టాన్ని నిజాయితీగా పనిచేసే అధికారులను వేధించడానికి లేదా బెదిరించడానికి ఉపయోగించరాదని పేర్కొంది.

ఈ తీర్పు సమాచార హక్కును రద్దు చేయాలని చెప్పలేదు. చట్టం ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని, చట్టబద్ధమైన పరిమితులను గౌరవిస్తూ దాన్ని ఉపయోగించాలని సూచించింది.

దుర్వినియోగాన్ని అరికట్టడం ఎలా?

– ఒకే సమాచారాన్ని పదేపదే కోరడం, సంబంధం లేని విస్తృత సమాచారం అడగడం వంటి సందర్భాలను చట్టబద్ధంగా పరిశీలించాలి.

– నిజమైన ప్రజా ప్రయోజనంతో దాఖలైన దరఖాస్తులను అనవసరంగా తిరస్కరించకూడదు.

– వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన మినహాయింపులను వర్తింపజేసేటప్పుడు చట్టాన్ని అనుసరించాలి.

– బ్లాక్‌మెయిల్‌ లేదా బెదిరింపులకు సంబంధించిన నిర్దిష్ట ఆధారాలు ఉంటే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలి.

– దుర్వినియోగం ఉందనే పేరుతో సాధారణ పౌరుల సమాచార హక్కును పరిమితం చేయకూడదు.

కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారనే కారణంతో చట్టాన్ని బలహీనపరచడం ఒక సమస్యకు పరిష్కారం కాదు. నిజమైన దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు, ప్రజలకు సమాచారం అందే మార్గాలను మరింత సులభతరం చేయాలి.

 లక్ష్యాలు గొప్పవి.. ఫలితాలు ఎందుకు తక్కువ?

ప్రభుత్వాల నిర్లక్ష్యం, కమిషనర్ల నియామకాల్లో జాప్యం, పరిమిత సిబ్బంది, విచారణల మందగమనం వంటి అంశాలు సమాచార హక్కు చట్టం సమర్థతను దెబ్బతీస్తున్నాయని నివేదికలు, కోర్టు ఉత్తర్వులు సూచిస్తున్నాయి.

అయితే, చట్టం ఆశించిన ఫలితాలు పూర్తిగా రాకపోవడానికి ప్రభుత్వాల వైఖరితో పాటు   వ్యవస్థలోని అనేక లోపాలను కార‌ణంగా చెప్పొచ్చు.

ప్రధాన సమస్యలు

  1. కమిషనర్ల నియామకంలో జాప్యం: ఖాళీలు ఏర్పడిన తరువాతే నియామక ప్రక్రియ ప్రారంభించడం వల్ల అప్పీళ్ల పరిష్కారం నిలిచిపోతోంది.
  2. తగిన సిబ్బంది లేకపోవడం: కమిషనర్లు ఉన్నప్పటికీ, కేసుల పరిశీలన, నోటీసులు, రికార్డుల నిర్వహణ, విచారణల కోసం అవసరమైన సహాయక సిబ్బంది కొరత కూడా ప్రభావం చూపవచ్చు.
  3. జరిమానాల విధింపులో వెనుకంజ: ఉల్లంఘన జరిగిన సందర్భాల్లో చట్టం నిర్దేశించిన బాధ్యతను సమర్థంగా అమలు చేయకపోతే, అధికారులకు చట్టం ఉల్లంఘించినా పెద్దగా పరిణామాలు ఉండవనే భావన ఏర్పడవచ్చు.
  4. వార్షిక నివేదికల ప్రచురణలో నిర్లక్ష్యం: 2024–25 నివేదిక ప్రకారం, 29 కమిషన్లలో 20 కమిషన్లు 2023–24 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను కూడా ప్రచురించలేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ కమిషన్లు తమ ఏర్పాటైన 2017 నుంచి వార్షిక నివేదికలను ప్రచురించలేదని నివేదిక పేర్కొంది. SNS India
  5. సమాచారాన్ని ముందుగానే బహిర్గతం చేయకపోవడం: సెక్షన్‌ 4 ప్రకారం ప్రభుత్వ సంస్థలు అనేక రకాల సమాచారాన్ని స్వయంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఇది సమర్థంగా అమలైతే దరఖాస్తుల భారం తగ్గే అవకాశం ఉంది.
  6. ప్రజల్లో అవగాహన లోపం: దరఖాస్తు ఎలా చేయాలి, అప్పీల్‌ ఎప్పుడు వేయాలి, ఏ సమాచారం చట్ట పరిధిలోకి వస్తుంది వంటి అంశాలపై అవగాహన పెరగాలి.
  7. ప్రభుత్వ శాఖల్లో రికార్డుల నిర్వహణ సమస్యలు: పాత ఫైళ్లు, అసంపూర్ణ రికార్డులు, డిజిటలైజేషన్‌ లోపాలు సమాచారాన్ని సకాలంలో అందించడాన్ని కష్టతరం చేయవచ్చు.

చట్టాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు

21 ఏళ్ల ప్రస్థానం తరువాత సమాచార హక్కు చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలంటే కొన్ని చర్యలు అత్యవసరం.

  1. ఖాళీలను ముందుగానే భర్తీ చేయాలి

కమిషనర్ల పదవీకాలం ముగిసే తేదీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలి. కమిషన్లు పనిచేయని పరిస్థితి ఏర్పడకుండా చూడాలి.

  1. పెండింగ్‌ కేసులకు ప్రత్యేక ప్రణాళిక

లక్షల సంఖ్యలో పెండింగ్‌ కేసులున్న కమిషన్లలో అదనపు బెంచీలు, అవసరమైన సిబ్బంది, వీడియో విచారణలు, కేసుల ప్రాధాన్య క్రమం వంటి చర్యలను పరిశీలించాలి.

  1. నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

దరఖాస్తుదారుల అర్హతలు, ఎంపిక ప్రమాణాలు, ఎంపిక కమిటీ నిర్ణయాలు, నియామకానికి సంబంధించిన సమాచారాన్ని చట్టపరమైన పరిమితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

  1. జరిమానాలపై స్పష్టమైన నివేదికలు

ఎన్ని కేసుల్లో జరిమానా విధించదగిన ఉల్లంఘనలు గుర్తించారు? ఎన్ని కేసుల్లో జరిమానా విధించారు? విధించకపోతే కారణాలేమిటి? అన్న వివరాలను వార్షిక నివేదికల్లో వెల్లడించాలి.

  1. వార్షిక నివేదికలను తప్పనిసరిగా ప్రచురించాలి

సెక్షన్‌ 25 ప్రకారం నివేదికలను సమయానికి రూపొందించి, సంబంధిత శాసనసభ లేదా పార్లమెంటు ముందు ఉంచాలి. వాటిని వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంచాలి.

  1. సెక్షన్‌ 4 అమలుపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వ వ్యయాలు, టెండర్లు, లబ్ధిదారుల ఎంపిక, పథకాల అమలు, నియామకాలు వంటి సమాచారాన్ని ముందుగానే ఆన్‌లైన్‌లో ప్రచురించాలి. దరఖాస్తు చేయకుండానే ప్రజలకు సమాచారం అందేలా చూడాలి.

  1. అప్పీళ్ల స్వీకరణను ప్రజలకు అనుకూలంగా మార్చాలి

అప్పీల్‌లో సాంకేతిక లోపాలుంటే వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పించాలి. చిన్న లోపాల పేరుతో అప్పీళ్లను తుది ఉత్తర్వు లేకుండా తిరిగి పంపే విధానాన్ని సమీక్షించాలి.

  1. సమాచార హక్కు కార్యకర్తలకు రక్షణ

సమాచార హక్కును వినియోగిస్తున్నందుకు బెదిరింపులు లేదా దాడులకు గురయ్యే వ్యక్తుల ఫిర్యాదులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.

  1. ప్రజలకు అవగాహన పెంచాలి

పాఠశాలలు, కళాశాలలు, స్థానిక సంస్థలు, పౌరసంఘాల ద్వారా సమాచార హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

సమాచార హక్కు చట్టం ప్రజలకు కల్పించిన అధికారాన్ని కాపాడాలంటే ప్రభుత్వాలు నియామకాల విషయంలో నిర్లక్ష్యాన్ని విడనాడాలి. సమాచార కమిషన్లు స్వతంత్రంగా, సమర్థంగా పనిచేయాలి. ప్రజలకు సమాచారం అందించాల్సిన అధికారులపై చట్టబద్ధమైన బాధ్యతను అమలు చేయాలి. అదే సమయంలో చట్ట దుర్వినియోగం జరిగితే దానిని కూడా నిష్పక్షపాతంగా అరికట్టాలి.ప్రజాస్వామ్యంలో సమాచారం అనేది కేవలం ప్రభుత్వ రికార్డు కాదు. ప్రజలు తమ పాలకులను ప్రశ్నించడానికి, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టడానికి అవసరమైన సాధనం. ఆ సాధనం ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే సమాచార హక్కు చట్టం నిజమైన అర్థంలో విజయవంతమైనట్లు భావించాలి.

NEWS AND REFFERANCES AT A GLANCE:

https://www.business-standard.com/amp/article/pti-stories/andhra-government-sets-up-information-commission-117081101798_1.html

https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/guntur/new-rti-commissioners-appointed-in-andhra-pradesh-chief-information-commissioner-and-commissioners-take-oaths-vvnp-1486589.html

https://api.sci.gov.in/supremecourt/2019/32947/32947_2019_1_26_68511_Order_10-Feb-2026.pdf

https://www.thehansindia.com/hans/opinion/news-analysis/thankfully-rti-is-alive-and-kicking-1131789

https://indiankanoon.org/doc/1519371/?utm

https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?lang=2&reg=48&relid=192088&utm_source=chatgpt.com

https://economictimes.indiatimes.com/news/india/rti-act-turns-21-commissions-choke-on-backlog-appeals-in-tripura-mp-may-be-decided-in-2046/articleshow/134906539.cms

https://www.snsindia.org/wp-content/uploads/2025/10/Report-Card-Key-findings-2025.pdf

https://www.telangana.gov.in/rti/information-commission/?utm

BY RAVIKANTI SRINIVAS

]]>
https://dakshinam.org/2026/10/14/%e0%b0%ae%e0%b0%b8%e0%b0%95%e0%b0%ac%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0-%e0%b0%b9%e0%b0%95%e0%b1%8d%e0%b0%95/feed/ 0 2027
డీఎస్సీపై మెగా వివాదం ఆంధ్రప్రదేశ్లో అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు https://dakshinam.org/2026/09/23/%e0%b0%a1%e0%b1%80%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%80%e0%b0%aa%e0%b1%88-%e0%b0%ae%e0%b1%86%e0%b0%97%e0%b0%be-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-%e0%b0%86%e0%b0%82/ https://dakshinam.org/2026/09/23/%e0%b0%a1%e0%b1%80%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%80%e0%b0%aa%e0%b1%88-%e0%b0%ae%e0%b1%86%e0%b0%97%e0%b0%be-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-%e0%b0%86%e0%b0%82/#respond Wed, 23 Sep 2026 08:00:10 +0000 https://dakshinam.org/?p=1849 INTRODUCTION:

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డీఎస్సీ-2025 వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. తాజాగా ఉపాధ్యాయుల‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు భౌతిక దాడికి పాల్ప‌డేదాకా వ‌చ్చింది.  2026 సెప్టెంబరు 21న విజయవాడలో జరిగిన డీఎస్సీ–2025 స్పోర్ట్స్‌ కోటా వివాదం, ఉపాధ్యాయులపై జరిగిన ఘర్షణపై   కేవలం ఒకరోజు జరిగిన గొడవ కాదు..గత కొన్ని నెలలుగా వైసీపీ చేస్తున్న ఆరోపణలు, ప్రభుత్వం ఇస్తున్న సమాధానాలు, నియమితులైన ఉపాధ్యాయుల ఆందోళన ..ఇవన్నీ కలిసిన వివాదం.

ANALYTICAL VIEW:

సెప్టెంబరు 21న అసలు ఏం జరిగింది?

విజయవాడలోని  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్  (SAAP) కార్యాలయం వద్ద  ఆందోళ‌న‌కు వైసీపీ నేతలు, కార్యకర్తలు , డీఎస్సీ–2025లో స్పోర్ట్స్‌ కోటా కింద నియమితులైన ఉపాధ్యాయులు ఒకే సమయంలో వచ్చారు. వైసీపీ నేతలు డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై సీబీఐ విచారణ కోరుతూ ధర్నా నిర్వహించారు. మరోవైపు, ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు తమ నియామకాలు నిబంధనల ప్రకారమే జరిగాయని చెబుతూ శాప్  అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చారు. ఇరువర్గాల మధ్య నినాదాలు, వాగ్వాదం తీవ్రం కావడంతో తోపులాట/ఘర్షణ జరిగింది. ఒక ఉపాధ్యాయుడికి తలకు గాయం అయ్యింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.ఉపాధ్యాయులను వైసీపీ వర్గాలు “ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారు”, “డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు పొందారు” వంటి ఆరోపణలు చేయడంతో వారు తమ టీఈటీ, జాతీయ/అంతర్జాతీయ క్రీడా సర్టిఫికెట్లను చూపిస్తూ తీవ్రంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, సీసీటీవీ/వీడియో ఫుటేజీ ఆధారంగా దాడిలో పాల్గొన్న వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

అసలు డీఎస్‌సీ–2025 వివాదం ఏమిటి?

మెగా డీఎస్ సీ -2025  ప్ర‌క్రియ మొత్తంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని  వైసీపీ  ఆరోపిస్తోంది; అయితే సెప్టెంబరు 21న జరిగిన ఘర్షణకు కేంద్రబిందువు ప్రధానంగా స్పోర్ట్స్ కోటా నియామకాలే. మెగా డీఎస్ సీ -2025   ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. ప్రభుత్వం ప్రకారం 3.36 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు; పరీక్ష TCS iON విధానంలో నిర్వహించబడింది. ప్రభుత్వం మొత్తం ప్రక్రియను 148 రోజుల్లో పూర్తి చేసి 15,941 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు చెబుతోంది. వైసీపీ మాత్రం ఈ ప్రక్రియపై పలు అనుమానాలను లేవనెత్తింది. ఇవీ ప్రధాన ఆరోపణలు…

ప్రశ్నపత్రం లీక్

YSRCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణ ప్రకారం, ప్రశ్నపత్రం తయారీ/నిర్వహణలో సంబంధం ఉన్న వ్యవస్థలోనే పనిచేసిన వ్యక్తికి ప్రశ్నపత్రం ముందుగా లభించిందని, అనంతరం అతను అత్యున్నత ర్యాంకు సాధించాడని ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ కోరారు.

స్పోర్ట్స్ కోటాలో  అక్రమాలు

ఇదే ప్రస్తుతం అత్యంత వివాదాస్పద అంశం. 2025 మే 1న జారీ చేసిన స్పోర్ట్స్‌ మెగా డీ ఎస్ సీ నోటిఫికేషన్‌లో 3% హారిజాంటల్ స్పోర్ట్స్‌ కోటా కింద 421 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కోటా పోస్టులకు సాధారణ రాత పరీక్ష లేకుండా క్రీడా ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసే విధానం నోటిఫికేషన్‌లో ఉంది. తర్వాత 372 మంది ఈ కోటా కింద నియమితులయ్యారు. కొంతమంది అభ్యర్థులు నిజమైన జాతీయ/రాష్ట్ర స్థాయి క్రీడా ప్రతిభకు సంబంధించిన సర్టిఫికెట్లు కాకుండా అనర్హమైన లేదా అనుమానాస్పద సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు పొందారని వైసీసీ ప్ర‌ధానంగా ఆరోపిస్తోంది.

వైసీపీ మరో ప్రశ్నను లేవనెత్తింది. డీఎస్‌సీ నోటిఫికేషన్‌కు కొద్దికాలం ముందు స్పోర్ట్స్‌ కోటాను 2% నుంచి 3%కి పెంచడం, రాత పరీక్ష లేకుండా ఎంపిక చేయడం వంటి మార్పులు ఎందుకు చేశారని ప్రశ్నించింది. ఈ అంశాలపై హైకోర్టులో కూడా పిటిషన్‌లో అభ్యంతరాలు నమోదయ్యాయి. వైసీపీ నాయకులు కొన్ని ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, నార్మలైజేషన్ ద్వారా కొందరికి ప్రయోజనం కలిగిందని, మెరిట్‌ జాబితాలో అనుమానాలు ఉన్నాయని కూడా ఆరోపించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం, లోకేశ్‌ వాదన ఏమిటి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ  మంత్రి నారా లోకేశ్   డీఎస్‌సీ -2025పై ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు.  నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని,  16,347 పోస్టుల భర్తీని 148 రోజుల్లో పూర్తి చేశామని తెలిపారు.  పరీక్ష TCS iON సాంకేతిక వ్యవస్థ ద్వారా నిర్వహించామని,  సుమారు 42,000 ప్రశ్నల క్వొశ్చెన్ బ్యాంకును ను SCERT నిపుణులు రూపొందించారని, వాటిలో ప్రశ్నలను  రాండ‌మ్‌గా  అభ్యర్థులకు  కేటాయించారని, స్పోర్ట్స్‌కోటాలో స‌ర్టిఫికేట్ల‌ను శాప్ ద్వారా అనేక ద‌శ‌ల్లో ప‌రిశీలించామ‌ని పేర్కొన్నారు. ఆరోపణలు చేసే వారు ఆధారాలు చూపాలని లోకేశ్ సవాల్ చేశారు.  లో నియమితులైన 372 మంది సామాజిక వర్గాల వారీగా కూడా వివరాలు ఇచ్చామని చెప్పారు: OC–46, BC–185, SC–112, ST–29 అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సెప్టెంబరు 21న డీఎస్‌సీ–2025లో అవినీతి లేదా ప్రశ్నపత్రం లీక్ జరగలేదని, అభ్యర్థులు తమ ప్రతిభతో ఉద్యోగాలు సాధించారని చెప్పారు.

ఉపాధ్యాయులు ఎందుకు వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?

తాము ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందలేదని  ఉద్యోగాలు పొందిన స్పోర్ట్స్‌ కోటా కింద ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు అంటున్నారు. టీఈటీ  అర్హతతో పాటు తమ క్రీడా విజయాలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్నాయని;

వాటిని అధికారికంగా పరిశీలించిన తర్వాతే ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొంటున్నారు.  కొంతమంది ఉపాధ్యాయులు తమ సర్టిఫికెట్లలో కొన్ని గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జారీ అయినవని కూడా చూపించారు. తమపై “ఫేక్” అనే ముద్ర వేయడం వల్ల పాఠశాలల్లో విద్యార్థులు, సహచర ఉపాధ్యాయుల ముందు ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తంగా ప‌రిశీలిస్తే  వైసీపీ అనేక ఆరోపణలు చేసింది, సీబీఐ విచారణ కోరుతోంది. మరోవైపు ప్రభుత్వం అవినీతి జరగలేదని, ప్రక్రియ నిబంధనల ప్రకారం జరిగిందని చెబుతోంది. అయితే కొన్ని నియామకాలకు సంబంధించి న్యాయస్థానాల్లో అభ్యంతరాలు/పిటిషన్లు కూడా వచ్చాయి. ఉదాహరణకు, ఒక అభ్యర్థి స్పోర్ట్స్ సర్టిఫికెట్‌ను శాప్ ధ్రువీకరించలేదన్న కారణంతో తన నియామకం నిలిచిపోయిందని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మూడు వాదనల్లో ఏది వాస్తవమో తేల్చడానికి స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. సర్టిఫికేట్ల అధికారిక  ధ్రువీకరణ, నియామక రికార్డులు, సంబంధిత  ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు, కోర్టు/దర్యాప్తు ఫలితాలు కీలకం కానున్నాయి.

NEWS AT A GLANCE

https://www.ndtv.com/india-news/violence-erupts-during-andhra-protest-over-teacher-hiring-under-sports-quota-12076050?utm

https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/dsc-teachers-protest-against-false-claims-1560135.html?utm

https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/krishna/vijayawada-dsc-sports-quota-teachers-attack-government-criminal-cases-suchi-1559988.html?utm

https://www.ndtv.com/andhra-pradesh-news/ys-jagan-reddy-seeks-cbi-probe-in-2025-teacher-recruitment-nara-lokesh-responds-11936531?utm

https://www.scribd.com/document/864418270/notification-5-1?utm

https://www.deccanchronicle.com/amp/southern-states/andhra-pradesh/mega-dsc-2025-nara-lokesh-dares-jagan-to-debate-in-assembly-1979903?utm

https://www.deccanchronicle.com/southern-states/andhra-pradesh/no-record-of-question-paper-leaks-during-tdp-rule-chandrababu-1989289?utm

By RAVIKANTI SRINIVAS

]]>
https://dakshinam.org/2026/09/23/%e0%b0%a1%e0%b1%80%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%80%e0%b0%aa%e0%b1%88-%e0%b0%ae%e0%b1%86%e0%b0%97%e0%b0%be-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-%e0%b0%86%e0%b0%82/feed/ 0 1849
Former Maoists into public life, new political party to come up https://dakshinam.org/2026/09/22/former-maoists-into-public-life-new-political-party-to-come-up/ https://dakshinam.org/2026/09/22/former-maoists-into-public-life-new-political-party-to-come-up/#respond Tue, 22 Sep 2026 03:51:27 +0000 https://dakshinam.org/?p=1823 It was all on expected lines.

The surrendered Maoists, who once hid in thick forests in remote areas and operated from what was described as their ‘Jungle Raj’, are now coming into the open after surrendering before the governments of different States.

They are now planning a comeback — not in the olive-green attire they once wore, but in the much-honoured and respected khadi, the traditional dress of Indian politicians.

Introductory Memo

The Naxalites appear to be preparing for a comeback, this time in a completely different form. No longer operating from forests or underground locations, some former Maoists are now looking towards electoral politics and public life.

According to reports published in a section of the media, surrendered Maoists are planning to float a political party named ‘Jana Telangana’. The proposed party is expected to approach the Election Commission of India (ECI) for recognition. A report published on September 21 said the names associated with the proposed political activity include Lanka Papi Reddy alias Lachhanna, advocate Balla Ravindra Nath, former Singareni Karimika Sangham leader Gurijala Ravinder, and Ajya Balne and Sadanandam of Huzurabad. The report also said the proposed party is looking at contesting the graduate MLC elections.

If the proposed political formation takes shape, it could alter the political equations in Telangana to some extent. However, at this stage, there is little evidence to suggest that it could emerge as an alternative to any of the established political parties.

Analytical View

Maoists and Naxalites who remained underground for decades had to live with the constant threat of arrest, encounter and exposure. Forest hideouts and safe houses in urban areas became part of their survival strategy.

Surrender changed that equation.

In practical terms, it gave them an opportunity to return to ordinary public life. They no longer have to disappear into forests to protect themselves. They can seek medical treatment openly, meet people, travel and discuss public issues without living under the restrictions imposed by an underground existence.

The transition from an armed underground movement to democratic politics, however, is a completely different journey.

The question now is whether former Maoists can transform their ideological beliefs and decades of underground experience into a political programme that can operate within the constitutional and democratic framework.

Devji announces political ambitions

Several former Maoists have chosen Telangana for surrender, and the State has witnessed a series of high-profile surrenders in recent years.

One of the most significant was the surrender of Tippiri Tirupati alias Devji, a senior CPI (Maoist) leader who had spent more than four decades underground. He surrendered before Telangana Police in February 2026 along with other senior leaders, including Malla Raji Reddy alias Sangram.

Devji subsequently indicated that his public life would not necessarily end with surrender.

“I have decided to work on public issues in legal framework. That means I wish to continue my political life. The ideology, which I believed for decades will be my guiding force in my political journey,” he said on February 24, 2026.

His statement assumes significance because it indicates that at least some former Maoist leaders are not viewing surrender merely as an end to their underground existence, but as a possible beginning of another phase of public activity.

There are already examples before them.

Seethakka

Danasari Anasuya alias Seethakka is perhaps the most prominent example of a former Naxalite entering electoral politics and eventually reaching the State Cabinet.

Seethakka joined the Naxalite movement as a teenager and remained associated with the movement for more than a decade. She surrendered in 1997 and subsequently pursued education and became a lawyer. She entered electoral politics through the Telugu Desam Party in 2004 and joined the Congress in 2017. She was elected from Mulugu on a Congress ticket and later became a Minister in the Telangana government.

Her journey from an underground armed movement to mainstream electoral politics provides an important example for those former Maoists who are now contemplating a political career.

Etala Rajender

Etala Rajender, the former BRS minister and present BJP MP, also had a background in student politics associated with the radical Left. He was active in the Progressive Democratic Students Union (PDSU), a student organisation associated with the faction led by the late Chandra Pulla Reddy.

He later moved into business and mainstream politics, eventually becoming a prominent political figure in Telangana.

The journeys of people with such diverse political backgrounds demonstrate that political careers can take unexpected turns.

For the former Maoists now contemplating electoral politics, these examples may provide the confidence that an underground past does not necessarily prevent a return to mainstream public life.

Operation Kagar / Operation Black Forest

The transformation of the Maoist movement cannot be understood without looking at the intense security operations carried out against Left-Wing Extremism.

After coming to power at the Centre in 2014, the Narendra Modi-led NDA government adopted an increasingly offensive approach towards Left-Wing Extremism, treating Maoist violence not only as a socio-economic and developmental problem but also as an internal-security challenge.

Among the major operations was Operation Kagar, conducted against Maoist formations in the forested areas of central India.

In April-May 2025, security forces launched a major operation in the Karreguttalu hill range along the Telangana-Chhattisgarh border. The operation involved the CRPF, CoBRA, District Reserve Guards and Telangana security personnel. The Indian Express reported that the operation covered about 288 sq km and involved around 10,000 personnel.

Another major operation in May 2025 resulted in the killing of Nambala Keshava Rao alias Basavaraju, the CPI (Maoist) general secretary, in the Abujhmad forests of Chhattisgarh. The operation lasted about 50 hours and dealt a major blow to the organisation’s senior leadership.

The security offensive, combined with organisational weaknesses, loss of influence and a growing number of surrenders, significantly altered the position of the Maoist movement.

Surrenders

The last few years have witnessed a steady stream of Maoist cadres and senior leaders surrendering before security forces.

Telangana, in particular, has witnessed several high-profile surrenders. The February 2026 surrender of Devji, Raji Reddy and other senior leaders was described by official and media reports as a major setback to the remaining Maoist leadership.

Devji had spent more than four decades underground. Raji Reddy had also remained underground for several decades and held senior organisational responsibilities. Other senior leaders who surrendered around the same period included Bade Chokka Rao alias Damodar and Nune Narasimha Reddy alias Ganganna.

The significance of these surrenders lies not merely in the number of weapons surrendered or cadres who came overground. More importantly, several of the people giving up arms belonged to the senior leadership that had sustained the organisation for decades.

The Telangana government has subsequently maintained that the State is free from armed Maoist activity. Whether any isolated armed cadres remain is a matter for security agencies to assess, but the scale of the underground network is clearly very different from what existed in the past.

Invitation by CPI

The Communist Party of India (CPI) has also sought to make use of the changing situation by extending an invitation to surrendered Naxalite leaders to enter mainstream democratic politics.

CPI leaders have publicly appealed to surrendered Maoists to abandon armed politics and participate in the democratic process.

This is significant because political rehabilitation could become one of the possible routes available to former underground cadres who want to continue their ideological and public engagement without returning to armed activity.

Some former Maoist leaders have already begun interacting with mainstream political organisations.

Tippiri Tirupati, Malla Raji Reddy and other recently surrendered leaders have met political leaders and government representatives after coming overground. Devji and other former Maoist leaders also met Chief Minister A. Revanth Reddy in February 2026, where rehabilitation and their return to mainstream life were discussed.

News at a Glance:

Blood in our hands

https://frontline.thehindu.com/the-nation/operation-kagar-chhattisgarh-adivasi-violence-rights-bastar-security-forces/article69403236.ece

Disha Daily:

New party of former Naxalites to be formed soon

https://www.dishadaily.com/telangana/new-party-of-former-naxalites-to-be-formed-soon-in-telangana-587047

Maoist leaders Deviji, Damodar announces political entry

https://www.andhrajyothy.com/2026/telangana/maoist-leaders-devji-and-damodhar-announce-political-entry-plans-to-contest-elections-and-pursue-democratic-struggles-1498393.html

Telangana Maoist leaders meet CM Revanth Reddy, discuss political party formation

https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-maoist-leaders-meet-cm-revanth-reddy-discuss-political-party-formation-239514

Devji announces to continue his political life

https://www.eenadu.net/videos/playvideo/top-maoist-leader-devji-surrendered-infront-of-dgp-shivadhar-reddy/1/76684

]]>
https://dakshinam.org/2026/09/22/former-maoists-into-public-life-new-political-party-to-come-up/feed/ 0 1823